Ajit Agarkar : వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ కోసం భారత స్క్వాడ్ ఎంపికపై తీవ్ర అభ్యంతరాలు వస్తున్నాయి. ఫామ్‌లో ఉన్న అభిమన్యు ఈశ్వరన్ (Abhimanyu Easwaran)ను పక్కన పెట్టేయడంతో పాటు కరుణ్ నాయర్ (Karun Nair)పై వేటు, దేవదత్ పడిక్కల్ (Devdat Padikkal)కు అవకాశం ఇవ్వడాన్ని కొందరు తప్పుపడుతున్నారు. దాంతో.. స్క్వాడ్‌పై పలువురు వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలకు భారత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar) వివరణ ఇచ్చాడు. అంచనాలను అందుకోనందుకే నాయర్‌ను తీసుకోలేదని.. ఇండియా ఏ తరఫున అదరగొట్టిన పడిక్కల్ ఎంపిక సరైన నిర్ణయమే అని అతడు తెలిపాడు.
‘ఇంగ్లండ్ పర్యటనలో కరుణ్ నాయర్ నుంచి మేము చాలా ఆశించాం. టాపార్డర్ విఫలైమనా అతడు నిలబడుతాడని అనుకున్నాం. కానీ, అతడు మా నమ్మకాన్ని వమ్ము చేశాడు. నాలగు ఇన్నింగ్స్‌ల్లో ఒకే ఒక చెప్పుకోదగ్గ ప్రదర్శన చేశాడు. అందుకే.. వెస్టిండీస్ సిరీస్‌కు పడిక్కల్‌ను తీసుకున్నాం. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ(BGT)లోనూ పడిక్కల్ ఆడాడు. నిరుడు ధర్మశాలలో ఇంగ్లండ్‌పై ఈ యంగ్‌స్టర్ గొప్ప ప్రదర్శన చేశాడు. తాజాగా భారత ‘ఏ’ జట్టు తరఫున సెంచరీతో చెలరేగాడు. సో.. నాయర్ కంటే ప్రస్తుతం అతడే మాకు మంచి ఛాయిస్ అనిపించాడు. ఇక స్క్వాడ్‌లోని వాళ్లకు 15-20 మ్యాచ్‌లు ఆడే అవకాశమిస్తాం. అప్పటికీ వాళ్లు రాణించకుంటే వేటు వేయడానికి ఆలోచించం’ అని అగార్కర్ వెల్లడించాడు.
🚨 Presenting #TeamIndia‘s squad for the West Indies Test series 🔽#INDvWI | @IDFCFIRSTBank pic.twitter.com/S4D5mDGJNN
— BCCI (@BCCI) September 25, 2025
భారత స్క్వాడ్ : శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వీ జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, దేవ్‌దత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా(వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, బుమ్రా, అక్షర్ పటేల్, నితీశ్ రెడ్డి, ఎన్.జగదీశన్(వికెట్ కీపర్), సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్.
ఓపెనర్‌గా అభిమన్యు ఈశ్వరన్‌ను తీసుకోకపోవడంపై కూడా చీఫ్ సెలెక్టర్ స్పష్టత నిచ్చాడు. యశస్వీ, రాహుల్ జోడీ హిట్ అయినందున మూడో ఓపెనర్ అవసరం లేదని అగార్కర్ అన్నాడు. ఒకవేళ ఇద్దరిలో ఎవరైనా గాయపడితే అప్పుడు ఈశ్వరన్ గురించి ఆలోచిస్తామని చెప్పాడు.
Chief selector Ajit Agarkar addressed the media, shedding light on the exclusion of Mohammed Shami, Karun Nair and Ishan Kishan.#INDvsWIsquad@CricSubhayan ✍️https://t.co/oODyWkVhwB
— RevSportz Global (@RevSportzGlobal) September 25, 2025
అలానే షమీని మరోసారి పరిగణించకపోవడంపై స్పందిస్తూ.. అతడు గత మూడేళ్లలో పెద్దగా క్రికెట్ ఆడింది లేదని, అందుకే పక్కన పెట్టేశామని అన్నాడు అగార్కర్. డబ్ల్యూటీసీ 2025-26లో భారత జట్టు స్వదేశంలో తొలి సిరీస్ ఆడనుంది. వెస్టిండీస్‌తో అక్టోబర్ 2న తొలి టెస్టు, అక్టోబర్ 10న రెండో టెస్టులో తలపడుతుంది టీమిండియా. ఈ సిరీస్‌లో కరీబియన్ జట్టును క్వీన్స్లీప్ చేస్తే శుభ్‌మన్ గిల్ సేన పాయింట్ల పట్టికలో ముందంజ వేయనుంది.