‘బతుకమ్మ’ అంటేనే పాట. పాట ఉంటేనే బతుకమ్మ. ‘రామరామ రామ ఉయ్యాలో..’ అని రాగమెత్తితే.. సంతోషం సాష్టాంగ నమస్కారం చేస్తుంది. ‘పున్నాపు వెన్నెలా వలలో..’ అని పదం అందుకుంటే.. పుట్టెడు కష్టాలు సైతం కనువిప్పుతో లొంగిపోతాయి.
‘ఒక్కేసి పువ్వేసినట్లూ’.. ‘ఘనమైన పొన్నపువ్వు గజ్జెల వడ్డాణం’ వేసుకున్నట్లు బంధాలు బలోపేతం అవుతాయి. తరాలు మారినా తరగని వన్నెతో బతుకమ్మ పాటకు సగర్వంగా పట్టాభిషేకం చేద్దాం రండి! ఈ ఏడాది సంబురాల్లో ‘నమస్తే తెలంగాణ’ ప్రతినిధిగా ‘బతుకమ్మ’ ఆదివారం అనుబంధం మీ ఇంటికొస్తున్నది. మీకోసం గొంతెత్తి పాడుతున్నది. మీరు చేయాల్సిందల్లా ఒకటే.. మీకు నచ్చిన పాటను ఎంచుకుని, ఆ పాట దగ్గర ఇచ్చిన క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే చాలు.
– ఐనంపూడి శ్రీలక్ష్మి, సమన్వయ కర్త
1. ఒకటో రోజు ఓనగాయ..
(తొమ్మిది రోజుల పూజా విధానం)
సేకరణ : కొమురమ్మ
పాడినవారు : దయ్యాల భాగ్య
(గూడూరు, మహబూబాబాద్)
ఫోన్ నెం : 76598 50362
ఒకటోరోజు ఓనగాయ ఒక్కచుట్ల కోట తిరుగు
రంగాని రంగా నీటిలో ఓ గౌరమ్మ చక్కాని కోలాటమే ॥2॥
రెండోరోజు రొట్టె నీకు రెండుచుట్ల కోట తిరుగు
రంగాని రంగా నీటిలో ఓ గౌరమ్మ చక్కాని కోలాటమే ॥2॥
మూడోరోజు ముద్ద నీకు మూడుచుట్ల కోట తిరుగు
రంగాని రంగా నీటిలో ఓ గౌరమ్మ చక్కాని కోలాటమే ॥2॥
నాలుగో రోజు నానబియ్యం నాలుగుచుట్ల కోట తిరుగు
రంగాని రంగా నీటిలో ఓ గౌరమ్మ చక్కాని కోలాటమే ॥2॥
ఐదోరోజు అట్లు నీకు ఐదుచుట్ల కోట తిరుగు
రంగాని రంగా నీటిలో ఓ గౌరమ్మ చక్కాని కోలాటమే ॥2॥
ఆరో రోజు అర్రెం నీకు ఆరుచుట్ల కోట తిరుగు
రంగాని రంగా నీటిలో ఓ గౌరమ్మ చక్కాని కోలాటమే ॥2॥
ఏడో రోజు వేపకాయ ఏడుచుట్ల కోట తిరుగు
రంగాని రంగా నీటిలో ఓ గౌరమ్మ చక్కాని కోలాటమే ॥2॥
ఎనిమిదో రోజు న్నముద్ద ఎనిమిదిచుట్ల కోట తిరుగు
రంగాని రంగా నీటిలో ఓ గౌరమ్మ చక్కాని కోలాటమే ॥2॥
తొమ్మిదో రోజు సద్దుల్నీకు తొమ్మిది చుట్ల కోట తిరుగు
రంగాని రంగా నీటిలో ఓ గౌరమ్మ చక్కాని కోలాటమే ॥2॥
*****
2. సీతాసీరాముడు నాగమల్లేలమ్మ ..
(తొమ్మిది రోజుల పూజా విధానం)
సేకరణ : గుమ్మకొండ కళమ్మ
(ఎల్లమ్మ రంగాపురం,
నాగర్ కర్నూల్)
పాడినవారు : కవిత బోటుక,
ఫోన్ నెం : 85230 72218
సీతాసీరాముడు..
నాగమల్లేలమ్మ తీగమల్లేలో..
