జొహన్నెస్‌బర్గ్: ఖేలో ఇండియా యువ చాంపియన్ అమన్ ఫరోగ్ సంజయ్ అద్భుత ప్రదర్శనతో వారం వ్యవధిలో రెండు టైటిల్స్ చేజిక్కించుకున్నాడు. గతవారం బోట్స్వానా అంతర్జాతీయ ఫ్యూచర్ సిరీస్ చేజిక్కించుకున్న 21 ఏండ్ల అమన్ తాజాగా దక్షిణాఫ్రికా ఫ్యూచర్ సిరీస్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. జొహన్నెస్‌బర్గ్‌లో మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో అమన్ 15-21, 21-16, 21-12తో రెండో సీడ్ రాబర్ట్ సమర్స్ (దక్షిణాఫ్రికా)పై విజయం సాధించాడు.