Steven Smith | ఓపెనర్‌గా మళ్లీ ఫ్లాప్.. వార్నర్‌ను మరిపించలేక స్మిత్ అష్టకష్టాలు
Steven Smith : ప్రపంచంలోని అత్యత్తమ టెస్టు ఆటగాడైన స్టీవ్ స్మిత్(Steven Smith) ఓపెనర్ పాత్రలో మాత్రం ఇమడలేకపోతున్నాడు. ఈమధ్యే వీడ్కోలు పలికిన డేవిడ్ వార్నర్(David Warner) స్థానాన్ని భర్తీ చేయలేక అపసోపాలు...
Steven Smith : ప్రపంచంలోని అత్యత్తమ టెస్టు ఆటగాడైన స్టీవ్ స్మిత్(Steven Smith) ఓపెనర్ పాత్రలో మాత్రం ఇమడలేకపోతున్నాడు. సుదీర్ఘ ఫార్మాట్లో ఖతర్నాక్ ఇన్నింగ్స్‌లకు కేరాఫ్ అయిన స్మిత్ ఆస్ట్రేలియాకు శుభారంభాలు ఇవ్వలేక చతికిలపడతున్నాడు. ఈమధ్యే వీడ్కోలు పలికిన డేవిడ్ వార్నర్(David Warner) స్థానాన్ని భర్తీ చేయలేక అపసోపాలు పడుతున్నాడు.
టాపార్డర్‌లో డేవిడ్ భాయ్‌లో విధ్వంసక ఇన్నింగ్స్‌లు ఆడడం ఎంత కష్టమో ఇప్పుడు స్మిత్‌కు తెలిసిస్తోంది. పాకిస్థాన్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో వరుసగా రెండు గోల్డెన్ డక్స్.. ఇప్పుడు వెస్టీండీస్‌పై కూడా అదే తరహా ఆటతో విమర్శలకు గురవుతున్నాడు. ఇప్పటివరకూ ఆడిన మూడు టెస్టుల్లో ఓపెనర్‌గా స్మిత్ అత్యధిక స్కోర్ 12.
ఇదివరకు స్మిత్ మిడిలార్డర్లో వచ్చేవాడు. నాలుగో స్థానంలో అతడు వచ్చేసరికి బంతి పాతబడేది. అప్పుడు లబూషేన్‌తో కలిసి హాయిగా హాఫ్ సెంచరీలు, సెంచరీలు కొట్టేవాడు. టెస్టుల్లో దాదాపు 60 సగటు ఉంది. ఇప్పటివరకూ 106 టెస్టులు ఆడిన స్మిత్ 9,537 రన్స్ కొట్టడమే కాకుండా ఏకంగా 32 శతకాలు సాధించాడు. కానీ, వార్నర్ వీడ్కోలుతో స్మిత్‌కు ఓపెనర్ చాన్స్ వచ్చింది. బిగ్‌బాష్ లీగ్(BBL 2023-24)లో సిడ్నీ సిక్సర్స్ తరఫున ఓపెనర్‌గా ఆడిన అనుభవం అతడి సొంతం.
A great review by West Indies to dismiss Smith!
📹 https://t.co/Teypr0gGX5 | #AUSvWI pic.twitter.com/xlVu8r1Bm0
— ESPNcricinfo (@ESPNcricinfo) January 26, 2024
దాంతో, వరల్డ్ కప్ హీరో ట్రావిస్ హెడ్(Travis Head), మ్యాట్ రెన్షా(Matt Renshaw) వంటి కుర్రాళ్లను కాదని సెలెక్టర్లు స్మిత్‌కు చాన్స్ ఇచ్చారు. కానీ, ఈ రన్ మెషీన్ టెస్టుల్లో కొత్త బంతిని ఎదుర్కోలేకపోతున్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన రెండు టెస్టుల్లోనూ స్మిత్ స్వల్ప స్కోర్‌కే వెనుదిరిగి నిరాశ పరిచాడు. ప్రస్తుతానికి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(WTC 2023-25) పట్టికలో టాప్‌లో ఉన్న ఆస్ట్రేలియాకు ఇకపై ప్రతి టెస్టు కీలకమే. అందుని ఓపెనర్‌గా అతడిని తప్పించి నాలుగో స్థానానికే పంపిస్తారా? లేదా మరికొన్ని మ్యాచ్‌ల్లో ఓపెనింగ్ చాన్స్ ఇస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.
ఇవి కూడా చదవండి
- WPL 2024 | ఐసీసీ అవార్డుతో జాక్‌పాట్.. డబ్ల్యూపీఎల్ జట్టులో శ్రీలంక ఆల్‌రౌండర్
- Brain Health | మెదడు ఆరోగ్యం మెరుగవ్వాలంటే ఇవి కీలకం
- Hyd Metro | మెట్రో రెండో దశ విస్తరణపై ఎండీ ఎన్వీఎస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..!
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