వనమాసమెల్లీరి..
నాగమల్లేలమ్మ తీగమల్లేలో..
వనమాసముల్లానే..
నాగమల్లేలమ్మ తీగమల్లేలో..
పూలావోనములుండే..
నాగమల్లేలమ్మ తీగమల్లేలో..
పూలావోనములోకి..
నాగమల్లేలమ్మ తీగమల్లేలో..
పోవయ్యా రామయ్యా..
నాగమల్లేలమ్మ తీగమల్లేలో..
తేవయ్యా గాపూలు..
నాగమల్లేలమ్మ తీగమల్లేలో..
మన తోటాగాదు సీత..
నాగమల్లేలమ్మ తీగమల్లేలో..
మాన్యావారి తోట..
నాగమల్లేలమ్మ తీగమల్లేలో..
మనకంటే ఎక్కూవా..
నాగమల్లేలమ్మ తీగమల్లేలో..
మాన్యా వారెవరయ్యా..
నాగమల్లేలమ్మ తీగమల్లేలో..
పోలేకా రామయ్యా..
నాగమల్లేలమ్మ తీగమల్లేలో..
పొంకాలు గొట్టేనే..
నాగమల్లేలమ్మ తీగమల్లేలో..
ఎర్రన్ని గుడ్లాకు..
నాగమల్లేలమ్మ తీగమల్లేలో..
ఎత్తేనే కోపంబూ..
నాగమల్లేలమ్మ తీగమల్లేలో..
తెల్లన్ని గుడ్లాకు..
నాగమల్లేలమ్మ తీగమల్లేలో..
తెచ్చిండు కోపంబు..
నాగమల్లేలమ్మ తీగమల్లేలో..
కట్టేనే గా సీతా..
నాగమల్లేలమ్మ తీగమల్లేలో..
బలమైన గా కొంగు..
నాగమల్లేలమ్మ తీగమల్లేలో..
దుంకేనే సీతమ్మ..
నాగమల్లేలమ్మ తీగమల్లేలో..
దుమ్మెగుర కుండానే..
నాగమల్లేలమ్మ తీగమల్లేలో..
ఒంపేనే సీతమ్మ..
నాగమల్లేలమ్మ తీగమల్లేలో..
వొడివాడా కుండానే..
నాగమల్లేలమ్మ తీగమల్లేలో..
తెంపేనే సీతమ్మా..
నాగమల్లేలమ్మ తీగమల్లేలో..
తొడిమే చెదురాకుండా..
నాగమల్లేలమ్మ తీగమల్లేలో..
మాన్యా వారొచ్చిరి..
నాగమల్లేలమ్మ తీగమల్లేలో..
ఎవరమ్మా గా తోట్ల..
నాగమల్లేలమ్మ తీగమల్లేలో..
దేశాలు ఏలేటి..
నాగమల్లేలమ్మ తీగమల్లేలో..
దేవుని బిడ్డానయ్య..
నాగమల్లేలమ్మ తీగమల్లేలో..
రాజ్యాలు ఏలేటి..
నాగమల్లేలమ్మ తీగమల్లేలో..
రాజుభార్యానయ్య..
నాగమల్లేలమ్మ తీగమల్లేలో..
అట్లయితే మా యింటి..
నాగమల్లేలమ్మ తీగమల్లేలో..
పెద్దా కోడలివమ్మ..
నాగమల్లేలమ్మ తీగమల్లేలో..
హరహరా నీతోట..
నాగమల్లేలమ్మ తీగమల్లేలో..
అగ్గియె వోనిగదరా..
నాగమల్లేలమ్మ తీగమల్లేలో..
శివశివ నీతోట..
నాగమల్లేలమ్మ తీగమల్లేలో..
సిత్తయ్యి వోని గదరా..
నాగమల్లేలమ్మ తీగమల్లేలో..
గోవిందా నీ పూలు..
నాగమల్లేలమ్మ తీగమల్లేలో..
గోడయై పోనిగదరా..
నాగమల్లేలమ్మ తీగమల్లేలో..
ముత్తయిదా నీ పూలు..
నాగమల్లేలమ్మ తీగమల్లేలో..
ముట్టాకా పోనిగదరా..
నాగమల్లేలమ్మ తీగమల్లేలో..
బాలాలు నీ పూలు..
నాగమల్లేలమ్మ తీగమల్లేలో..
