IPL | ఐపీఎల్ బెస్ట్ కెప్టెన్‌గా రోహిత్.. బెస్ట్ బౌలర్, ఉత్తమ బ్యాటర్ ఎవరంటే..?
స్టార్‌స్పోర్ట్స్ రోహిత్ శర్మ ఐపీఎల్లో బెస్ట్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. జస్ప్రీత్ బుమ్రా బెస్ట్ బౌలర్‌గా, ఏబీ డివిలియర్స్ బెస్ట్ బ్యాటర్‌గా సెలక్ట్ అయ్యారు. రాయల్ ఛాలెంజర్స్ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇన్క్రెడిబుల్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ అవార్డు అందుకున్నాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ ఆల్‌రౌండర్ ఆండ్రూ రస్సెల్ ఇన్క్రెడిబుల్ ఇంప్యాక్ట్ ప్లేయర్ అవార్డు లభించింది.
IPL : మరికొద్ది రోజుల్లో ఇండియాన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ మొదలుకానుంది. ఐపీఎల్ 15 సీజన్లకు గుర్తుగా స్టార్‌స్పోర్ట్స్ ఛానెల్ తాజాగా ప్రత్యేక ప్రోగ్రాం నిర్వహించింది. ఈ సందర్భంగా ఈ లీగ్‌లో కేటగిరీల వారీగా ఉత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లకు అవార్డులు ప్రకటించింది. భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్లో బెస్ట్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని వెనక్కి నెట్టి అతను స్టార్‌స్పోర్ట్స్ ఇన్క్రెడిబుల్ అవార్డు అందుకున్నాడు.
రోహిత్ సారథ్యంలో ముంబై ఇండియన్స్ నాలుగు సార్లు (2013,2015,2017 & 2019) ఐపీఎల్ టైటిల్ గెలిచింది. మొత్తంగా ఆ జట్లు ఐదు సార్లు ఐపీఎల్ విజేతగా అవతరించింది. ఈ లీగ్‌లో విజయవంతమైన ఫ్రాంఛైజీగా ముంబై ఇండియన్స్ గుర్తింపు సాధించింది.
బెస్ట్ బౌలర్- ముంబై ఇండియన్స్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా బెస్ట్ బౌలర్‌గా ఎంపికయ్యాడు.15 సీజన్లలో బుమ్రా 145 వికెట్లు పడగొట్టాడు. అతను 2013లో ముంబై ఇండియన్స్ జట్టులో చేరాడు. ఆ జట్టు ఐపీఎల్ ట్రోఫీలు గెలవడంలో ఈ స్పీడ్‌స్టర్ కీలక పాత్ర పోషించాడు. యార్కర్ కింగ్‌గా పాపులర్ అయిన బుమ్రా ఐపీఎల్లో అత్యుత్తమ బౌలర్లలో ఒకడు.
బెస్ట్ బ్యాటర్ – దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ బెస్ట్ బ్యాటర్‌గా సెలక్ట్ అయ్యాడు. మిస్టర్ 360గా పేరొందిన ఇతను ఐపీఎల్లో ఎన్నో విధ్వంసక ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఈ స్టార్ బ్యాటర్ తన ఐపీఎల్ కెరీర్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్లకు ఆడాడు. డివిలియర్స్ తన మార్క్ షాట్లతో చెలరేగి ఆడి అభిమానులను అలరించాడు. 184 మ్యాచ్‌లు ఆడిన అతను 151.69 స్ట్రయిక్ రేటుతో 5,162 రన్స్ చేశాడు. మూడు సెంచరీలు, 40 అర్థ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 133.
బెస్ట్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ – రాయల్ ఛాలెంజర్స్ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇన్క్రెడిబుల్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ అవార్డు అందుకున్నాడు. 2016 సీజన్లో కోహ్లీ రెచ్చిపోయి ఆడాడు. నాలుగు సెంచరీలు బాదిన అతను 973 పరుగులు చేశాడు. కోహ్లీ చెలరేగి ఆడడంతో ఆ ఏడాది ఆర్సీబీ ఫైనల్ చేరింది.
ఇన్క్రెడిబుల్ ఇంప్యాక్ట్ ప్లేయర్ – కోల్‌కతా నైట్ రైడర్స్ ఆల్‌రౌండర్ ఆండ్రూ రస్సెల్ ఇన్క్రెడిబుల్ ఇంప్యాక్ట్ ప్లేయర్ అవార్డుకి ఎంపికయ్యాడు. ఐపీఎల్లో ప్రమాదకరమైన ఆల్రౌండర్లలో రస్సెల్ ఒకడు. అతను ఒంటిచేత్తో కేకేఆర్‌ను గెలిపించిన సందర్భాలు ఉన్నాయి.
బెస్ట్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ – ఒక సీజన్లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన చేసిన బౌలర్‌గా సనీల్ నరైన్ అవార్డు అందుకున్నాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఆడిన తొలి సీజన్లోనే నరైన్ అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేశాడు. 2012లో అతను 5.5 ఎకానమీతో 24 వికెట్లు తీశాడు. ఆ ఏడాది కేకేఆర్ ఐపీఎల్ ట్రోఫీ గెలవడంలో ఈ ఆల్‌రౌండర్ కృషి ఎనలేనిది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

