జొకోవిచ్‌కు ఝలక్.. వీసా రద్దు చేసిన ఆస్ట్రేలియా
Novak Djokovic | ప్రపంచ నంబర్‌వన్ నోవాక్ జొకోవిచ్‌కు (Novak Djokovic) మెల్బోర్న్లో ఊహించని పరిణామం ఎదురైంది. కరోనా టీకా తీసుకోకపోవడంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం జొకో ఎంట్రీ వీసాను రద్దు చేసింది

మెల్బోర్న్: ప్రపంచ నంబర్‌వన్ నోవాక్ జొకోవిచ్‌కు (Novak Djokovic) మెల్బోర్న్లో ఊహించని పరిణామం ఎదురైంది. కరోనా టీకా తీసుకోకపోవడంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం జొకో ఎంట్రీ వీసాను రద్దు చేసింది. దీంతో ఆయన సుమారు ఎనిమిది గంటలపాటు విమానాశ్రయంలోనే వేచిఉండాల్సి వచ్చింది. వైద్యపరమైన మినహాయింపులతో ఆస్ట్రేలియా ఓపెన్‌లో పాల్గొనేందుంకు జొకో.. మెల్బోర్న్ విమానాశ్రయానికి చేరుకున్నాడు. అయితే అక్కడి అధికారులు ప్రపంచ టాప్సీడ్ను అడ్డుకున్నారు. వీసా దరఖాస్తు విషయంలో పొరపాట్లతోపాటు, తగిన ఆధారాలు సమర్పించకపోవడంతో ఆస్ట్రేలియా బోర్డర్ ఫోర్స్ అనుమతి నిరాకరించింది. వ్యాక్సినేషన్‌పై ఆస్ట్రేలియా ఓపెన్ నుంచి ప్రత్యేక మినహాయింపు పొందిన జొకోకు వీసా సమస్య కొత్త తలనొప్పులు తీసుకొచ్చిపెట్టింది.
జొకోవిచ్ ఆస్ట్రేలియా ఓపెన్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనున్నాడు. ఇప్పటివరకు తొమ్మిదిసార్లు ఆస్ట్రేలియా ఓపెన్ విజేతగా నిలిచాడు. కాగా, దిగ్గజ ఆటగాడిని ఆపడంపై సెర్బియా ప్రధాని మండిపడ్డారు. వీసా రద్దు అంశంపై జొకోవిచ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు తెలుస్తోంది.
జోకోవిచ్‌ను తక్షణమే డిపోర్ట్ చేయడం లేదని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. అతన్ని ఇమ్మిగ్రేషన్ డిటెన్షన్ సెంటర్లో పెట్టినట్లు తెలిపారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