భేంసాకా పోనిగదరా..
నాగమల్లేలమ్మ తీగమల్లేలో..
రేగిమల్లేలోయి.. తీగమల్లేలోయి..
* * *
3. పున్నమ్ము నాడల్ల..
(ఆవుపులి కథ)
పాడినవారు : కవిత బోటుక,
ఫోన్ నెం : 85230 72218
పున్నమ్ము నాడల్లా పుట్టి గంగ్యావు
రేగి మాల్లేలోయి.. తీగమాల్లేలో..
॥ రేగి మాల్లేలోయి.. తీగమాల్లేలో ॥
పుట్టూతా గంగమ్మా ఏమీ గోరింది
రేగి మాల్లేలోయి.. తీగమాల్లేలో..
॥ రేగి మాల్లేలోయి.. తీగమాల్లేలో ॥ ..
పుట్టుతా గంగమ్మా పురుడూ గోరింది
రేగి మాల్లేలోయి.. తీగమాల్లేలో..
॥ రేగి మాల్లేలోయి.. తీగమాల్లేలో ॥
పెరుగూతా గంగమ్మ ఏమి గోరింది
రేగి మాల్లేలోయి.. తీగమాల్లేలో..
రేగి మాల్లేలోయి, తీగమాల్లేలో ॥
పెరుగూతా గంగమ్మ పెండ్లీ గోరింది
రేగి మాల్లేలోయి.. తీగమాల్లేలో..
॥ రేగి మాల్లేలోయి.. తీగమాల్లేలో ॥
పాయేనే గంగమ్మ పోలమెగ్గిరానా
రేగి మాల్లేలోయి.. తీగమాల్లేలో..
॥ రేగి మాల్లేలోయి.. తీగమాల్లేలో ॥
ఎక్కరాని గట్లన్ని ఎక్కెక్కి మేసే
రేగి మాల్లేలోయి.. తీగమాల్లేలో..
॥ రేగి మాల్లేలోయి.. తీగమాల్లేలో ॥
దిగరాని గట్లన్ని దిగినీళ్లుతాగే
రేగి మాల్లేలోయి.. తీగమాల్లేలో..
॥ రేగి మాల్లేలోయి.. తీగమాల్లేలో ॥
గట్లల్లా నుంచోచ్చే బోట్ల పులిరాజు
రేగి మాల్లేలోయి.. తీగమాల్లేలో..
॥ రేగి మాల్లేలోయి.. తీగమాల్లేలో ॥
మింగుతా గంగమ్మ నిన్ను మింగుతా
రేగి మాల్లేలోయి.. తీగమాల్లేలో..
॥ రేగి మాల్లేలోయి.. తీగమాల్లేలో ॥
నా చిన్ని బసవయ్యకు పాలిచ్చివస్తా
రేగి మాల్లేలోయి.. తీగమాల్లేలో..
॥ రేగి మాల్లేలోయి.. తీగమాల్లేలో ॥
ముందొచ్చే ఆవుల్లారా మూగావుల్లారా
రేగి మాల్లేలోయి.. తీగమాల్లేలో..
॥ రేగి మాల్లేలోయి.. తీగమాల్లేలో ॥
మీరందరొస్తిరి మాయమ్మ ఏది
రేగి మాల్లేలోయి.. తీగమాల్లేలో..
॥ రేగి మాల్లేలోయి.. తీగమాల్లేలో ॥
నడుమొచ్చె ఆవుల్లారా నల్లావుల్లారా
రేగి మాల్లేలోయి.. తీగమాల్లేలో..
॥ రేగి మాల్లేలోయి.. తీగమాల్లేలో ॥
ఎనకొచ్చే ఆవుల్లారా ఎర్రావుల్లారా
రేగి మాల్లేలోయి.. తీగమాల్లేలో..
॥ రేగి మాల్లేలోయి.. తీగమాల్లేలో ॥
మీ అమ్మ పులితోని సేసేబాసల్లా
రేగి మాల్లేలోయి.. తీగమాల్లేలో..
॥ రేగి మాల్లేలోయి.. తీగమాల్లేలో ॥
ఒచ్చేనే గంగ్యావు ఒలమెగ్గిరానా
రేగి మాల్లేలోయి.. తీగమాల్లేలో..
