Team India | ఆసియా కప్ ఫైనల్లో భారీ విజయం.. వన్డేల్లో రికార్డులు తిరగరాసిన టీమిండియా
Team India : ఆసియా కప్ ఫైనల్లో భారత జట్టు(Team India) అద్భుత విజయం సాధించింది. ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన ఇండియా డిఫెండింగ్ చాంపియన్ శ్రీలంక(Srilanka)పై 10 వికెట్ల తేడాతో భారీ విక్టరీ కొట్టింది. దాంతో, టీమిండియా ఎనిమిదోసారి...
Team India : ఆసియా కప్ ఫైనల్లో భారత జట్టు(Team India) అద్భుత విజయం సాధించింది. ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన ఇండియా డిఫెండింగ్ చాంపియన్ శ్రీలంక(Srilanka)పై 10 వికెట్ల తేడాతో భారీ విక్టరీ కొట్టింది. దాంతో, టీమిండియా ఎనిమిదోసారి ఆసియా కప్ చాంపియన్‌గా నిలిచింది. భారత జట్టు ఇంతకుముందు 1984, 1988, 1991, 1995, 2010, 2016, 2018లో ఆసియా కప్‌ను ముద్దాడింది.
టీమిండియాకు రెండోసారి ఈ మెగా ట్రోఫీ అందించిన మూడో కెప్టెన్‌గా రోహిత్ శర్మ(Rohit Sharma) రికార్డు సొంతం చేసుకున్నాడు. హిట్‌మ్యాన్ కంటే ముందు మహ్మద్ అజారుద్దీన్(Mohammad Azharuddin) సారథ్యంలో 1991, 1995లో మన జట్టు చాంపియన్‌గా నిలిచింది. మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni) కెప్టెన్సీలో భారత్ 2010, 2016లో ట్రోఫీని నిలబెట్టుకుంది.
అజారుద్దీన్, మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శర్మ

శ్రీలంకతో జరిగిన ఫైనల్లో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్(Mohammad Siraj) కెరీర్లోనే ఉత్తమ గణాంకాలు నమోదు చేశాడు. 7 ఓవర్లు వేసిన సిరాజ్ 21 రన్స్ ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. దాంతో, శ్రీలంక దిగ్గజం అజంత మెండిస్(Ajanta Mendis) రికార్డు సమం చేశాడు. అంతేకాదు ఓకే ఓవర్లో 4 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా ఈ హైదరబాదీ రికార్డు నెలకొల్పాడు.
6 వికెట్లతో లంక నడ్డి విరిచిన సిరాజ్

శ్రీలంక నిర్దేశించిన 51 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు 6.1 ఓవర్లలోనే ఛేదించింది. లంకపై భారీ విక్టరీతో వన్డేల్లో పలు రికార్డులు తిరగరాసింది. అవును.. టీమిండియాకు వన్డేల్లో ఇదే భారీ విజయం. 263 బంతులు మిగిలి ఉండగానే గెలిచిన భారత్ మరో రికార్డు సృష్టించింది. ఇదే ఏడాది ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా (226 బంతులు) నెలకొల్పిన రికార్డును బద్ధలు కొట్టింది.
10 వికెట్లతో రెండోసారి
వన్డే ఫార్మాట్లో జరిగిన ఫైనల్స్‌లో భారత జట్టు 10 వికెట్ల తేడాతో గెలవడం ఇది రెండోసారి. మొదటిసారి 1998లో జింబాబ్వేపై 197 పరుగుల లక్ష్యాన్ని వికెట్ కోల్పోకుండా చేధించింది. 2003లో ఆస్ట్రేలియా జట్టుకు ఇంగ్లండ్ 118 టార్గెట్ విధించింది. స్వల్ప లక్ష్య ఛేదనలో కంగారు జట్టు 10 వికెట్ల తేడాతో గెలిచింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

