DC vs UPW : ఢిల్లీ క్యాపిటల్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. అలిసే క్యాప్సే(21) ఔట్ అయింది. షబ్నం ఇస్మాయిల్ ఓవర్లో క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరింది. దాంతో, 144 వద్ద ఆ జట్టు నాలుగో వికెట్ పడింది. ప్రస్తుతం జెమీమా రోడ్రిగ్స్ (11), జెస్ జొనాసెన్ (1) క్రీజులో ఉన్నారు. 15 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ 4 వికెట్ల నష్టానికి 146 రన్స్ చేసింది. ఓపెనర్ మేగ్ లానింగ్ (70) మూడో వికెట్‌గా వెనుదిరిగింది. రాజేశ్వరి గైక్వాడ్ ఓవర్లో బౌల్డ్ అయింది.
వరుసగా రెండో అర్ధ శతకం బాదిన ఆమె రాజేశ్వరి ఓవర్లో తొలి బంతికి ఫోర్ బాదిన లానింగ్ రెండో బంతికి ఔటయ్యింది. మరిజానే కాప్ (16) తక్కువ స్కోర్‌కే వెనుదిరిగింది. డాషింగ్ ఓపెనర్ షఫాలీ వర్మ (17) ఔట్ అయింది. మెక్‌గ్రాత్ ఓవర్లో షఫాలీ ఇచ్చిన క్యాచ్‌ను కిరణ్ నవ్‌గిరే అందుకుంది. 67 పరుగుల వద్ద ఢిల్లీ మొదటి వికెట్ పడింది.