॥ రేగి మాల్లేలోయి.. తీగమాల్లేలో ॥
పాలు తాగుదురారా చిన్ని బసవయ్య
రేగి మాల్లేలోయి.. తీగమాల్లేలో..
॥ రేగి మాల్లేలోయి.. తీగమాల్లేలో ॥
బాసాలాడిన పాలు మేమొల్లామమ్మ
రేగి మాల్లేలోయి.. తీగమాల్లేలో..
॥ రేగి మాల్లేలోయి.. తీగమాల్లేలో ॥
బాసాలాడిన పాలు బండల్లావిండూ
రేగి మాల్లేలోయి.. తీగమాల్లేలో..
॥ రేగి మాల్లేలోయి.. తీగమాల్లేలో ॥
సేసాలాడిన పాలు మేమొల్లామమ్మ
రేగి మాల్లేలోయి.. తీగమాల్లేలో..
॥ రేగి మాల్లేలోయి.. తీగమాల్లేలో ॥
సేసాలాడిన పాలు సెంబుల్ల విండు
రేగి మాల్లేలోయి.. తీగమాల్లేలో..
॥ రేగి మాల్లేలోయి.. తీగమాల్లేలో ॥
ఏదెరుగని బసవయ్యకు ఏంముండా జెప్పే
రేగి మాల్లేలోయి.. తీగమాల్లేలో..
॥ రేగి మాల్లేలోయి తీగమాల్లేలో ॥
కాపువారి సేతులా పడకు కొడుకా
రేగి మాల్లేలోయి.. తీగమాల్లేలో..
॥ రేగి మాల్లేలోయి.. తీగమాల్లేలో ॥
నాగాలి కడుదూరు, గెదిమి కొడుదూరు
రేగి మాల్లేలోయి.. తీగమాల్లేలో..
॥ రేగి మాల్లేలోయి.. తీగమాల్లేలో ॥
మాదిగవారి చేతుల్ల పడకు కొడుకా
రేగి మాల్లేలోయి.. తీగమాల్లేలో..
॥ రేగి మాల్లేలోయి.. తీగమాల్లేలో ॥
చర్మంబు తీత్తురు సెప్పులు కుడుదురు
రేగి మాల్లేలోయి.. తీగమాల్లేలో..
॥ రేగి మాల్లేలోయి.. తీగమాల్లేలో ॥
పాఏనె గంగమ్మ పొలమెగ్గిరానా
రేగి మాల్లేలోయి.. తీగమాల్లేలో..
॥ రేగి మాల్లేలోయి.. తీగమాల్లేలో ॥
తిందురా పులిరాజా నన్నూ తిందూరా
రేగి మాల్లేలోయి.. తీగమాల్లేలో..
॥ రేగి మాల్లేలోయి.. తీగమాల్లేలో ॥
మెచ్చితి గంగమ్మ నీ భక్తి మెచ్చితి
రేగి మాల్లేలోయి.. తీగమాల్లేలో..
॥ రేగి మాల్లేలోయి.. తీగమాల్లేలో ॥
ఇచ్చితి గంగమ్మ నీకు వరమిస్తే
రేగి మాల్లేలోయి.. తీగమాల్లేలో..
॥ రేగి మాల్లేలోయి.. తీగమాల్లేలో ॥
* * *
4. తూరుపు దిక్కున ఉయ్యాలో..
పాడినవారు : దయ్యాల భాగ్య,
సెల్ నెం : 76598 50362
(గూడూరు, మహబూబాబాద్)
తూర్పుదిక్కున ఉయ్యాలో..
తులసి వాన కురిసె ఉయ్యాలో..
పడమటి దిక్కున ఉయ్యాలో..
పాలవాన కురిసె ఉయ్యాలో..
ఆ వాన ఈ వాన ఉయ్యాలో..
చెరువు నిండిపాయే ఉయ్యాలో..
చెరువు నిండిపాయె ఉయ్యాలో..
కట్ట దెగిపాయే ఉయ్యాలో..
కట్టమీది మైసమ్మ ఉయ్యాలో..
ఏమని వరమడిగె ఉయ్యాలో..
నీ పెద్ద కొడుకును ఉయ్యాలో..
ఇస్తవ ఓ రాజ ఉయ్యాలో..
పెద్దకొడుకునిస్తె ఉయ్యాలో..
