AFG vs IRE | ఐర్లాండ్‌తో ఏకైక టెస్టు.. అఫ్గాన్‌కు స్వల్ప ఆధిక్యం.. అయినా కష్టాల్లోనే..
AFG vs IRE | రెండో రోజు ఆట ముగిసే సమయానికే ఇరు జట్లు తొలి ఇన్నింగ్స్‌ను ముగించడమే గాక అఫ్గాన్ రెండో ఇన్నింగ్స్‌లో 37 ఓవర్లు ఆడి 3 వికెట్లు కూడా కోల్పోయింది. కచ్చితంగా ఫలితం తేలే అవకాశం ఉన్న ఈ టెస్టులో...
AFG vs IRE | అఫ్గానిస్తాన్ – ఐర్లాండ్ మధ్య అబుదాబిలోని టోలరెన్స్ ఓవల్ వేదికగా జరుగుతున్న ఏకైక టెస్టు ఆసక్తికరంగా మారుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికే ఇరు జట్లు తొలి ఇన్నింగ్స్‌ను ముగించడమే గాక అఫ్గాన్ రెండో ఇన్నింగ్స్‌లో 37 ఓవర్లు ఆడి 3 వికెట్లు కూడా కోల్పోయింది. కచ్చితంగా ఫలితం తేలే అవకాశం ఉన్న ఈ టెస్టులో అఫ్గానిస్తాన్ రెండో ఇన్నింగ్స్‌లో 26 పరుగుల స్వల్ప ఆధిక్యంలో ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు 155 పరుగులకే ఆలౌట్ అవగా ఐర్లాండ్.. 263 పరుగులు చేసింది. ఫలితంగా ఐర్లాండ్‌కు 108 పరుగుల తొలి ఆధిక్యం దక్కగా.. రెండో ఇన్నింగ్స్‌లో అఫ్గాన్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 134 రన్స్ చేసింది.
ఆట రెండో రోజు రెండో సెషన్లో ఐర్లాండ్ 263 పరుగులకు ఆలౌట్ అయింది. 186 పరుగులకే 6 కీలక వికెట్లు కోల్పోయిన ఆ జట్టును వికెట్ కీపర్ లోర్కన్ టక్కర్ (46), అండీ మెక్‌బ్రైన్ (38) ఆదుకున్నారు. దీంతో ఆ జట్టుకు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 108 పరుగుల లీడ్ లభించింది. అఫ్గాన్ బౌలర్లలో జియా ఉర్ రెహ్మాన్.. ఐదు వికెట్లు పడగొట్టాడు.
That’s Stumps on Day 2! 👍
AfghanAtalan scored 134/3 runs in the final session of the day and lead by 26 runs heading into the day 3. The skipper @Hashmat_50 (53*) is in the middle alongside the debutant @RGurbaz_21 (23*). 👍#AfghanAtalan | #AFGvIRE2024 pic.twitter.com/1lgFRrbCZm
— Afghanistan Cricket Board (@ACBofficials) February 29, 2024
అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన అఫ్గాన్‌కు ఏడో ఓవర్లోనే షాక్ తాకింది. స్టార్ ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ (12)ను మార్క్ అడైర్ ఔట్ చేశాడు. నూర్ అలీ జద్రాన్ (32) ఫర్వాలేదనిపించాడు. రహ్మత్ షా (9) విఫలమవగా కెప్టెన్ హష్మతుల్లా షాహిది (53 నాటౌట్), వికెట్‌కీపర్ బ్యాటర్ రెహ్మనుల్లా గుర్బాజ్ (23 నాటౌట్)లు మరో వికెట్ కోల్పోకుండా అడ్డుకున్నారు. మూడో రోజు అఫ్గాన్ వికెట్లను కాపాడుకుని భారీ లక్ష్యాన్ని నిర్దేశిస్తే తప్ప ఆ జట్టుకు షాక్ తప్పేలా లేదు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

