టెస్టు జట్టులోకి ఆకాశ్, అన్షుల్
భారత పేసర్లు ఆకాశ్ దీప్, అన్షుల్ కాంబోజ్ టెస్టు జట్టులోకి తిరిగొచ్చారు. న్యూజిలాండ్ పర్యటనలో జరిగే రెండు టెస్టుల సిరీస్ కోసం శుక్రవారం ప్రకటించిన జట్టుకు ఈ ఇద్దరూ ఎంపికయ్యారు.
- మళ్లీ వన్డే టీమ్‌లో తిలక్.. కివీస్‌తో టెస్టు సిరీస్‌కే బుమ్రా ఎంపిక
న్యూఢిల్లీ: భారత పేసర్లు ఆకాశ్ దీప్, అన్షుల్ కాంబోజ్ టెస్టు జట్టులోకి తిరిగొచ్చారు. న్యూజిలాండ్ పర్యటనలో జరిగే రెండు టెస్టుల సిరీస్ కోసం శుక్రవారం ప్రకటించిన జట్టుకు ఈ ఇద్దరూ ఎంపికయ్యారు. గతేడాది ఇంగ్లండ్ పర్యటనలో ఆకట్టుకున్న ఆకాశ్ గాయం కారణంగా జట్టుకు దూరం అవ్వగా.. అదే టూర్లో అరంగేట్రం చేసి నిరాశపరిచిన కాంబోజ్‌కు మళ్లీ ఇన్నాళ్లకు అవకాశం లభించింది.
ఇక, ఇదే టూర్లో న్యూజిలాండ్‌తో ఐదు వన్డేల సిరీస్‌లో చివరి రెండు వన్డేలకు శ్రేయస్ అయ్యర్‌ను సెలక్టర్లు కెప్టెన్‌గా ఎంపిక చేశారు. టెస్టు సిరీస్‌కు సన్నద్ధం అయ్యేందుకు సారథి గిల్, రాహుల్‌కు చివరి రెండు వన్డేలకు విశ్రాంతినిచ్చారు. దాదాపు ఏడాది తర్వాత తిలక్ వర్మను వన్డేల్లోకి తీసుకున్న సెలక్టర్లు చివరి రెండు వన్డేలకు అతడిని ఎంపిక చేశారు.
మరోవైపు వర్క్‌లోడ్‌ను దృష్టిలో ఉంచుకొని స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను టెస్టు సిరీస్‌కు మాత్రమే ఎంపిక చేశారు.వన్డేల్లో ప్రసిధ్, టెస్టుల్లో పంత్ ఫిట్నెస్తో ఉంటేనే బరిలోకి దిగుతారు. నవంబర్ 4న వన్డే సిరీస్ మొదలవనుండగా.. అదే నెల 19 నుంచి తొలి టెస్టు జరుగుతుంది.
వన్డే జట్టు: గిల్, రాహుల్, ప్రసిద్ధ్ కృష్ణ (3 వన్డేలకు మాత్రమే); రోహిత్, కోహ్లీ, అయ్యర్, నితీశ్ రెడ్డి, అక్షర్, నమన్, అన్షుల్, గుర్నూర్, రుతురాజ్, అర్ష్‌దీప్, ఇషాన్, సిరాజ్, కుల్దీప్; చివరి రెండు వన్డేలకు: తిలక్, ఆకిబ్ నబీ, కుమార్ కుశాగ్ర, యశ్ ఠాకూర్
టెస్ట్ జట్టు: గిల్ (కెప్టెన్), జైస్వాల్, రాహుల్, పడిక్కల్, పంత్ (కీపర్), జురెల్, జడేజా, అన్షుల్, బుమ్రా, ప్రసిద్ధ్, ఆకాశ్‌దీప్, సుదర్శన్, నితీశ్ రెడ్డి, సుందర్, కుల్దీప్, సిరాజ్.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

