సిడ్నీ: పాకిస్థాన్‌తో మూడో టెస్టులో ఆస్ట్రేలియా విజయానికి చేరువైంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు కోల్పోయి 68 పరుగులు చేసింది. అయూబ్ (33), బాబర్ (23) రెండంకెల స్కోరు చేయగా.. షఫీఖ్ (0), మసూద్ (0), షకీల్ (2), సాజిద్ (0), సల్మాన్ (0) విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో హజిల్‌వుడ్ 4 వికెట్లు పడగొట్టాడు.
అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 116/2తో శుక్రవారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా 299 పరుగులకు ఆలౌటైంది. లబుషేన్ (60), మిషెల్ మార్ష్ (54) హాఫ్‌సెంచరీలు చేశారు. పాక్ బౌలర్లలో జమాల్ 6 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం చేతిలో 3 వికెట్లు ఉన్న పాకిస్థాన్ ఓవరాల్‌గా 82 పరుగుల ఆధిక్యంలో ఉంది.