WTC Final 2023 : ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో అలెక్స్ క్యారీ(55: 88 బంతుల్లో 7 ఫోర్లు) అర్ధ శతకం బాదాడు. అతను రెండో ఇన్నింగ్స్లో ఫిఫ్టీ కొట్టాడు. తొలి ఇన్నింగ్స్లో 48వద్ద వెనుదిరిగిన క్యారీ ఈసారి హాఫ్ సెంచరీ సాధించాడు. జడేజా ఓవర్లో సింగిల్ తీసి అతను 50కి చేరువయ్యాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా.. భారత బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారిన మిచెల్ స్కార్ట్(24)తో కలిసి ఏడో వికెట్కు 56 పరుగులు జోడించాడు. స్టార్క్కూడా వేగంగా ఆడుతున్నాడు. రెండో ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా స్కోర్… 228/6. ఆ జట్టు ఆధిక్యం 400 దాటింది.