కోల్‌కతా: ఐపీఎల్ మాజీ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉన్నది. ఇప్పటికే గాయం కారణంగా హర్షిత్ రానా లీగ్‌కు పూర్తిగా దూరం కాగా, తాజా ఈ జాబితాలో యువ పేసర్ ఆకాశ్‌దీప్ చేరాడు. వెన్నెముక గాయంతో ఆకాశ్‌దీప్ ఎనిమిది వారాల పాటు ఆటకు దూరం కానున్నాడు. దీంతో ఈనెల 28 నుంచి మొదలయ్యే ఐపీఎల్‌తో పాటు స్వదేశం వేదికగా ఆఫ్ఘానిస్థాన్‌తో జరిగే ఏకైక టెస్టుకు ఆకాశ్‌దీప్ అందుబాటులో లేకుండా పోయాడు.
‘ఆకాశ్‌దీప్ వెన్నెముక కింది భాగంలో గాయమైంది. పూర్తి స్థాయిలో కోలుకునేందుకు ఎనిమిది నుంచి 12 వారాల సమయం పడుతుంది. ఈ కారణంగా ఐపీఎల్‌తో పాటు ఆఫ్ఘానిస్థాన్‌తో టెస్టుకు అతను ఎంపికయ్యే అవకాశాలు లేవు’అని శనివారం బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. చివరిసారి రంజీ ట్రోఫీలో జమ్మూ కశ్మీర్‌తో సెమీఫైనల్ మ్యాచ్ ఆడిన ఈ 29 ఏండ్ల యువ పేసర్ అప్పటి నుంచి ఆటకు దూరమయ్యాడు.