AUS vs AFG: ఇబ్రహీం జద్రాన్ సరికొత్త చరిత్ర.. ప్రపంచకప్ లో అఫ్గాన్ తరఫున తొలి శతకం
AUS vs AFG: అఫ్గానిస్తాన్.. ఆస్ట్రేలియాతో ముంబైలోని వాంఖెడే వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో అఫ్గాన్ ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు.
AUS vs AFG: భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో సంచలన విజయాలతో దూసుకుపోతున్న అఫ్గానిస్తాన్.. ఆస్ట్రేలియాతో ముంబైలోని వాంఖెడే వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో కూడా రాణిస్తోంది. ఈ మ్యాచ్‌లో అఫ్గాన్ ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. 2015 నుంచి వన్డే వరల్డ్ కప్ ఆడుతున్న అఫ్గానిస్తాన్ తరఫున ఇంతవరకూ (ఆసీస్‌తో మ్యాచ్‌కు ముందు) ఒక్క బ్యాటర్ కూడా సెంచరీ నమోదు చేయలేదు. తాజాగా జద్రాన్ ఆ కొరత తీర్చి చరిత్ర పుస్తకాలలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు.
ఆసీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన జద్రాన్.. కంగారూల పేస్ త్రయం కమిన్స్, స్టార్క్, హెజిల్‌వుడ్‌లతో పాటు స్పిన్నర్ ఆడమ్ జంపా, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌లను సమర్థవంతంగా ఎదుర్కున్నాడు. 62 బంతుల్లో అర్థ సెంచరీ చేసిన జద్రాన్.. 131 బంతుల్లో మూడంకెల స్కోరుకు చేరుకున్నాడు.
జద్రాన్ కంటే ముందు అఫ్గాన్ తరఫున వరల్డ్ కప్‌లో అత్యధిక స్కోరు చేసిన బ్యాటర్లలో సమిఉల్లా షిన్వారి ముందున్నాడు. షిన్వారి.. 2015లో స్కాట్లాండ్పై 96 పరుగులు చేశాడు. ఈ జాబితాలో ఇబ్రహీం జద్రాన్ (2023లో చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో 87), ఇక్రామ్ అలిఖిల్ (2019లో వెస్టిండీస్‌పై 86), హష్ముతుల్లా షాహిది (2023లో ఢిల్లీలో భారత్‌పై జరిగిన మ్యాచ్‌లో 80) లు టాప్-5లో ఉన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

