Local Quota Row | కర్నాటకలో సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ‘ప్రైవేట్ ఉద్యోగాల్లో స్థానికులకు కోటా’పై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వ్యాపార వర్గాలలోని ప్రముఖులు ఈ బిల్లుపై బహిరంగంగానే పెదవి విరుస్తున్నారు. ఈ బిల్లు అమలైతే తాము రాష్ట్రం నుంచి వైదొలుగుతామని హెచ్చరిస్తున్నారు. ఇదిలాఉండగా ఈ లోకల్ కోటా సెగ తాజాగా ఐపీఎల్లో అత్యంత ఫ్యాన్ బేస్ కలిగిన జట్టు అయిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కి తాకింది. పలువురు కన్నడ అభిమానులు.. ‘మా జట్టులోనూ 50 శాతం స్థానిక ఆటగాళ్లకే ఇవ్వాలి’ అంటూ కోరుతున్నారు.
ఈ బిల్లు ప్రకారం రాష్ట్రంలో పరిశ్రమలు, ఫ్యాక్టరీలు, ఇతర ప్రైవేట్ సంస్థలన్నింటిలోనూ కన్నడిగులకే అధిక ప్రాధాన్యమివ్వాల్సి ఉంటుంది. ప్రైవేట్ రంగంలో మేనేజ్మెంట్ ఉద్యోగాల్లో 50 శాతం, నాన్ మేనేజ్మెంట్ ఉద్యోగాల్లో 75 శాతం స్థానికులకే ఇవ్వాలని ఒకవేళ ఈ నిబంధనలను ఉల్లంఘించినవారిపై రూ. 25 వేల జరిమానా విధించేలా బిల్లును రూపొందించారు. ఈ బిల్లు ప్రకారమే ఆర్సీబీలో కూడా ఆటగాళ్లను తీసుకోవాలని కన్నడ అభిమానులు కోరుతున్నారు.

What about the RCB team @chandrarsrikant? Is it 50% local quota only for players or the captain and coach must be natives? That’s also a business BTW. https://t.co/3fPn2ZyxX9
— Vaitheeswaran K (@vaitheek) July 17, 2024
ఇలా అయితే ప్రస్తుతం ఆర్సీబీలో ఉన్న విరాట్ కోహ్లీతో పాటు సిరాజ్, రజత్ పాటిదార్, అనూజ్ రావత్, ఆకాశ్ దీప్, మహిపాల్ లోమ్రర్ వంటి ఆటగాళ్లంతా దూరమవుతారు. ఇందుకు సంబంధించిన పోస్టులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలాఉండగా ఈ బిల్లుపై తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రస్తుతానికి దీనిని తాత్కాలికంగా నిలిపేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
Do that in IPL also…
Let’s see if RCB gets a cup this way at least… #Karnataka #politics #reservation pic.twitter.com/iITtGqlQsd
— Sidharth.M.P (@sdhrthmp) July 17, 2024