IPL 2023: బెంగళూరుకు చావో రేవో.. నిలవాలంటే గెలవాల్సిందే.!
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్లో పేలవమైన ప్రదర్శనతో ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. 12 మ్యాచుల్లో 6 ఓటములు, 6 విజయాలతో ఉన్న బెంగళూరుకు ఈ మ్యాచ్‌లో గెలుపొందటం ముఖ్యం.
IPL 2023: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్లో పేలవమైన ప్రదర్శనతో ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. హైదరాబాద్ ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అయితే ప్లేఆఫ్స్ కోసం పోటీపడుతున్న మిగతా జట్ల అవకాశాలను ఎంతవరకు ప్రభావితం చేస్తుందో చూడాలి.
12 మ్యాచుల్లో 6 ఓటములు, 6 విజయాలతో ఉన్న బెంగళూరుకు ఈ మ్యాచ్‌లో గెలుపొందటం ముఖ్యం. ఒకవేళ ఈ మ్యాచులో ఓడిపోయినప్పటికీ ప్లేఆఫ్స్ రేసులో ఉంటుంది. కానీ మరో మ్యచులో తప్పక విజయం సాధించడంతో పాటు మిగతా జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. కెప్టెన్ డుప్లెసిస్, విరాట్ కోహ్లీ, గ్లెన్ మాక్స్వెల్ ఫామ్‌లో ఉండటం బెంగళూరుకు కలిసొచ్చే అంశం. మిడిలార్డర్ కూడా ఈ మ్యాచ్‌లో రాణించినట్లయితే బెంగళూరు విజయం సాధించడం సులువవుతుంది. అంతేకాకుండా గత మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను 59 పరుగులకే ఆలౌట్ చేయడంతో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది.
మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ పోతూ పోతూ మిగతా జట్ల ఫలితాలపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. అన్ని విభాగాల్లో దారుణంగా విఫలమైన హైదరాబాద్ గెలవాల్సిన మ్యాచుల్లో కూడా పరాజయం పాలై ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. బ్యాటర్లలో హెన్రిచ్ క్లాసెన్ ఒక్కడే రాణిస్తున్నాడు. మిగిలిన వారు ఘోరంగా విఫలమయ్యారు. బౌలర్లలో నిలకడ లేమి సైతం జట్టు విజయాలపై ప్రభావం చూపించింది. ఇప్పటికే ప్లేఆఫ్స్ నుంచి తప్పుకున్న సన్‌రైజర్స్ బెంచ్ ఆటగాళ్లకు అవకాశాలివ్వొచ్చు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maya Lady | ఒకే శరీరంలో ఇద్దరు మనుషులు.. ఆసక్తికరంగా ‘మాయ లేడీ’ ట్రైలర్!
Jeevan Reddy | రేవంత్‌రెడ్డి తెలంగాణకు శనిలా దాపురించాడు.. జీవన్ రెడ్డి ఫైర్
KTR | వీరప్పన్‌ను అటవీశాఖ మంత్రిని చేస్తే ఎలా ఉంటదో.. భూములు అమ్మే బ్రోకర్ రేవంత్ రెడ్డిని సీఎం చేస్తే అలానే ఉంది : కేటీఆర్
Chief Minister Vijay | ముఖ్యమంత్రి విజయ్‌కి పూలు ఇచ్చి ప్రపోజ్ చేసిన చిన్నారి.. వీడియో వైరల్!
Polio | ప్రపంచంలో ఇప్పటికీ కొన్ని దేశాల్లో వ్యాప్తి చెందుతున్న పోలియో.. కారణాలేమిటి..?
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

