సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఫార్ములా-ఈ కోసం అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. హుసేన్సాగర్ పరిసర ప్రాంతంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ట్రాక్‌ను పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యదర్శి అరవింద్‌కుమార్ మంగళవారం పరిశీలించారు. ఈ నెల 11న హైదరాబాద్ వేదికగా ఫార్ములా-ఈ రేసింగ్ పోటీలు జరుగనున్నాయి. ఇందుకోసం అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ప్రత్యేక ట్రాక్‌ను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఇండియన్ రేసింగ్ లీగ్(ఐఆర్ఎల్) రూపంలో స్ట్రీట్ సర్యూట్ రేసులు జరుగగా, ఇప్పుడు ఫార్ములా-ఈ పోటీలు అభిమానులను అలరించనున్నాయి. ఓవైపు గ్యాలరీ నిర్మాణ పనులు జోరుగా సాగుతుండగా, అభిమానులు కూర్చుని వీక్షించేందుకు అనువుగా నిర్వాహకులు ప్రత్యేక స్టాండ్లను నిర్మిస్తున్నారు.