మెల్బోర్న్ : ఆస్ట్రేలియా టీ20 అత్యుత్తమ ఆటగాడు, జట్టు కెప్టెన్ అరోన్ ఫించ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఆస్ట్రేలియాకు తొలిసారి టీ20 ప్రపంచకప్‌ను అందించిన 36 ఏళ్ల ఫించ్ పొట్టి ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పాడని క్రికెట్ ఆస్ట్రేలియా తన అధికారిక ట్విటర్ అకౌంట్లో తెలిపింది. ఫించ్ 2021లో జరిగిన టీ20 ప్రపంచకప్‌ను ఆస్ట్రేలియాకు అందించాడు.
2011 జనవరిలో టీ20 మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ఆరంభించిన ఫించ్ 5 టెస్టులు(278 పరుగులు), 146 వన్డేలు(5406 పరుగులు, 17 సెంచరీలు), 103 టీ20(3120 పరుగులు, 2 సెంచరీలు) మ్యాచ్‌లు ఆడాడు.