రాహుల్ రాక.. క్వారంటైన్ ముగించుకున్న మయాంక్
- ప్రాక్టీస్‌లో ప్లేయర్లు
అహ్మదాబాద్: స్వదేశీ సీజన్‌ను విజయంతో ప్రారంభించిన టీమ్ఇండియా.. మరో మ్యాచ్ మిగిలుండగానే వెస్టిండీస్‌పై సిరీస్ చేజిక్కించుకోవాలని చూస్తున్నది. వ్యక్తిగత కారణాల వల్ల తొలి మ్యాచ్‌కు దూరమైన స్టార్ బ్యాటర్ లోకేశ్ రాహుల్.. రెండో వన్డేకు అందుబాటులో ఉండనున్నాడు. సోమవారమే అహ్మదాబాద్ చేరుకున్న రాహుల్ రోజంతా మైదానంలో చెమటోడ్చాడు. సిరీస్ ఆరంభానికి ముందు సీనియర్ ఓపెనర్ శిఖర్ ధవన్, రిజర్వ్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌తో పాటు మిడిలార్డర్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ కరోనా బారిన పడి ఐసొలేషన్‌కు పరిమితమైన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో మయాంక్ అగర్వాల్, ఇషాన్ కిషన్‌ను వన్డే జట్టులో చేర్చారు. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మతో కలిసి తొలి వన్డేలో ఇషాన్ ఇన్నింగ్స్ ప్రారంభించగా.. మూడు రోజుల క్వారంటైన్ ముగించుకున్న మయాంక్ సోమవారం గ్రౌండ్లో అడుగుపెట్టాడు. ఆదివారం వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో 6 వికెట్ల తేడాతో నెగ్గిన టీమ్ఇండియా ప్రాక్టీస్‌కు దూరంగా ఉండగా.. రాహుల్, మయాంక్, నవ్‌దీప్ సైనీ సుదీర్ఘంగా సాధన చేశారు. ‘ఎవరొచ్చారో చూశారా! ఈ ముగ్గురు జట్టుతో చేరారు. సోమవారం ప్రాక్టీస్ సెషన్లో చెమటోడ్చారు’ అని బీసీసీఐ ఈ ముగ్గురి ఫొటోలను ట్విట్టర్లో పెట్టింది. బుధవారం జరుగనున్న రెండో వన్డేలో మయాంక్ అగర్వాల్ ఓపెనర్‌గా బరిలోకి దిగుతాడా లేక.. గత మ్యాచ్‌లో జంటనే కొనసాగిస్తారా చూడాలి. ఇతర ఆటగాళ్లు ప్రాక్టీస్‌లో పాల్గొనకపోయినా.. కోచ్ రాహుల్ ద్రవిడ్.. మయాంక్, కేఎల్‌కు నెట్స్‌లో బంతులు వేస్తూ వారి ప్రాక్టీస్‌ను పర్యవేక్షించాడు.
గూగ్లీనే నా ప్రధాన అస్త్రం: చాహల్
తొలి వన్డే విజయంలో కీలక పాత్ర పోషించిన లెగ్‌స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ గూగ్లీనే తన ప్రధాన ఆయుధం అని పేర్కొన్నాడు. ఆదివారం విండీస్‌తో జరిగిన పోరులో నాలుగు వికెట్లు పడగొట్టి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచిన చాహల్.. కొత్త కెప్టెన్ రోహిత్‌తో మాట్లాడుతూ.. ‘దక్షిణాఫ్రికా గడ్డపై ఎక్కువ గూగ్లీలను ప్రయోగించలేకపోయా. మ్యాచ్‌కు ముందు ఈ అంశంపైనే చర్చించాం. ఈసారి అలాంటి తప్పిదాలు చేయకూడదని ముందే అనుకున్నా. ప్రత్యర్థి జట్టులో భారీ హిట్టర్లు ఉన్నప్పుడు వాళ్లు ఎక్కువసేపు నిదానంగా ఉండలేరు. అలాంటి సమయంలో గూగ్లీలు ఫలితాన్నిస్తాయి. జట్టుకు దూరమైనప్పుడు బౌలింగ్ మెరుగు పరుచుకోవడంపై దృష్టి పెట్టా. ఇతర బౌలర్లను గమనించి కొన్ని విషయాలు నేర్చుకున్నా. సైడ్ ఆర్మ్ బంతులతో వికెట్లు పడగొట్టడం సులువని గ్రహించా. నెట్స్‌లో బంతులేసేటప్పుడు దీన్ని ఉపయోగించా. బంతి వేగంగా కదులుతున్నట్లు అనిపించింది. దీన్నే మ్యాచ్‌లో కొనసాగించా’ అని అన్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran Nuclear Programme | ఇరాన్ ‘అణు’ గుట్టు చెబితే 20 మిలియన్ డాలర్లు
Sai Durga Tej | చిన్ననాటి స్నేహితురాలితో పెళ్లికి సిద్ధమైన సాయి దుర్గా తేజ్.. కాబోయే భార్యకు స్పెషల్ లవ్ లెటర్!
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

