ఆస్ట్రేలియాను ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఆదుకుంటున్నాడు. హాఫ్ సెంచరీకి చేరువలో ఉన్నాడు వార్నర్. 29 బంతుల్లో వార్నర్ 49 పరుగులు చేశాడు. 10 ఓవర్లకు ఆస్ట్రేలియా మూడు వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది. కాకపోతే కీలక వికెట్లను ఆస్ట్రేలియా కోల్పోయింది. కెప్టెన్, ఓపెనర్ ఆరున్ ఫించ్.. డక్ అవుట్ కాగా.. మార్ష్, స్మిత్ క్యాచ్ అవుట్ అయ్యారు. ప్రస్తుతం క్రీజులో వార్నర్, మ్యాక్స్వెల్ ఉన్నారు.