Ashes Series : యాషెస్ సిరీస్‌కు ముందే ఆస్ట్రేలియా (Australia)కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. పేస్ దళంలోని ఒక్కొక్కరు గాయాలతో జట్టుకు దూరమవుతున్నారు. గాయం నుంచి కోలుకుంటున్న కెప్టెన్ ప్యాట్ కమిన్స్(Pat Cummins) పెర్త్ టెస్టుకు దూరమవ్వగా.. ప్రధాన పేసర్ జోష్ హేజిల్‌వుడ్ (Josh Hazlewood) సైతం గాయపడ్డాడు. కాలి నొప్పితో బాధ పడుతున్న హేజిల్‌వుడ్‌కు స్కానింగ్ పరీక్షల అనంతరం తొడ కండరాలతో ఇబ్బందిపడుతున్నట్టు గుర్తించారు. దాంతో.. వైద్యులు అతడికి విశ్రాంతి సూచించారు.
నవంబర్ 21న పెర్త్ వేదికగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు జరుగనుంది. సిరీస్ ఓపెనర్ అయిన ఈ మ్యాచ్‌లో విజయంతో బోణీ కొట్టాలనుకున్న ఆతిథ్య జట్టుకు పేసర్ల కొరత వేధిస్తోంది. ఇప్పటికే కెప్టెన్ కమిన్స్ అందుబాటులో లేకపోగా హేజిల్‌వుడ్ కూడా ఈ టెస్టులో ఆడడం లేదు. హేజిల్‌వుడ్ స్థానంలో ఆల్‌రౌండర్ మైఖేల్ నెసర్(Michael Neser)ను స్క్వాడ్‌లోకి తీసుకున్నారు క్రికెట్ ఆస్ట్రేలియా సెలెక్టర్లు.
A big blow for Australia with Josh Hazlewood ruled out of the first Test in Perth with a hamstring strain injury #Ashes pic.twitter.com/HtCrTjmnnQ
— ESPNcricinfo (@ESPNcricinfo) November 15, 2025
క్వీన్స్‌లాండ్‌కు ఆడుతున్న ఈ పేసర్ హేజిల్‌వుడ్‌తో పాటు సీన్ అబాట్ లోటును భర్తీ చేయనున్నాడు. కానీ, అతడికి సుదీర్ఘ ఫార్మాట్లో అనుభవం రెండు మ్యాచులు మాత్రమే. 2021లో యాషెస్‌లో అరంగేట్రం చేసిన నాసిర్ ఆ తర్వాత ఇప్పుడే మళ్లీ టెస్టు ఆడబోతున్నాడు. డిసెంబర్ 4న గబ్బాలో జరిగే రెండు టెస్టుకు సారథి కమిన్స్ సిద్ధమవుతున్నాడు. మరోవైపు ఇంగ్లండ్ తురుపుముక్క మార్క్ వుడ్ ఫిట్నెస్ సాధించాడు. దాంతో.. పెర్త్ టెస్టులో అతడు ఆడడం ఖాయం.