BAN vs SL | నిన్న ట్రోల్ చేశాడు.. ఇవాళ సిరీస్ నుంచి తప్పుకున్నాడు.. బంగ్లాదేశ్‌కు భారీ షాక్..
BAN vs SL | ఇప్పటికే ఈ టూర్లో శ్రీలంక.. టీ20, వన్డే సిరీస్‌లు ఆడగా ఈనెల 22 నుంచి టెస్టు సిరీస్ ఆడాల్సి ఉంది. తొలి టెస్టు ప్రారంభానికి మూడు రోజుల ముందే ముష్ఫీకర్ సిరీస్ మొత్తానికి దూరమైనట్టు బీసీబీ ఒక ప్రకటనలో వెల్లడించింది.
BAN vs SL | స్వదేశంలో శ్రీలంకతో సోమవారమే ముగిసిన వన్డే సిరీస్‌లో గెలిచిన తర్వాత లంక బ్యాటర్ ఏంజెలొ మాథ్యూస్‌తో పాటు ఆ జట్టునూ ట్రోల్ చేసిన బంగ్లా వికెట్ కీపర్ బ్యాటర్ ముష్ఫీకర్ రహీమ్ టెస్టు సిరీస్ నుంచి తప్పుకున్నాడు. ఇప్పటికే ఈ టూర్లో శ్రీలంక.. టీ20, వన్డే సిరీస్‌లు ఆడగా ఈనెల 22 నుంచి టెస్టు సిరీస్ ఆడాల్సి ఉంది. తొలి టెస్టు ప్రారంభానికి మూడు రోజుల ముందే ముష్ఫీకర్ సిరీస్ మొత్తానికి దూరమైనట్టు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) ఒక ప్రకటనలో వెల్లడించింది.
మార్చి 18న శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో బ్యాటింగ్ చేస్తుండగా ముష్ఫీకర్‌కు గాయమైంది. దీంతో బీసీబీ స్పందిస్తూ.. ‘ముష్ఫీకర్ ఈ సిరీస్ నుంచి గాయం కారణంగా దూరమయ్యాడు’ అని తెలిపింది. లంక – బంగ్లాల మధ్య ఈనెల 22 నుంచి తొలి టెస్టు జరగనుండగా మార్చి 30 నుంచి రెండో టెస్టు మొదలవుతుంది. ఇదివరకే ముగిసిన టీ20 సిరీస్‌ను లంక దక్కించుకోగా వన్డే సిరీస్‌ను బంగ్లాదేశ్ చేజిక్కించుకుంది. ముష్ఫీకర్ రహీమ్ రిప్లేస్మెంట్ను బంగ్లాదేశ్ ప్రకటించాల్సి ఉంది.
Mushfiqur Rahim re-created Angelo Matthews ‘Timed -out’ celebration 😂#BANvSL pic.twitter.com/wb8Bmf9vft
— Afrid Mahmud Rifat 🇧🇩 (@rifat0015) March 18, 2024
🚨Mushfiqur Rahim Ruled Out of Test Series#BANvSL #MyGP pic.twitter.com/cNqOavNyHM
— bdcrictime.com (@BDCricTime) March 19, 2024
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral Video | కాంగ్రెస్‌కు దగ్గరుండి ఓట్లు వేయించిన.. ఇప్పుడు నా చేనే ఎండబెట్టిండ్రు.. నాగర్‌కర్నూల్ జిల్లాలో రైతు గోపాల్ ఆవేదన
Sai Pallavi | జగపతిబాబు షోలో సాయి పల్లవి సందడి.. ‘జయమ్ము నిశ్చయమ్మురా’ రెండో సీజన్ ఎప్పటినుండి అంటే..?
Ramayana | ‘రామాయణ’ రన్‌టైమ్ 3 గంటల 15 నిమిషాలా .. సినిమా నిడివిపై ఆసక్తికర ప్రచారం!
Jailer 2 | ‘జైలర్ 2’పై తెలుగు ప్రేక్షకుల అసంతృప్తి.. ప్రమోషన్లు లేవు, బాలయ్య క్యామియో కూడా మిస్సింగ్!
దళిత యువకుడికి అవమానం.. ఆలయంలోకి వెళ్లినందుకు దూషణలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

