Andrew Mcdonald | తొలి టెస్టుకు కామెరూన్ గ్రీన్ దూరం కానున్నాడా..? ఆస్ట్రేలియా కోచ్ ఏం అన్నాడంటే..?
ఆస్ట్రేలియా యంగ్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ మొదటి టెస్టు ఆడే అవకాశాల్ని కొట్టిపారేయలేమని ఆ జట్టు ప్రధాన కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ చెప్పాడు. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో గ్రీన్ వేలికి గాయం అయింది.
Andrew Mcdonald : ఆస్ట్రేలియా యంగ్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ నాగ్‌పూర్ టెస్టులో ఆడతాడా? లేదా? అనే సందిగ్గత నెలకొంది. ఒకవేళ అతను తొలి మ్యాచ్‌కు దూరమైతే ఆసీస్‌కు పెద్ద దెబ్బ తగిలినట్టే. అయితే.. ఆ జట్టు ప్రధాన కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ గ్రీన్‌కు తుది జట్టులో చోటు దక్కనుందా? అనే విషయమై క్లారిటీ ఇచ్చాడు. అలూర్‌లో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. గ్రీన్ మొదటి టెస్టు ఆడే అవకాశాల్ని కొట్టిపారేయలేమని చెప్పాడు. ‘ఆల్‌రౌండర్ గ్రీన్ గాయం నుంచి వేగంగా కోలుకుంటున్నాడు. బౌలింగ్ చేసేటప్పుడు అతనికి ఏ ఇబ్బంది ఉండదని అనుకుంటున్నా. అయితే.. గ్రీన్ తొలి మ్యాచ్ ఆడే అవకాశాలు చాలా తక్కువ’ అని మెక్‌డొనాల్డ్ తెలిపాడు. గ్రీన్ ఆడేది లేనిది రెండు మూడు రోజుల్లో తెలియనుంది.
బాక్సింగ్ డే టెస్టులో గాయం
స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన బాక్సింగ్ డే టెస్టు సిరీస్‌లో గ్రీన్ వేలికి గాయం అయింది. దాంతో అతను భారత్‌తో తొలి టెస్టుకు దూరం కానున్నాడనే వార్తలు వినిపించాయి. అయితే.. ఆసీస్‌కు కీలకమైన ఈ యంగ్ ఆల్‌రౌండర్ నెట్స్‌లో బ్యాటింగ్, బౌలింగ్ సాధన చేస్తూ కనిపించాడు. 2022లో గ్రీన్ భారత పర్యటనలో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఉపఖండ పిచ్‌ల మీద చెలరేగే అతడు ఆసీస్‌కు ప్రధాన అస్త్రం. టెస్టుల్లో నంబర్ 1 ర్యాంకులో ఉన్న ఆసీస్ ఇప్పటికే వరల్డ్ ఛాంపియన్షిప్ ఫైనల్ చేరింది. రెండో స్థానంలో ఉన్న భారత్ ఈ సిరీస్ గెలిస్తే ఫైనల్ బెర్తు ఖరారు చేసుకుంటుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

