Ross Taylor | ప్రపంచవ్యాప్తంగా 4 వేల పులులు.. కానీ ద్రావిడ్ ఒక్కడే: రాస్ టేలర్
ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరైన న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ రాస్ టేలర్.. తాజాగా తన జీవిత చరిత్ర ‘బ్లాక్ అండ్ వైట్’ పుస్తకంలో సంచలన విషయాలు వెల్లడిస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు. న్యూజిలాండ్ క్రికెట్లో వివక్ష, రాజస్తాన్ రాయల్స్ యజమాని తనను కొట్టడం వంటి విషయాలతో ఈ పుస్తకం ఇప్పటికే సంచలనాలను సృష్టిస్తుండగా తాజాగా టేలర్.. టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్‌తో తన అనుబంధానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.
టేలర్ తన పుస్తకంలో ‘‘ఒకసారి ద్రావిడ్‌తో మీరు ఇదివరకు ఎన్నిసార్లు పులిని చూశారని అడిగా. దానికి ద్రావిడ్ ‘నేను పులిని చూద్దామని 21 సార్లు అడవిలో యాత్రకు వెళ్లా. కానీ ఇంతవరకు ఒక్కసారి కూడా చూడలేదు’ అని అన్నాడు. ఆ మాట విని నేను షాకయ్యా. ఆ తర్వాత మధ్యాహ్నం ఒకసారి ద్రావిడ్‌తో కలిసి రాజస్తాన్‌లోని ఓ నేషనల్ పార్కుకు వెళ్లాం. అక్కడ టీ-17 అని ట్యాగ్ చేసిన పులి కనిపించింది. దానిని చూసి ద్రావిడ్ చాలా థ్రిల్‌గా ఫీలయ్యాడు..
పులిని చూడటం కంటే అక్కడ నాకు మరో విషయం ఆశ్చర్యకరంగా అనిపించింది. మేము పులిని చూసేందుకు ఓపెన్ టాప్ ఎస్యూవీ ఎక్కాం. ఆ వాహనం ల్యాండ్ రోవర్ కంటే కొంచెం పెద్దది. మేమంతా పులిని చూస్తుంటే అక్కడికి వచ్చిన ప్రేక్షకులు మాత్రం తమ కెమెరాలను ద్రావిడ్ వైపునకు తిప్పారు. అడవిలో పులిని చూసిన ఆనందం కంటే వాళ్లు ద్రావిడ్‌ను చూసినందుకు ఎక్కువ సంతోషపడుతున్నారు. నాకు తెలిసి ప్రపంచవ్యాప్తంగా సుమారు 4 వేల పులులు ఉంటాయోమో గానీ రాహుల్ ద్రావిడ్ మాత్రం ఒక్కడే…’’ అని టేలర్ తన పుస్తకంలో పేర్కొన్నాడు.
ద్రావిడ్-టేలర్లు 2008 నుంచి 2011 వరకు ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడగా 2011 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ తరఫున ఆడారు. దీంతో ఈ ఇద్దరి మధ్య మంచి అనుబంధముంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు: కేటీఆర్
Gautam Prasad Yallapu | గౌతమ్ ప్రసాద్ యల్లపు దర్శకత్వంలో ‘ప్రొడక్షన్ నంబర్ 1’ చిత్రం.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం!
Psoriasis | సోరియాసిస్ అంటే ఏమిటి.. ఎలా వస్తుంది.. లక్షణాలు ఎలా ఉంటాయి..?
పులివెందుల పులినని చెప్పుకునే జగన్.. ఓటు వేయకుండానే పిరికిపందలా పారిపోయారు.. అచ్చెన్నాయుడు ఎద్దేవా
అన్నాచెల్లెలుగా పేర్కొంటూ అద్దె ఇంట్లో నివసించిన జంట.. ఉరి వేసుకున్న యువకుడు, ప్రియురాలు గదిలో నిర్బంధం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

