Asia Cup 2023 | సిరాజ్ సంచలన బౌలింగ్.. ఎనిమిదోసారి ఆసియా కప్‌ను ముద్దాడిన భారత్
Asia Cup 2023 : వరల్డ్ కప్(ODI World Cup 2023) ముందు భారత జట్టు(Team India) అద్బుత విజయం సాధించింది. ఆసియా కప్(Asia Cup 2023) ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ శ్రీలంకను చిత్తుగా ఓడించింది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో లంకపై టీమిండియా 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. దాంతో, ఎనిమిదోసారి ఆసియా కప్...
Asia Cup 2023 : వరల్డ్ కప్(ODI World Cup 2023) ముందు భారత జట్టు(Team India) అద్బుత విజయం సాధించింది. ఆసియా కప్(Asia Cup 2023) ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ శ్రీలంకను చిత్తుగా ఓడించింది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో లంకపై టీమిండియా 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. దాంతో, ఎనిమిదోసారి ఆసియా కప్ చాంపియన్‌గా నిలిచింది. స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా ఆడుతూ పాడుతూ ఛేదించింది. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్(27), ఇషాన్ కిషన్(23) నాటౌట్‌గా నిలిచి జట్టును గెలిపించారు.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఆతిథ్య జట్టుకు సిరాజ్(Mohammad Siraj) చుక్కలు చూపించాడు. ఈ స్పీడ్‌స్టర్ 6 వికెట్లతో లంకను చావుదెబ్బ కొట్టాడు. దాంతో, లంక 50 పరుగులకే కుప్పకూలింది. పాండ్యా వేసిన 16వ ఓవర్లో వరుస బంతుల్లో ప్రమోద్ మదుషాన్ (1), పథిరన(0) ఔటయ్యారు. దాంతో 50 పరుగుల వద్ద లంక ఇన్నింగ్స్ ముగిసింది. వన్డేల్లో శ్రీలంకకు ఇదే రెండో అత్యల్ప స్కోర్.
INDIA THRASH SRI LANKA TO WIN THEIR 8TH ASIA CUP! 🏆 pic.twitter.com/82Kkc8E0Oq
— ESPNcricinfo (@ESPNcricinfo) September 17, 2023
స్వల్ప లక్ష్య ఛేదనలో ఓపెనర్లు శుభ్‌మన్ గిల్(27 నాటౌట్), ఇషాన్ కిషన్(23 నాటౌట్) ధనాధన్ ఆడడంతో 6.1 ఓవర్లలోనే ఇండియా మ్యాచ్ ముగించింది. 263 బంతులు మిగిలి ఉండగానే గెలుపొందింది. దాంతో, వన్డేల్లో భారీ విజయం సాధించిన జట్టుగా చరిత్ర సృష్టించింది.
హ్యాట్రిక్ మిస్
తొలి ఓవర్ మెయిడెన్ వేసిన సిరాజ్ ఆ తర్వాత ఓవర్లో నాలుగు కీలక వికెట్లు తీశాడు. దాంతో, అంతర్జాతీయ క్రికెట్లో ఈ ఫీట్ సాధించిన తొలి భారత బౌలర్‌గా సిరాజ్ రికార్డు సృష్టించాడు. నాలుగో ఓవర్ మొదటి బంతికి ఓపెనర్ పథుమ్ నిస్సంక(2)ను ఔట్ చేశాడు. ఆ తర్వాతి మూడు, నాలుగు బంతుల్లో సధీర సమరవిక్రమ(0), చరిత అసలంక(0)ను ఔట్ చేశాడు.
ABSOLUTE PEACH 🍑#AsiaCupFinal | #SLvIND pic.twitter.com/1dZiTBRA37
— ESPNcricinfo (@ESPNcricinfo) September 17, 2023
హ్యాట్రిక్ బంతికి బౌండరీ కొట్టిన ధనంజయ డిసిల్వా(4) ఆఖరి బంతికి రాహుల్ చేతికి చిక్కాడు. ఆరో ఓవర్లో సిరాజ్ అద్బుత బంతితో లంక కెప్టెన్ దసున్ శనక(0)ను బౌల్డ్ చేశాడు. దాంతో, ఐదో వికెట్ ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాతి ఓవర్లోనే సిరాజ్ క్రీజులో కుదురుకున్న కుశాల్ మెండిస్(17)ను బౌల్డ్ చేయడంతో లంక కోలుకోలేకపోయింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