పేరుకెవ్వరు లేరు ఉయ్యాలో..
నీ నడిపి కొడుకును ఉయ్యాలో..
ఇస్తవ ఓ రాజ ఉయ్యాలో..
నడిపి కొడుకునిస్తె ఉయ్యాలో..
నడకకెవ్వరు లేరు ఉయ్యాలో..
నీ చిన్న కొడుకును ఉయ్యాలో..
ఇస్తవ ఓ రాజ ఉయ్యాలో..
చిన్నకొడుకుస్తె ఉయ్యాలో..
చిలిపికెవ్వరు లేరు ఉయ్యాలో..
నీ పెద్ద కోడల్ని ఉయ్యాలో..
ఇస్తవ ఓ రాజ ఉయ్యాలో..
పెద్ద కోడల్నిస్తె ఉయ్యాలో..
ఇంటి బాధ్యతలెట్ల ఉయ్యాలో..
నీ నడిపి కోడల్ని ఉయ్యాలో..
ఇస్తవ ఓ రాజ ఉయ్యాలో..
నడిపి కోడల్నిస్తె ఉయ్యాలో..
నారుమడులెట్ల ఉయ్యాలో..
నీ చిన్న కోడలి ఉయ్యాలో..
ఇస్తవ ఓ రాజ ఉయ్యాలో..
చిన్న కోడల్నిస్తె ఉయ్యాలో..
ఇంటి పనులెట్ల ఉయ్యాలో..
* * *
5. ఒక్కో ముచ్చం నేను నోముకుంటి..
సేకరణ : డి. భాగ్య
పాడినవారు : సిహెచ్. సుమలత,
ఫోన్ నెం : 96526 16809
ఒక్కో ముచ్చం నేను నోముకుంటి
ఒక్క ముచ్చం చెర్లు నేను నోముకొంటి
బాయిల్ల బచ్చల్ల నేను నోముకుంటి
కట్టమీది కాకర నేను నోముకుంటీ
నిండున్న చెర్లమీదా గౌరమ్మా
నీ నోము చెల్లిద్దు గౌరమ్మా
బంగారు గద్దె మీద గౌరమ్మా
నానోము చెల్లించు గౌరమ్మా
రెండో ముచ్చం నేను నోముకుంటి
రెండు ముచ్చం చెర్లు నేను నోముకొంటి
బాయిల్ల బచ్చల నేను నోముకుంటి
కట్టమీద కాకర నేను నోముకుంటీ
నిండున్న చెర్లమీదా గౌరమ్మా
నీ నోము చెల్లిద్దు గౌరమ్మా
బంగారు గద్దె మీద గౌరమ్మా
నానోము చెల్లించు గౌరమ్మా
మూడో ముచ్చం నేను నోముకుంటి
మూడు ముచ్చం చెర్ల్లు నేను నోముకొంటి
బాయిల్ల బచ్చల నేను నోముకుంటి
కట్టమీద కాకర నేను నోముకుంటీ
నిండున్న చెర్లమీదా గౌరమ్మా
నీ నోము చెల్లిద్దు గౌరమ్మా
బంగారు గద్దె మీద గౌరమ్మా
నానోము చెల్లించు గౌరమ్మా
నాల్గో ముచ్చం నేను నోముకుంటి
నాలుగు ముచ్చం చెర్లు నేను నోముకొంటి
బాయిల్ల బచ్చల నేను నోముకుంటి
కట్టమీద కాకర నేను నోముకుంటీ
నిండున్న చెర్లమీదా గౌరమ్మా
నీ నోము చెల్లిద్దు గౌరమ్మా
బంగారు గద్దె మీద గౌరమ్మా
నానోము చెల్లించు గౌరమ్మా
ఐదవ ముచ్చం నేను నోముకుంటి
అయిదు ముచ్చం చెర్ల్లు నేను నోముకొంటి
బాయిల్ల బచ్చల నేను నోముకుంటి
కట్టమీద కాకర నేను నోముకుంటీ
నిండున్న చెర్లమీదా గౌరమ్మా
నీ నోము చెల్లిద్దు గౌరమ్మా
బంగారు గద్దె మీద గౌరమ్మా
నానోము చెల్లించు గౌరమ్మా
ఆరవ ముచ్చం నేను నోముకుంటి
ఆరు ముచ్చం చెర్ల్లు నేను నోముకొంటి
