Arjun Erigaisi | ముంబై: భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేసి అర్జున్ సత్తాచాటాడు. ఇటీవల జరిగిన చెన్జెన్ చెస్ మాస్టర్స్, బుందుస్లిగా టోర్నీల్లో మెరుగైన ప్రదర్శన కనబర్చడం ద్వారా తాజా ఫిడే ర్యాంకింగ్స్‌లో తొమ్మిదో ర్యాంక్‌లో నిలిచాడు. ఎనిమిది పాయింట్ల మెరుగుతో మొత్తం 2756 పాయింట్లు ఖాతాలో వేసుకున్నాడు. మాగ్నస్ కార్ల్సన్(2830), ఫాబియానో కరున(2803)వరుసగా టాప్-2లో ఉన్నారు.
భారత ర్యాంకింగ్స్ పరంగా చూసుకుంటే విశ్వనాథన్ ఆనంద్(2751) రెండో ర్యాంక్‌ను నెడుతూ ఈ తెలంగాణ కుర్రాడు టాప్ ర్యాంక్ కైవసం చేసుకున్నాడు. ప్రజ్ఞానంద(2747), గుకేశ్(2743), విదిత్ గుజరాతి(2727) ఆ తర్వాతి ర్యాంక్‌ల్లో ఉన్నారు.