మ్యాక్స్‌వెల్ హాఫ్ సెంచరీ.. ఆఫ్ఘనిస్తాన్ టార్గెట్ 169
Maxwell hitting:భారీ తేడాతో నెగ్గాల్సిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌కు 169 పరుగుల టార్గెట్‌ను విసిరింది ఆస్ట్రేలియా. టీ20 వరల్డ్‌కప్‌లో ఇవాళ తొలుత టాస్ గెలిచిన ఆఫ్ఘన్ జట్టు ఆస్ట్రేలియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. అయితే ఆస్ట్రేలి
అడిలైడ్: భారీ తేడాతో నెగ్గాల్సిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌కు 169 పరుగుల టార్గెట్‌ను విసిరింది ఆస్ట్రేలియా. టీ20 వరల్డ్‌కప్‌లో ఇవాళ తొలుత టాస్ గెలిచిన ఆఫ్ఘన్ జట్టు ఆస్ట్రేలియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. అయితే ఆస్ట్రేలియా ఓపెనర్ గ్రీన్ కేవలం మూడు పరుగులకే నిష్క్రమించాడు. ఆ తర్వాత వార్నర్, మిచెల్ మార్షలు స్కోరు బోర్డును పరుగెత్తించే ప్రయత్నం చేశారు. వార్నర్ 25 రన్స్ చేసి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇక మార్ష్ కొంత మెరిపించినా.. అతను కూడా 45 పరుగుల వద్ద ఔటయ్యాడు.
Australia have set Afghanistan a target of 169 🎯
Can 🇦🇫 chase this down? #AUSvAFG | #T20WorldCup | 📝: https://t.co/p7lkYsES20 pic.twitter.com/0fxFeSBaRP
— ICC (@ICC) November 4, 2022
లోయర్ మిడిల్ ఆర్డర్లో వచ్చిన మ్యాక్స్‌వెల్ భారీ షాట్లతో అలరించాడు. ఆఫ్ఘన్ బౌలర్లు కట్టుదిట్టంగా వేస్తున్నా.. అడపాదడపా భారీ షాట్లు ఆడాడు. మ్యాక్స్‌వెల్ 32 బంతుల్లో ఆరు బౌండరీలు, రెండు సిక్సర్లతో 54 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. హిట్టర్ స్టోయినిస్ 25 రన్స్ చేశాడు. ఆసీస్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 168 రన్స్ చేసింది.
ఒకవేళ సెమీస్ చేరాలంటే ఆస్ట్రేలియా బెటర్ రన్‌రేట్‌తో నెగ్గాల్సి ఉంటుంది. అంటే ఆఫ్ఘన్‌ను 106 పరుగుల లోపే ఔట్ చేస్తే, అప్పుడు ఇంగ్లండ్ కన్నా బెటర్ రన్‌రేటును ఆస్ట్రేలియా సాధిస్తుంది. ఎందుకంటే ఉత్తమ రన్‌రేట్‌తో ఇప్పటికే ఆ గ్రూపు నుంచి న్యూజిలాండ్ సెమీస్‌కు దాదాపు ఎంట్రీ ఖరారు చేసుకున్నది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

