Wrestlers Protest: అమిత్ షాను కలిసిన రెజ్లర్లు.. చట్టప్రకారమే చర్యలన్న కేంద్ర మంత్రి
Wrestlers Protest: రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్‌పై న్యాయం ప్రకారం చర్యలు తీసుకుంటామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. శనివారం రాత్రి ఆయన్ను నిరసన చేస్తున్న మహిళా రెజ్లర్లు కలిశారు. బ్రిజ్‌ను అరెస్టు చేయాలని రెజ్లర్లు షాను కోరారు.
న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్‌పై చర్యలు తీసుకోవాలని టాప్ మహిళా రెజ్లర్లు ధర్నా(Wrestlers Protest) చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ రెజ్లర్లు శనివారం అర్థరాత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. అయితే ఆ మీటింగ్ అసంపూర్ణంగా ముగిసినట్లు సాక్షీమాలిక్ భర్త సత్యవ్రత్ ఖదియాన్ తెలిపారు. కేంద్ర మంత్రి షా నుంచి సరైన రీతిలో స్పందన రాలేదని సత్యవ్రత్ తెలిపారు.
శనివారం రాత్రి 11 గంటలకు అమిత్ షా నివాసంలో రెజ్లర్లతో భేటీ జరిగింది. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. భజరంగ్ పూనియా, సాక్షీ మాలిక్, సంగీతా పోగట్, సత్యవ్రత్ ఖదియాన్ మీటింగ్‌కు హాజరయ్యారు. నిష్పాక్షికంగా విచారణ జరగాలని కోరారు. అయితే చట్ట ప్రకారమే చర్యలు ఉంటాయని అమిత్ షా అన్నారని తెలిసింది.
గంగా నదిలో మెడల్స్‌ను పారేసేందుకు ప్రయత్నించిన రెజ్లర్లు ఆ తర్వాత ప్రభుత్వానికి డెడ్‌లైన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ డెడ్‌లైన్ నేపథ్యంలో షాతో మీటింగ్ జరగాలని రెజ్లర్లు కోరారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

