Mohammad Siraj | ఆసియా కప్ హీరో సిరాజ్ సంచలన నిర్ణయం.. వాళ్లకు ప్రైజ్‌మనీ రూ. 4 లక్షలు ఇచ్చేశాడు
Mohammad Siraj : ఆసియా కప్ ఫైనల్ హీరో మహ్మద్ సిరాజ్(Mohammad Siraj) 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు. ప్రైజ్‌మనీ(Prize Money)గా 5 వేల అమెరికన్ డాలర్లు.. భారతీయ కరెన్సీలో రూ. 4 లక్షలు అందుకున్నాడు. అనంతరం తన బౌలింగ్ ప్రదర్శన గురించి మాట్లాడిన సిరాజ్ సంచలన నిర్ణయంతో...
Mohammad Siraj : ఆసియా కప్ ఫైనల్ హీరో మహ్మద్ సిరాజ్(Mohammad Siraj) ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. ప్రైజ్‌మనీ(Prize Money)గా 5 వేల అమెరికన్ డాలర్లు.. భారతీయ కరెన్సీలో రూ. 4 లక్షలు అందుకున్నాడు. అనంతరం తన బౌలింగ్ ప్రదర్శన గురించి మాట్లాడిన సిరాజ్ సంచలన నిర్ణయంతో అందర్నీ షాక్‌కు గురి చేశాడు. ప్రైజ్‌మనీగా అందుకున్న రూ. 4 లక్షలు మొత్తాన్ని ప్రేమదాస స్టేడియం(Premadasa Stadium) సిబ్బందికి ఇస్తున్నట్టు చెప్పాడు. దాంతో, ఒక్కసారిగా స్టేడియం మొత్తం చప్పట్లతో మార్మోగిపోయింది.
‘గ్రౌండ్ మెన్ లేకుంటే ఈ టోర్నీ సాధ్యం కాకపోయేది. వాళ్ల కష్టానికి గుర్తింపుగా నా ప్రైజ్‌మనీని ఇచ్చేస్తున్నా’ అని సిరాజ్ అన్నాడు. ఆసియా కప్‌లో వరుణుడు కీలకమైన సూపర్ 4 మ్యాచ్‌లకు పలుమార్లు అంతరాయం కలిగించాడు. అయితే.. వాన తగ్గగానే గ్రౌండ్ సిబ్బంది శరవేగంగా పిచ్‌ను సిద్ధం చేశారు.
Just a wonderful gesture from Mohammed Siraj ❤️ https://t.co/HjhOw2Upp6 | #AsiaCupFinal | #SLvIND pic.twitter.com/sHUurwNpWk
— ESPNcricinfo (@ESPNcricinfo) September 17, 2023
హాలోజెన్ లైట్స్ సైతం ఉపయోగించి మ్యాచ్ కొనసాగేలా చేశారు. దాంతో, సిరాజ్ వాళ్ల కష్టానికి తగిన ప్రతిఫలం ఇవ్వాలనుకున్నాడు. అనుకున్నట్టుగానే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ ప్రైజ్‌మనీని వాళ్లకు ఇచ్చేశాడు. ఆసియా క్రికెట్ కౌన్సిల్(Asian Cricket Council), శ్రీలంక క్రికెట్(Srilanka Cricket) బోర్డు సైతం రూ.40 లక్షలు గ్రౌండ్‌మెన్‌కు ఇస్తున్నట్టు ప్రకటించాయి.
సిరాజ్ సూపర్ స్పెల్
ఆసియా కప్ ఫైనల్లో సిరాజ్ సూపర్ స్పెల్‌తో ఆకట్టుకున్నాడు. 7 ఓవర్లు వేసిన సిరాజ్ 21 రన్స్ ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. దాంతో, కెరీర్లోనే ఉత్తమ గణాంకాలు నమోదు చేయడమే కాకుండా శ్రీలంక దిగ్గజం అజంత మెండిస్(Ajanta Mendis) రికార్డు సమం చేశాడు.
ABSOLUTE PEACH 🍑#AsiaCupFinal | #SLvIND pic.twitter.com/1dZiTBRA37
— ESPNcricinfo (@ESPNcricinfo) September 17, 2023
అంతేకాదు ఓకే ఓవర్లో 4 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా ఈ హైదరబాదీ రికార్డు నెలకొల్పాడు. స్వల్ప లక్ష్య ఛేదనలో ఓపెనర్లు శుభ్‌మన్ గిల్(27), ఇషాన్ కిషన్(23) నాటౌట్‌గా నిలవడంతో భారత్ 10 వికెట్ల తేడాతో భారీ విక్టరీ కొట్టింది. ఈ టోర్నీలో 9 వికెట్లు తీసిన కుల్దీప్ యాదవ్(Kuldeep Yadav) ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు అందుకున్నాడు.
ఇవి కూడా చదవండి
Team India | ఆసియా కప్ ఫైనల్లో భారీ విజయం.. వన్డేల్లో రికార్డులు తిరగరాసిన టీమిండియా
Asia Cup 2023 | సిరాజ్ సంచలన బౌలింగ్.. ఎనిమిదోసారి ఆసియా కప్‌ను ముద్దాడిన భారత్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

