గాలె : సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులోనూ శ్రీలంకను బ్యాటింగ్ కష్టాలు వెంటాడుతున్నాయి. గురువారం మొదలైన రెండో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లంకేయులు.. తొలి ఇన్నింగ్స్లో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 229/9 పరుగులు చేశారు. చండిమాల్ (74), కుశాల్ (59 నాటౌట్) రాణించారు. తన కెరీర్లో ఆఖరి టెస్టు ఆడుతున్న కరుణరత్నె (36) ఫర్వాలేదనిపించాడు. స్టార్క్ (3/37), లియాన్ (3/76) రాణించారు.