బాయిల్ల బచ్చల నేను నోముకుంటి
కట్టమీద కాకర నేను నోముకుంటీ
నిండున్న చెర్లమీదా గౌరమ్మా
నీ నోము చెల్లిద్దు గౌరమ్మా
బంగారు గద్దె మీద గౌరమ్మా
నానోము చెల్లించు గౌరమ్మా
ఏడో ముచ్చం నేను నోముకుంటి
ఏడు ముచ్చం చెర్లు నేను నోముకొంటి
బాయిల్ల బచ్చల నేను నోముకుంటి
కట్టమీద కాకర నేను నోముకుంటీ
నిండున్న చెర్లమీదా గౌరమ్మా
నీ నోము చెల్లిద్దు గౌరమ్మా
బంగారు గద్దె మీద గౌరమ్మా
నానోము చెల్లించు గౌరమ్మా
ఎనిమిదో ముచ్చం నేను నోముకుంటి
ఎనిమిది ముచ్చం చెర్లు నేను నోముకొంటి
బాయిల్ల బచ్చల నేను నోముకుంటి
కట్టమీద కాకర నేను నోముకుంటీ
నిండున్న చెర్లమీదా గౌరమ్మా
నీ నోము చెల్లిద్దు గౌరమ్మా
బంగారు గద్దె మీద గౌరమ్మా
నానోము చెల్లించు గౌరమ్మా
తొమ్మిదో ముచ్చం నేను నోముకుంటి
తొమ్మిది ముచ్చం చెర్లు నేను నోముకొంటి
బాయిల్ల బచ్చల నేను నోముకుంటి
కట్టమీద కాకర నేను నోముకుంటీ
నిండున్న చెర్లమీదా గౌరమ్మా
నీ నోము చెల్లిద్దు గౌరమ్మా
బంగారు గద్దె మీద గౌరమ్మా
నానోము చెల్లించు గౌరమ్మా
* * *
6. రామరామ రామ ఉయ్యాలో..
సేకరణ : మధు, అపర్ణ
(వేములవాడ, రాజన్న సిరిసిల్ల జిల్లా)
పాడినవారు : గౌండ్ల మల్లేశ్వరి,
ఫోన్ నెం : 94942 33176
రామరామ రామ ఉయ్యాలో..
రామలంతా రండి ఉయ్యాలో..
కైలాసవాసుల ఉయ్యాలో..
కథలు పాడుదాము ఉయ్యాలో..
బతుకునిచ్చే గౌరి ఉయ్యాలో..
భాగ్యాల శ్రీ గౌరి ఉయ్యాలో..
పాటలు పాడంగ ఉయ్యాలో..
పడుతులంతా రండి ఉయ్యాలో..
కొడుకుల్ని కోరుతూ ఉయ్యాలో..
కోమలీ పార్వతీ ఉయ్యాలో..
పసుపు చేతబట్టి ఉయ్యాలో..
బొమ్మనే జేసేను ఉయ్యాలో..
ప్రాణమే పొసేను ఉయ్యాలో..
పడతి పార్వతి ఉయ్యాలో..
తానాలు సెయ్యంగ ఉయ్యాలో..
తలుపు కావలి వెట్టె ఉయ్యాలో..
ఎవ్వరచ్చినగాని ఉయ్యాలో..
లోనికి రాకుండా ఉయ్యాలో..
సూడుమని సెప్పె ఉయ్యాలో..
సుదతి పార్వతి ఉయ్యాలో..
అమ్మమాట విని ఉయ్యాలో..
అట్లనే జేసిండు ఉయ్యాలో..
అయ్య శివయ్యను ఉయ్యాలో..
ఆకిట్ల ఉంచిండు ఉయ్యాలో..
మారు సెప్పావోతే ఉయ్యాలో..
మాట యినకనుండె ఉయ్యాలో..
మల్ల రాపో అనెను ఉయ్యాలో..
మాత ఆన అనే ఉయ్యాలో..
కోపాన శివయ్య ఉయ్యాలో..
కస్సుబుస్సుమనే ఉయ్యాలో..
తప్పుకో లేకుంటే ఉయ్యాలో..
తలను తీస్తాననే ఉయ్యాలో..
తడబడక నిల్సుండే ఉయ్యాలో..
తల్లిని తల్చుచు ఉయ్యాలో..
