న్యూఢిల్లీ: ఐటీఎఫ్ డబ్ల్యూ50 ఈవెంట్లో భారత టెన్నిస్ స్టార్ అం కితా రైనా అదరగొట్టింది. శనివారం జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో అంకిత, నైత బేన్స్(బ్రిటన్)జోడీ విజేతగా నిలిచింది.
ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన తుదిపోరులో అంకిత, బేన్స్ ద్వయం 6-4, 3-6, 10-8తో నాలుగో సీడ్ అమెరికా జంట జెస్సీ అనె, జెస్సికా ఫైలాపై అద్భుత విజయం సాధించింది. గంటా 42నిమిషాల పాటు జరిగిన పోరులో తొలి సెట్‌ను కైవసం చేసుకున్న భారత్, బ్రిటన్ జోడీకి రెండో సెట్లో చుక్కెదురైంది. అయితే నిర్ణయాత్మక మూడో సెట్‌ను టైబ్రేక్‌లో గెలిచి మ్యాచ్‌ను తమ వశం చేసుకుంది.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రతిష్ఠాత్మక ఐ-లీగ్‌లో తొమ్మిదో రౌండ్ పోరులో శ్రీనిధి దక్కన్ ఎఫ్‌సీ(ఎస్‌డీఎఫ్‌సీ) దుమ్మురేపుతున్నది. శనివారం ఆఖరి నిమిషం వరకు ఎస్‌డీఎఫ్‌సీ మ ధ్య షిల్లాంగ్ లాజాంగ్ ఎఫ్‌సీతో మధ్య హోరాహోరీగా సాగిన పోరు 5-5తో డ్రాగా ముగిసింది. శ్రీనిధి తరఫున కాస్టెండా(11ని, 16ని) , గాబ్రియెల్(71ని), విలియమ్ అల్వెస్(82ని), మానస్ దూబే(90+7ని) సాజిద్(90+8ని) గోల్స్ చేశారు.