పెర్త్: పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా భారీ స్కోరు చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 346/5తో శుక్రవారం రెండో రోజు తొలి ఇన్నిం గ్స్ కొనసాగించిన ఆసీస్.. 487 పరుగులకు ఆలౌటైంది. మిషెల్ మార్ష్ (90; 15 ఫోర్లు, ఒక సిక్సర్) ధాటిగా ఆడాడు. పాక్ బౌలర్లలో అరంగేట్ర పేసర్ జమాల్ ఆరు వికెట్లు పడగొట్టాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన పాకిస్థాన్ ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది. అబ్దుల్లా షఫీఖ్ (42), ఇమామ్ (38 బ్యాటింగ్), కెప్టెన్ షాన్ మసూద్ (30) ఫర్వాలేదనిపించారు. చేతిలో 8 వికెట్లు ఉన్న పాక్.. ప్రత్యర్థి స్కోరుకు ఇంకా 355 పరుగులు వెనుకబడి ఉంది.