Danushka Gunathilaka | లైంగిక దాడి కేసులో శ్రీలంక క్రికెటర్‌కు భారీ ఊరట
Danushka Gunathilaka : లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీలంక క్రికెటర్(Srilanka Cricketer) దనుష్క గుణతిలకకు భారీ ఊరట లభించింది. అతడిపై రిజిష్టర్ అయిన నాలుగు కేసుల్లో మూడింటిని ఆస్ట్రేలియాలోని సిడ్నీ కోర్టు(Sydney Court) కొట్టి వేసింది. తగిన ఆధారాలు లేకపోవడంతో పబ్లిక్ ప్రాసిక్యూటర్ దనుష్కపై నమోదైన 3 కేసులు చెల్లవని చెప్పాడు.
Danushka Gunathilaka : లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీలంక క్రికెటర్(Srilanka Cricketer) దనుష్క గుణతిలకకు భారీ ఊరట లభించింది. అతడిపై రిజిష్టర్ అయిన నాలుగు కేసుల్లో మూడింటిని ఆస్ట్రేలియాలోని సిడ్నీ కోర్టు(Sydney Court) కొట్టి వేసింది. తగిన ఆధారాలు లేకపోవడంతో పబ్లిక్ ప్రాసిక్యూటర్ దనుష్కపై నమోదైన 3 కేసులు చెల్లవని చెప్పాడు.
‘దనుష్క లైంగిక దాడికి పాల్పడ్డానని సదరు మహిళ పెట్టిన నాలుగు లైంగిక దాడి కేసుల్లో ఒక్కటి మాత్రమే నిలబడుతుంది. మిగతా మూడు కేసులు చెల్లవు అని ప్రభుత్వ న్యాయవాది హగ్ బుడ్డిన్ కోర్టుకు వెల్లడించాడు. దాంతో, ఈ 32 ఏళ్ల శ్రీలంక ఆటగాడు ఊపిరి పీల్చుకున్నాడు.
డేటింగ్ యాప్‌లో పరిచయం
పోయిన ఏడాది టీ20 వరల్డ్ కప్ సమయంలో ఒక మహిళ దనుష్కపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన అంగీకారం లేకుండానే అతడు తనపై లైగింక దాడి చేశాడని ఆమె కంప్లైంట్లో వెల్లడించింది. దాంతో, జట్టు సభ్యులతో టీమ్ హోటల్లో ఉన్న దనుష్కను పోలీసులు అరెస్ట్ చేశారు. ‘సదరు మహిళతో దనుష్కకు డేటింగ్ యాప్‌లో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ డేట్‌కు వెళ్లారు. అనంతరం సిడ్నీలోని రాస్ బేలో ఉన్న ఆమె ఇంటికి వెళ్లారు. అక్కడ అతడు బలవంతంగా ఆమెపై అత్యాచారం చేశాడు’ అని పోలీసులు తమ రిపోర్టులో తెలిపారు.
నిషేధం కొత్త కాదు
టాపార్డర్ బ్యాటర్ అయిన దనుష్క గుణతిలక రెండు సార్లు నిషేధానికి గురయ్యాడు. 2018లో టీమ్ కర్ఫ్యూను ఉల్లంఘించినందుకు అతడిపై 6 నెలలు నిషేధం విధించారు. అదే ఏడాది దనుష్క స్నేహితుడు నార్వే మహిళపై అత్యాచారం చేయడంతో అతడు సస్పెండ్ అయ్యాడు. ఆ తర్వాత 2021లో ఇంగ్లండ్ పర్యటన సమయంలో అతను బయో సెక్యూర్ బబుల్ నిబంధనలను ఉల్లంఘించాడు. దాంతో, అతడితో పాటు కుశాల్ మెండిస్, నిరోషన్ డిక్వెల్లాను శ్రీలంక క్రికెట్ బోర్డు సస్పెండ్ చేసింది.శ్రీలంక జట్టులో కీలక ఆటగాడు. జాతీయ జట్టు తరఫున 8 టెస్టులు, 47 వన్డేలు, 46 టీ20 మ్యాచుల్లో ఆడాడు. బాగా రాణిస్తున్నదనుష్క 2022 టీ20 వరల్డ్ కప్ టీమ్‌లో చోటు సంపాదించాడు. నమీబియాతో తొలి మ్యాచ్ ఆడిన దనుష్క గాయం కారణంగా మిగతా మ్యాచ్‌లు ఆడలేదు.
ఇవి కూడా చదవండి
IPL 2023 | ఆఖరి లీగ్ మ్యాచ్‌లో కొత్త జెర్సీతో లక్నో.. కారణం ఏంటంటే..?
IPL 2023: బెంగళూరుకు చావో రేవో.. నిలవాలంటే గెలవాల్సిందే.!
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

