Deepthi Jeevanji | పరుగే ప్రాణంగా పతకాలు కొల్లగొడుతున్న దీప్తి.. అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న కల్లెడ వాసి
జివాంజీ దీప్తి..లోకం పోకడ తెలియని అమాయకపు అమ్మాయి. పుట్టి పెరిగిన కల్లెడ గ్రామం తప్ప..బయటి ప్రపంచం గురించి పెద్దగా తెలియదు. కాయ కష్టం చేస్తే గానీ పూట గడువని నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన దీప్తి పరుగునే ప్రాణంగా ప్రేమించింది.
- నమస్తే తెలంగాణకు ప్రత్యేక ఇంటర్వ్యూ
జివాంజీ దీప్తి..లోకం పోకడ తెలియని అమాయకపు అమ్మాయి. పుట్టి పెరిగిన కల్లెడ గ్రామం తప్ప..బయటి ప్రపంచం గురించి పెద్దగా తెలియదు. కాయ కష్టం చేస్తే గానీ పూట గడువని నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన దీప్తి పరుగునే ప్రాణంగా ప్రేమించింది. ఊహ తెలియని వయసులో పొలం గట్లపై జింకలా పరిగెత్తిన ఈ అమ్మాయి…ఇప్పుడు అంతర్జాతీయ టోర్నీల్లో అదరగొడుతున్నది. దాతల సాయంతో టోర్నీల్లో పోటీపడుతున్న ఈ యువ అథ్లెట్ ప్రభుత్వం మద్దతుగా నిలిస్తే మరిన్ని అద్భుతాలు సాధిస్తానని ఆత్మవిశ్వాసంతో చెబుతున్నది. పారిస్ టోర్నీలో రజత పతకం సాధించిన దీప్తిని ‘నమస్తే తెలంగాణ’ పలుకరించింది.
పారిస్ టోర్నీలో పోటీ ఎలా ఉంది?
పారిస్ వేదికగా జరుగుతున్న వర్చస్ గ్లోబల్ గేమ్స్‌లో పోటీ చాలా తీవ్రంగా ఉంది. వివిధ దేశాల నుంచి వచ్చిన అథ్లెట్లతో పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. నేను బరిలోకి దిగిన టీ20 400మీటర్లు, 200 మీటర్ల రేసుల్లో రెండు రజత పతకాలు కైవసం చేసుకున్నాను. సహచర స్ప్రింటర్ల నుంచి దీటైన పోటీ ఎదురైనా వెరువకుండా అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాను. అంతర్జాతీయ టోర్నీల్లో ఇది నాకు నాలుగో పతకం.
తదుపరి లక్ష్యమేంటి?
సెప్టెంబర్‌లో ఆసియా పారాగేమ్స్‌లో రాణించడమే లక్ష్యంగా పెట్టుకున్నాను. ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన నేను ఇకపై ప్రతిష్ఠాత్మక టోర్నీల్లో రాణించడం ద్వారా సత్తాచాటాలని చూస్తున్నాను.
స్పాన్సర్లు ఎలా సహకరిస్తున్నారు?
ఏ టోర్నీలో పోటీకి దిగాలన్నా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఈ విషయంలో స్పాన్సర్ల సహకారం మరువలేనిది. టోర్నీకి తగ్గట్లు కొందరు దాతలు ముందుకొచ్చి ఆర్థికంగా అండగా నిలుస్తున్నారు. ప్రయాణ ఖర్చులు, వసతి సౌకర్యాలకు సాయమందిస్తున్నారు. స్పాన్సర్లకు తోడు కుటుంబ సభ్యులు తోడ్పాటు అందిస్తున్నారు. జాతీయ పారా అథ్లెటిక్స్ అసోసియేషన్ నుంచి ఆశించిన మద్దతు లభించడం లేదు.
ప్రభుత్వ మద్దతు ఎలా ఉంది?
అథ్లెటిక్స్ను కెరీర్‌గా తీసుకుని రాణిస్తున్న నేను ప్రభుత్వ మద్దతు కోసం చూస్తున్నాను. నిరుపేద కుటుంబం నుంచి నేను ఈ స్థాయికి చేరుకునేందుకు చాలా కష్టనష్టాలు పడ్డాను. పరుగును ప్రేమిస్తూ ప్రతీ టోర్నీలో సత్తాచాటుతూ పతకాలు సాధిస్తున్నాను. జాతీయ అథ్లెటిక్స్ కోచ్ నాగపురి రమేశ్ శిక్షణలో రాటుదేలుతూ రాణిస్తున్నాను. ప్రభుత్వం అండగా నిలస్తే రానున్న భవిష్యత్‌లో రాష్ట్ర ఖ్యాతిని పెంచేలా పతకాలు సాధిస్తానన్న గట్టి నమ్మకం నాకుంది.
కుటుంబ నేపథ్యం ఏంటీ?
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ మా స్వగ్రామం. కూలీ చేస్తే గానీ పూట గడువని కుటుంబం మాది. మా తల్లిదండ్రులకు మేము ఇద్దరం సంతానం. ఎంతో ఇష్టమైన పోలీసు ఉద్యోగం చేయాలన్నది నా ఆకాంక్ష.
దీప్తి ధమాకా
విచీ(ఫ్రాన్స్): తెలంగాణ యువ అథ్లెట్ జివాంజీ దీప్తి అంతర్జాతీయ స్థాయి టోర్నీల్లో అదరగొడుతున్నది. ఫ్రాన్స్ వేదికగా జరుగుతున్న ఆరవ వర్చస్ గ్లోబల్ గేమ్స్‌లో దీప్తి మరోమారు సత్తాచాటింది. శుక్రవారం జరిగిన మహిళల 200మీటర్ల (టీ20) రేసును 25.27 సెకన్లలో ముగించి రెండో స్థానంతో రజత పతకం సొంతం చేసుకుంది. ప్రత్యర్థులకు దీటైన పోటీనిస్తూ ముందుకు సాగిన ఈ వరంగల్ స్ప్రింటర్ వెనుదిరిగి చూసుకోలేదు. అంతర్జాతీయ పారా అథ్లెటిక్స్‌లో దీప్తికి ఇది నాలుగో పతకం కావడం విశేషం.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

