గాఫ్ గర్జన
పారిస్: అమెరికా యువ సంచలనం కోకో గాఫ్ 18 ఏండ్ల వయసులోనే ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్‌కు దూసుకెళ్లి సరికొత్త అధ్యాయం లిఖించింది. వరుస విజయాలతో దూకుడు కనబర్చిన ఈ చిన్నది టైటిల్ పోరుకు దూసుకెళ్లింది. తుది పోరులో ప్రపంచ నంబర్‌వన్ ఇగా స్వియాటెక్‌ను ఢీకొనబోతున్నది. ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో గురువారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీ ఫైనల్లో స్వియాటెక్, గాఫ్ అద్భుత విజయాలతో తుదిపోరుకు అర్హత సాధించారు.
- 18 ఏండ్లకే ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లోకి
- స్వియాటెక్‌తో అమీతుమీకి సిద్ధం.. బోపన్న జోడీకి నిరాశ
పారిస్: అమెరికా యువ సంచలనం కోకో గాఫ్ 18 ఏండ్ల వయసులోనే ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్‌కు దూసుకెళ్లి సరికొత్త అధ్యాయం లిఖించింది. వరుస విజయాలతో దూకుడు కనబర్చిన ఈ చిన్నది టైటిల్ పోరుకు దూసుకెళ్లింది. తుది పోరులో ప్రపంచ నంబర్‌వన్ ఇగా స్వియాటెక్‌ను ఢీకొనబోతున్నది. ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో గురువారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీ ఫైనల్లో స్వియాటెక్, గాఫ్ అద్భుత విజయాలతో తుదిపోరుకు అర్హత సాధించారు.
తొలి పోరులో స్వియాటెక్ 6-2, 6-1 డరియా కసత్కిన (రష్యా)పై సునాయాస విజయం సాధించింది. రెండు సెట్లను పూర్తి ఆధిక్యంతో చేజిక్కించుకుని ఈ సీజన్లో వరుసగా 34వ విజయం నమోదు చేసింది. గతేడాది క్వార్టర్స్‌తోనే వెనుదిరిగిన అమెరికా అమ్మాయి గాఫ్ ఈసారి సెమీస్ గండాన్ని కూడా దాటేసింది. రెండో సెమీస్‌లో 18వ ర్యాంకర్ గాఫ్ 6-3, 6-1తో ట్రెవిసన్ (ఇటలీ)ని చిత్తు చేసింది. కీలక పోరులో ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగి వరుస సెట్లలో విజయం సాధించింది. గంటా 4 నిమిషాల్లో స్వియాటెక్ ఆటను ముగించగా.. గంటా 28 నిమిషాల్లో గాఫ్ మ్యాచ్‌ను చేజిక్కించుకుంది. శనివారం వీరిద్దరి మధ్య పోరు రసవత్తరంగా సాగనుంది.
బోపన్న జోడీ ఓటమి
ఏడేండ్ల తర్వాత గ్రాండ్‌స్లామ్ సెమీ ఫైనల్లో అడుగుపెట్టిన రోహన్ బోపన్న ఫైనల్ చేరకుండానే తిరుగుముఖం పట్టాడు. ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల డబుల్స్ సెమీస్‌లో బోపన్న-మిడిల్‌కూప్ (నెదర్లాండ్స్) జోడీ 6-4, 3-6, 6-7 (8-10)తో మార్సె లో అరెవాలో (సాల్వడర్)-జీన్ జూలియన్ రోజర్ (నెదర్లాండ్) జంట చేతిలో పోరాడి ఓడింది. తుది పోరులో అడుగుపెట్టేందుకు ఇరు జోడీలు రెండు గంటల 7 నిమిషాల పాటు హోరాహోరీగా తలపడ్డాయి. ఆఖరికి బోపన్న జోడీ ఓటమి వైపున నిలిచింది. శుక్రవారం పురుషుల సింగిల్స్ సెమీస్‌లో రఫేల్ నాదల్, అలెగ్జాండర్ జ్వెరెవ్ తలపడనున్నారు. మరో సెమీస్‌లో కాస్పర్ రూడ్‌తో మారిన్ సిలిచ్ తాడోపేడో తేల్చుకోనున్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- Bopanna
- sports news
- Tennis
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

