Dinesh Karthik | నేనూ ఆ దశ ఎదుర్కొన్నా.. టాయిలెట్‌కు వెళ్లి ఏడ్చా : దినేశ్ కార్తిక్
పేలవమైన ఆటతీరుతో జట్టుకు భారంగా మారుతున్న టీమిండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌కు మాజీ వికెట్ కీపర్ దినేశ్ కార్తిక్ బాసటగా నిలిచాడు. ఫామ్ కోల్పోవడం, పరుగులు సాధించలేకపోవడం అనేది చాలా కష్టమైన దశ అని కార్తిక్ అన్నాడు. 'నేను కూడా ఆ దశను అనుభవించాను. డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిన తర్వాత.. నేరుగా టాయిలెట్‌కు వెళ్లి ఒకటి రెండు కన్నీటి చుక్కలు కార్చాను' అని కార్తిక్ తెలిపాడు.
Dinesh Karthik : టీమిండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ప్రస్తుతం కెరీర్లోనే కష్టమైన దశలో ఉన్నాడు. ఫామ్ కోల్పోయి విమర్శల పాలవుతున్నాడు. పేలవమైన ఆటతీరుతో జట్టుకు భారంగా మారుతున్న అతడికి మాజీ వికెట్ కీపర్ దినేశ్ కార్తిక్ బాసటగా నిలిచాడు. ఫామ్ కోల్పోవడం, పరుగులు సాధించలేకపోవడం అనేది ప్రతి క్రికెటర్‌కు చాలా కష్టమైన దశ అని కార్తిక్ అన్నాడు. రాహుల్ విఫలం కావడంపై అతను దిగులు చెందాడు. అంతేకాదు ఒకప్పుడు తాను ఫామ్‌లో లేక ఇబ్బంది పడిన రోజులను అతను గుర్తు చేసుకున్నాడు.
‘ఇదే మన చివరి ఇన్నింగ్స్ అని తెలిశాక ఎంతో బాధగా ఉంటుంది. నేను కూడా ఆ దశను అనుభవించాను. డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిన తర్వాత.. నేరుగా టాయిలెట్‌కు వెళ్లి ఒకటి రెండు కన్నీటి చుక్కలు కార్చాను’ అని కార్తిక్ తెలిపాడు. కేఎల్ రాహుల్‌తో కలిసి కార్తిక్ దేశవాళీలో కర్నాటక తరఫున ఎన్నో మ్యాచ్‌లు ఆడాడు.
మూడు ఇన్నింగ్స్‌ల్లో..
బోర్డర్ – గవాస్కర్ తొలి రెండు టెస్టుల్ఓ రాహుల్ తీవ్రంగా నిరాశ పరిచాడు. మూడు ఇన్నింగ్స్‌ల్లో కలిపి కేవలం 38 రన్స్ చేశాడంతో. దాంతో, అతడిని తప్పించి ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్‌కు అవకాశం ఇవ్వాలని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆఖరి రెండు టెస్టులకు రాహ్ల్ను పక్కనపెట్టే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే.. హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం రాహుల్‌ను వెనకేసుకొచ్చారు. అతనికి మరిన్ని అవకాశాలు ఇస్తామని తెలిపారు. ఒకవేళ అదే జరిగితే రాహుల్ ఈసారి తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. మార్చి 1న ఇండోర్‌లో మూడో టెస్టు ప్రారంభం కానుంది. తొలి రెండు మ్యాచ్‌లు గెలిచిన భారత్ నాలుగు టెస్టుల సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలో ఉంది.
Read More
IPL | ఐపీఎల్ బెస్ట్ కెప్టెన్‌గా రోహిత్.. బెస్ట్ బౌలర్, ఉత్తమ బ్యాటర్ ఎవరంటే..?
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush | ధనుష్ రాజకీయాల్లోకి రావడం ఖయమా.. విజయ్ పార్టీ నేతలు అప్పుడే సెటైర్స్ స్టార్ట్ చేశారుగా..!
పెద్దవాగులో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలి : ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి
Health Tips | స్వీట్లు తినడం మానేసినా షుగర్ లెవల్స్ తగ్గడం లేదా.. అయితే కారణం ఇదే..!
Rahul Gandhi | రాహుల్‌గాంధీ కాన్వాయ్‌లో ప్రమాదం.. ఒకదానినొకటి ఢీకొన్న ఐదు కార్లు, అంబులెన్స్..!
Medak | నకిలీ విత్తనాలతో మోసపోయిన రైతులు.. ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిస్తున్న షాపు యజమాని
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

