Aakash Chopra | బుమ్రా ఐపీఎల్ ఆడకుంటే ప్రపంచం ఏమీ ఆగిపోదు : ఆకాశ్ చోప్రా
స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఐపీఎల్ ఎంట్రీపై మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు చేశాడు. 'ఈ సీజన్లో బుమ్రా కొన్ని మ్యాచ్‌లు ఆడకుంటే ప్రపంచం ఏమీ ఆగిపోదని అన్నాడు. ఐపీఎల్లో బుమ్రా ఏడు మ్యాచ్‌లు ఆడకపోయినంత మాత్రాన ప్రపంచం ఏమీ ఆగిపోద'ని అన్నాడు. ఐపీఎల్ పదహారో సీజన్ మార్చి 31న మొదలు కానుంది.
Aakash Chopra : భారత జట్టు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా పదహారో సీజన్ ఐపీఎల్‌కు అందుబాటులో ఉంటాడా? లేదా? అనే విషయంలో ఇంకా స్పష్టత లేదు. అందుకు కారణం.. జాతీయ క్రికెట్ అకాడమీ ఇంకా బుమ్రాకు ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఈ స్టార్ పేసర్ ఐపీఎల్ ఎంట్రీపై మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘ఈ సీజన్లో బుమ్రా కొన్ని మ్యాచ్‌లు ఆడకుంటే ప్రపంచం ఏమీ ఆగిపోదని అన్నాడు.
ఐపీఎల్లో బుమ్రా ఏడు మ్యాచ్‌లు ఆడకపోయినంత మాత్రాన ప్రపంచం ఏమీ ఆగిపోదు. బుమ్రా మనదేశ సంపద. ఒకవేళ బీసీసీఐ అతడిని ఐపీఎల్‌కు అనుమతించకుంటే ముంబై ఇండియన్స్ అందుకు ఒప్పుకుంటుంది’ అని ఆకాశ్ చోప్రా తెలిపాడు. అంతేకాదు ఐపీఎల్లో ఈ స్టార్ పేసర్‌పై వర్క్‌లోడ్ పడకుండా చూడాల్సిన బాధ్యత ముంబై ఇండియన్స్, బీసీసీఐపై ఉందని ఈ మాజీ క్రికెటర్ అన్నాడు. ఎన్సీఏలో ఉన్న బుమ్రా త్వరలోనే జట్టుతో కలవనున్నాడు. ఈ ఏడాది టీమిండియా రెండు మెగా టోర్నీలు ఆడనుంది. ఒకటేమో.. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్, రెండోది వన్డే వరల్డ్ కప్. ఈ ప్రధాన టోర్నీలకు బుమ్రా ఫిట్‌గా ఉండడం చాలా ముఖ్యం.
ఇంగ్లండ్ టూర్లో…
భారత జట్టుకు యార్కర్ కింగ్ బుమ్రా ఎంత కీలక ఆటగాడో తెలిసిందే. అందుకని అతని విషయంలో రిస్క్ తీసుకునేందుకు బీసీసీఐ ఏమాత్రం సిద్ధంగా లేదు. అతను పూర్తిగా కోలుకుని ఫిట్నెస్ సంపాదించేంత వరకు ఆగాలని భావిస్తోంది. కాబట్టే బుమ్రాను ఆస్ట్రేలియాతో బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ ఆఖరి టెస్టులకు, మూడు వన్డేల సిరీస్‌కు కూడా బీసీసీఐ ఎంపిక చేయలేదు. పోయిన ఏడాది ఇంగ్లండ్ టూర్ సందర్భంగా బుమ్రా స్ట్రెస్ ఫ్రాక్చర్‌తో బాధ పడ్డాడు. దాంతో, ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్ కూడా ఆడలేదు. వెన్నునొప్పితో బాధపడుతున్న బుమ్రా క్రికెట్‌కు దూరమై దాదాపు ఐదు నెలలు కావొస్తోంది.
తొలి మ్యాచ్‌లో తలపడేది..?
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ పదహారో సీజన్ మార్చి 31న మొదలు కానుంది. 15 సీజన్లుగా ఫ్యాన్స్‌ను అలరిస్తున్న ఈ మెగా టోర్నీ మరోసారి వేసవి వినోదం పంచేందుకు రెడీ అవుతోంది. తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. ఈసారి ప్రతి జట్టు సొంత మైదానంలో ఏడు మ్యాచ్‌లు ఆడనుంది. అంతేకాదు ప్రతి టీమ్ ఇంప్యాక్ట్ ప్లేయర్‌ను కూడా తీసుకునే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి
Dinesh Karthik | నేనూ ఆ దశ ఎదుర్కొన్నా.. టాయిలెట్‌కు వెళ్లి ఏడ్చా : దినేశ్ కార్తిక్
Harmanpreet Kaur | టీ20ల్లో హర్మన్‌ప్రీత్ కౌర్ సరికొత్త రికార్డు.. తొలి క్రికెటర్‌గా ఘనత
Hardhik – Natasha | హార్ధిక్ పాండ్యా – నటాషా హల్దీ, మెహందీ వేడుక ఫొటోలు చూశారా..?
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