కత్తి దూసి శివుడు ఉయ్యాలో..
కంఠాన వెట్టిండు ఉయ్యాలో..
బాలునీ తలదీసె ఉయ్యాలో..
బమ్మాండమే అదిరె ఉయ్యాలో..
తల్లి తలుపుదీసె ఉయ్యాలో..
తల్లడిల్లిపోయే ఉయ్యాలో..
గోసగోసతోని ఉయ్యాలో..
గొల్లుమన్నది తల్లి ఉయ్యాలో..
బిడ్డ ముఖము జూసి ఉయ్యాలో..
బోరుమన్నది తల్లి ఉయ్యాలో..
శివుని చెంతజేరి ఉయ్యాలో..
చిన్నిపాపని గోరె ఉయ్యాలో..
లేకుంటే నేనుండ ఉయ్యాలో..
అంటూ ఏడ్వాసాగె ఉయ్యాలో..
ఏమి సేతునంటూ ఉయ్యాలో..
తెల్లబోయె శివుడు ఉయ్యాలో..
దివ్యదృష్టి తోని ఉయ్యాలో..
దిక్కులన్ని జూసె ఉయ్యాలో..
ఉత్తరపు దిక్కున ఉయ్యాలో..
ఉత్తమంగా తపసు ఉయ్యాలో..
చేస్తుండే గజరాజు ఉయ్యాలో..
క్షణమైన ఆగక ఉయ్యాలో..
శివ శివా యనుకుంటా ఉయ్యాలో..
శివ నామమే జెప్పె ఉయ్యాలో..
భటుల విలిసె శివుడు ఉయ్యాలో..
భోళా శంకరుడు ఉయ్యాలో..
గజరాజుకున్నట్టి ఉయ్యాలో..
తలను తెమ్మన్నాడు ఉయ్యాలో..
భవాని శార్వాణి ఉయ్యాలో..
బాధనే బాపంగ ఉయ్యాలో..
గజ వదనము దెచ్చి ఉయ్యాలో..
గడియలో అతికించే ఉయ్యాలో..
అమ్మంట లేసిండు ఉయ్యాలో..
అమ్మ సెంతకురికె ఉయ్యాలో..
హత్తుకుని యేడ్సింది ఉయ్యాలో..
అంబా పార్వతి కొడుకునుయ్యాలో
ఆనాటి నుండియు ఉయ్యాలో..
అంబికా సుతుడు ఉయ్యాలో..
గజముఖ వదనుడు ఉయ్యాలో..
గణపతిగ మారెను ఉయ్యాలో..
లోకాలలో తాను ఉయ్యాలో..
శోకాలు పోగొట్టు ఉయ్యాలో..
ఉండ్రాళ్లు వెట్టితే ఉయ్యాలో..
ఉర్వి లో జనులకు ఉయ్యాలో..
కోరినవి యిచ్చును ఉయ్యాలో..
కోర్కెలే దెర్చును ఉయ్యాలో..
బెల్లము పెట్టితే ఉయ్యాలో..
ఎల్లరను కాచును ఉయ్యాలో..
మూషికా వాహనుడు ఉయ్యాలో..
ముక్తినిచ్చునయ్య ఉయ్యాలో..
విన్నవారికి గూడ ఉయ్యాలో..
విఘ్ననాయకుడు ఉయ్యాలో..
విఘ్నాలు తొలగించు ఉయ్యాలో..
విష్ణు లోకమునిచ్చు ఉయ్యాలో..
పాడినావారికీ ఉయ్యాలో..
పార్వతీ కుమరుండు ఉయ్యాలో..
బాధల్లు బాపును ఉయ్యాలో..
రామ రామ రామ ఉయ్యాలో..
రామలంతా రండి ఉయ్యాలో..
కైలాసవాసుల ఉయ్యాలో..
కథలు పాడుదాము ఉయ్యాలో..
రామరామ రామ ఉయ్యాలో..
రామలంతా రండి ఉయ్యాలో..
* * *
7. నాగుల పంచమి ఉయ్యాలో..
పాడినవారు : గౌండ్ల మల్లేశ్వరి,
ఫోన్ నెం : 94942 33176
నాగుల పంచమి నాడు ఉయ్యాలో..
నరులొక్కపొద్దు ఉయ్యాలో..
