టౌన్స్విల్లె: జింబాబ్వేతో ఆదివారం జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా అయిదు వికెట్ల తేడాతో గెలుపొంది సిరీస్లో శుభారంభం చేసింది. పేసర్ కామెరూన్ గ్రీన్ అయిదు వికెట్ల ప్రదర్శనతో ఆసీస్ అయిదు వికెట్ల తేడాతో విజయాన్నందుకుని మూడు మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. జింబాబ్వే 47.3 ఓవర్లలో 200 పరుగులకు ఆలౌటయింది.లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా 5 వికెట్లకు 201 పరుగులు చేసి గెలుపొందింది.