IPL 2023 | విలియమ్సన్‌ను తక్కువ అంచనా వేయొద్దు : డివిల్లియర్స్
IPL 2023 : ఐపీఎల్ పదహారో సీజన్ కొన్ని గంటల్లో మొదలు కానుంది. డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటన్స్(Gujarat Titans), చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) ఆరంభ పోరులో ఢీ కొంటున్నాయి. ఈ సందర్భంగా గుజరాత్ టైటన్స్‌కు ఆడుతున్న కేన్ విలియమ్సన్(Kane Williamson)ను తక్కువ అంచనా వేయొద్దని దక్షిణాఫ్రికా మాజీ సారథి ఏబీ డివిల్లియర్స్(AB de Villiers) అన్నాడు.
IPL 2023 : ఐపీఎల్ పదహారో సీజన్ కొన్ని గంటల్లో మొదలు కానుంది. డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటన్స్(Gujarat Titans), చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) ఆరంభ పోరులో ఢీ కొంటున్నాయి. ఈ సందర్భంగా గుజరాత్ టైటన్స్‌కు ఆడుతున్న కేన్ విలియమ్సన్(Kane Williamson)ను తక్కువ అంచనా వేయొద్దని దక్షిణాఫ్రికా మాజీ సారథి ఏబీ డివిల్లియర్స్(AB de Villiers) అన్నాడు. ‘విలియమ్సన్‌ను అందరూ తక్కువ అంచనా వేస్తారు. అతను నెమ్మదిగా ఆడతాడని అనుకుంటారు. కానీ, నా అభిప్రాయం ప్రకారం అతను ఏ స్థానంలోనైనా ఆడగలడు. అంతేకాదు 170- 180 స్ట్రైక్ రేటుతో బ్యాటింగ్ చేయగలడు’ అని మిస్టర్ 360 తెలిపాడు. గత సీజన్లో ఈ మాజీ క్రికెటర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆడాడు.
పదిహేనో సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్(SRH) ఫ్రాంఛైజీకి విలియమ్సన్ కెప్టెన్‌గా ఉన్నాడు. పేలవ ఫామ్‌తో విమర్శల పాలయ్యాడు. అందుకని హెస్ఆర్హెచ్ అతడిని వదులుకుంది. దాంతో, మినీ వేలంలో ఈ స్టార్ ప్లేయర్‌ను గుజరాత్ టైటన్స్ కొనుగోలు చేసింది. స్వదేశంలో ఇంగ్లండ్, శ్రీలకంతో జరిగిన టెస్టు సిరీస్‌లో విలియమ్సన్ శతకాలతో చెలరేగాడు. మిడిలార్డర్లో వికెట్లు పడకుండా చూస్తూనే, స్కోర్‌బోర్డును పరుగులు పెట్టించగల సామర్థ్యం ఈ కివీస్ బ్యాటర్ సొంతం. ఫామ్‌లో ఉన్న అతను ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లో చెన్నైపై ఎలా ఆడతాడో చూడాలి.
ఆరంభం అదిరిపోయేలా..
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఈరోజు సాయంత్ర 5ః30 గంటల నుంచి ఐపీఎల్ ఓపెనింగ్ సెరమొనీ జరగనుంది. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్ని, కార్యదర్శి జై షాతో పాటు పలువురు అధికారులు టోర్నీ ప్రారంభ వేడుకలకు హాజరుకానున్నారు. ఇండియా క్రష్‌గా పేరొందిన కన్నడభామ రష్మిక మందాన (Rashmika Mandanna), మిల్క్‌బ్యూటీ తమన్నా భాటియా (Tamanna Bhatia) ఆరంభ వేడుకల్లో డాన్స్‌తో అలరించనున్నారు. బాలీవుడ్ పాపులర్ సింగర్ అర్జిత్ సింగ్(Arjith Singh) తన గాత్రంతో అభిమానులను ఫిదా చేయనున్నాడు. అనంతరం పది జట్ల కెప్టెన్లు ట్రోఫీని ఆవిష్కరించనున్నారు. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటన్స్, నాలుగుసార్లు చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి.
ఇవి కూడా చదవండి
IPL 2023 | బుమ్రా ప్లేస్‌లో సందీప్.. ఢిల్లీ కీపర్‌గా అభిషేక్
David Miller: మిల్లర్ లేకుండానే ఫస్ట్ మ్యాచ్‌కు గుజరాత్ రెఢీ
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

