Ravishastri | ఆ మాటలు నాకర్థం కాలేదు.. రవిశాస్త్రిపై మాజీ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్
Ravishastri | టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రిపై మాజీ ఆటగాడు, ప్రముఖ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇటీవల విరాట్ కోహ్లీ తన టెస్టు కెప్టెన్సీని వదులుకున్న

టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రిపై మాజీ ఆటగాడు, ప్రముఖ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇటీవల విరాట్ కోహ్లీ తన టెస్టు కెప్టెన్సీని వదులుకున్న సంగతి తెలిసిందే. దీనిపై రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
వచ్చే టెస్టు సీజన్ అంతా స్వదేశంలో జరగనున్న నేపథ్యంలో.. ఇలా కోహ్లీ తన కెప్టెన్సీ వదులుకోవడం షాకింగ్ నిర్ణయమే అని రవిశాస్త్రి అన్నాడు. అయితే స్వదేశంలో టెస్టులు గెలిచి భారత అత్యుత్తమ టెస్టు కెప్టెన్‌గా కోహ్లీ నిలవడం కొంతమంది జీర్ణించుకోలేరని విమర్శించాడు.
ఈ వ్యాఖ్యలపైనే సంజయ్ మంజ్రేకర్ స్పందించాడు. ఇంతకు ముందు రవిశాస్త్రిపై తనకు గౌరవం ఉండేదని, కానీ ఇప్పుడు ఆయన మీడియా ముందు మాట్లాడే మాటలను సులభంగా ఊహించవచ్చని అన్నాడు. ఆయన మాటల వెనుక ఉన్న ఎజెండా సులభంగా అర్థమవుతోందని విమర్శించాడు.
రవిశాస్త్రి 2.0 తనకు అర్థం కావడం లేదని, కోహ్లీ విషయంలో ఈ కామెంట్స్ క్రికెట్‌కు సంబంధం లేదని, ఒక ఎజెండాతో మాట్లాడుతున్నాడని తెలిసిపోతోందని పేర్కొన్నాడు. అయితే కోహ్లీ మరికొంత కాలం కెప్టెన్‌గా ఉండే అవకాశం ఉందనే విషయాన్ని మాత్రం మంజ్రేకర్ అంగీకరించాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

