Aaron Finch | ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌కు అరుదైన గౌరవం.. ఆ లీగ్ చరిత్రలో ఒకేఒక్కడు
Aaron Finch : ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ అరోన్ ఫించ్(Aaron Finch) బిగ్‌బాష్ లీగ్‌లో ఆఖరి మ్యాచ్ ఆడేశాడు. టీ20 లీగ్స్‌కు వీడ్కోలు పలికిన ఈ విధ్వంసక ఓపెనర్‌కు మెల్బోర్న్ రెనెగేడ్స్(Melbourne Renegrades) జట్టు అరుదైన గౌరవం...
Aaron Finch : ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ అరోన్ ఫించ్(Aaron Finch) బిగ్‌బాష్ లీగ్‌లో ఆఖరి మ్యాచ్ ఆడేశాడు. టీ20 లీగ్స్‌కు వీడ్కోలు పలికిన ఈ విధ్వంసక ఓపెనర్‌కు మెల్బోర్న్ రెనెగేడ్స్(Melbourne Renegrades) జట్టు అరుదైన గౌరవం కల్పించింది. అతడి జెర్సీకి కూడా రిటైర్మెంట్ ప్రకటించింది. ఇకపై ఫించ్ 5వ నంబర్ జెర్సీని గ్యాలరీలో పెట్టనుంది.
బిగ్‌బాష్ లీగ్ చరిత్రలో ఒక ఆటగాడి జెర్సీని మరెవరికీ కేటాయించకపోవడం ఇదే మొదటిసారి. ఫించ్ గౌరవార్థం రెనెగేడ్స్ మేనేజ్మెంట్ డాక్‌ల్యాండ్స్ స్టేడియం మొత్తాన్ని ఎరుపురంగులోకి మార్చేసింది. దాంతో, భావోద్వేగానికి లోనైన ఫించ్ .. ‘కొత్తతరం క్రికెటర్లకు అవకాశాలు ఇవ్వాల్సిన సమయం వచ్చింది. రెనెగ్రేడ్స్ జట్టు భద్రమైన చేతుల్లో ఉంది’ అని అన్నాడు.
A fitting farewell for @AaronFinch5 🫶
The @RenegadesBBL have retired the No.5 jersey in honour of their main man. #BBL13 pic.twitter.com/ShQ8bejlVQ
— KFC Big Bash League (@BBL) January 13, 2024
రెనెగ్రేడ్స్ జట్టుకు ఫించ్ రికార్డు స్థాయిలో 11 సీజన్లు సారథిగా వ్యవహరించాడు. అతడి నేతృత్వంలో రెనెగ్రేడ్స్ 2081-19 ఎడిషన్‌లో జట్టును చాంపియన్‌గా అవతరించింది. ఇక వ్యక్తిగత రికార్డుల పరంగా చూస్తే.. బీబీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన, ఎక్కువ రన్స్ కొట్టిన రెండో క్రికెటర్ ఫించ్ రికార్డు నెలకొల్పాడు. ఫించ్ 106 మ్యాచుల్లో 3,311 పరుగులు సాధించాడు. క్రిస్ లిన్ 3,638 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

ఫించ్ వన్డేలు, టీ20ల్లోఆస్ట్రేలియాకు సారథ్యం వహించాడు. అతడి కెప్టెన్సీలో కంగారూ జట్టు 2021లో పొట్టి ప్రపంచకప్‌ను ముద్దాడింది. తరఫున 146 వన్డేలు, 103 టీ20లు ఆడిన ఫించ్.. 131 మ్యాచుల్లో కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఫామ్ లేమి కారణంగా ఫించ్ 2022లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఇప్పుడు బీబీఎల్‌కు గుడ్ బై చెప్పిన ఈ క్రికెటర్ ఇకపై కామెంటేటర్‌గా దర్శనమివ్వనున్నాడు.
ఇవి కూడా చదవండి
- Vijayveer Sidhu | షూటర్ విజయ్‌వీర్‌కు ఒలింపిక్స్ బెర్తు.. ఈ ఇద్దరికీ నో చాన్స్
- Kirti Azad | రాముడు అందరివాడు.. బీజేపీకి ఆ కాపీరైట్ లేదు : కీర్తి ఆజాద్
- Harirama Jogaiah | పవన్‌కు హరిరామజోగయ్య మరో లేఖ.. సీఎం పదవిపై కీలక సూచనలు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

