హైదరాబాద్, ఆట ప్రతినిధి: పంజాబ్‌లో జరుగుతున్న 19వ ఫెడరేషన్ కప్ జూనియర్ అథ్లెటిక్స్ టోర్నీలో తెలంగాణ స్టార్ అగసర నందిని రజత పతకంతో మెరిసింది. శనివారం జరిగిన బాలికల జూనియర్ లాంగ్‌జంప్ పోటీల్లో 5.80 మీటర్లు దూకిన నందిని ద్వితీయ స్థానంలో నిలిచింది. ఇదే పోటీలో పాల్గొన్న శైలిసింగ్(6.40మీ), అంజలి(5.63మీ) వరుసగా స్వర్ణ, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. రజత పతకంతో ఆకట్టుకున్న రాష్ట్ర గురుకుల విద్యార్థి నందినిని జాతీయ అథ్లెటిక్స్ కోచ్ నాగపురి రమేశ్ అభినందించారు.