గురువారం 02 జూలై 2020
Sports - May 13, 2020 , 02:03:43

విరాటే అత్యుత్తమం

విరాటే అత్యుత్తమం

న్యూఢిల్లీ: లక్ష్యఛేదనలో అందరి కన్నా టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీనే అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌ అని దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్‌ ఏబీ డివిలియర్స్‌ చెప్పాడు. తీవ్రమైన ఒత్తిడిలో లక్ష్యం ఛేదించాల్సిన సమయంలో క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ కంటే విరాట్‌ మెరుగ్గా ఆడగలడని ఏబీ అన్నాడు.

కోహ్లీ.. క్రికెట్‌ ఫెదరర్‌ : డివిలియర్స్‌

మరోవైపు ప్రపంచంలో ఏ దేశంలోనైనా పరుగులు చేసే విషయంలో ఆసీస్‌ మాజీ సారథి స్టీవ్‌ స్మిత్‌ కంటే విరాట్‌ కోహ్లీ మెరుగైన ప్లేయర్‌ అని డివిలియర్స్‌ అభిప్రాయపడ్డాడు. ఎన్నోసార్లు క్లిష్ట సమయాల్లో అద్భుతంగా పోరాడి కోహ్లీ జ ట్టును గెలిపించాడని అన్నాడు. టెన్నిస్‌కు అ న్వయించి చెప్పాలంటే కోహ్లీ.. ఫెదరర్‌ అయితే,  స్మిత్‌..రఫేల్‌ నాదల్‌లా అని డివిలియర్స్‌ చెప్పాడు. 


logo