మా ఇంట్ల నాగరాణి ఉయ్యాలో..
దశిమొక్కాపొద్దు ఉయ్యాలో..
ముత్యాల బండెక్కి ఉయ్యాలో..
ముని జలకామాడే ఉయ్యాలో..
పగడాల బండెక్కి ఉయ్యాలో..
పై జలకామాడె ఉయ్యాలో..
కంచిపట్టూ చీర ఉయ్యాలో..
తానుగట్టినాది ఉయ్యాలో..
దొంతుల్ల టొపిరైకె ఉయ్యాలో..
జాడిచ్చీ తొడిగే ఉయ్యాలో..
ప్యాలాలు పుట్నాలు ఉయ్యాలో..
వొల్లెవోసూకోని ఉయ్యాలో..
సన్నపూరైకలు ఉయ్యాలో..
చక్కనీ కుడుకలు ఉయ్యాలో..
పసుపూ కుంకుమా ఉయ్యాలో..
తావండ్లవెట్టుకొని ఉయ్యాలో..
ఇల్లెల్లె నాగరాణి ఉయ్యాలో..
ఇల్లింత పువ్వొలె ఉయ్యాలో..
బయలెల్లె నాగరాణి ఉయ్యాలో..
బంతీపువ్వోలె ఉయ్యాలో..
దొడ్డెల్లె నాగరాణి ఉయ్యాలో..
దోసాపువ్వోలే ఉయ్యాలో..
ఆడికెల్లి నాగరాణి ఉయ్యాలో..
పుట్టకొచ్చీనాది ఉయ్యాలో..
పుట్టచుట్టూ తిరిగి ఉయ్యాలో..
పూదిచ్చి మొక్కె ఉయ్యాలో..
పుట్టాలున్నా నాగ ఉయ్యాలో..
బుస్సుమనీలేసె ఉయ్యాలో..
నడుము దింపకు నాగ ఉయ్యాలో..
నీ నడిపి చెల్లెల్ని ఉయ్యాలో..
గుడ్లుదియ్యకు నాగ ఉయ్యాలో..
గొడ్డురాల్ను కాను ఉయ్యాలో..
గుంజుకొని పడిగే ఉయ్యాలో..
గుమ్మడీ వనములకు ఉయ్యాలో..
మల్సుకో నీ పడిగె ఉయ్యాలో..
మల్లె వనములకు ఉయ్యాలో..
* * *
8. బాజర్ల కృష్ణయ్య ఉయ్యాలో….
పాడినవారు: పి. సుజాత
బాజర్ల కృష్ణయ్య ఉయ్యాలో..
బంతూలాడంగ ఉయ్యాలో..
బంతివొయ్యి రాజవ్వ ఉయ్యాలో..
మేడల్లవడె ఉయ్యాలో..
నా బంతి నాకియ్యె ఉయ్యాలో..
ఓ రాజవ్వ ఉయ్యాలో..
నీ బంతి నీకియ్య ఉయ్యాలో..
నిన్నే ఓనియ్య ఉయ్యాలో..
వేలి ఉంగ్రమిచ్చి ఉయ్యాలో..
చెండందూకూనె ఉయ్యాలో..
ఆడికెల్లి కృష్ణయ్య ఉయ్యాలో..
ఇంటికొచ్చినాడు ఉయ్యాలో..
వచ్చివాకిట్ల నిలిచి ఉయ్యాలో..
అమ్మానీ పిలిచె ఉయ్యాలో..
కాళ్లాకు నీలిచ్చి ఉయ్యాలో..
కన్నీరే తీసి ఉయ్యాలో..
చేతికి నీళ్లిచ్చి ఉయ్యాలో..
చెయ్యివారాజూసె ఉయ్యాలో..
ఏలి ఉంగ్రమేదిర ఉయ్యాలో..
వెలదీ కృష్ణయ్య ఉయ్యాలో..
బర్లయ్య కొట్టంలా ఉయ్యాలో..
పెండదియ్యావోతె ఉయ్యాలో..
పెండలావడెనేమో ఉయ్యాలో..
ఎరువయ్యేనేమో ఉయ్యాలో..
ఎరువు బండ్లూదెచ్చి ఉయ్యాలో..
ఎరువెల్లావోసె ఉయ్యాలో..
ఎరువులా లేదుగదర ఉయ్యాలో..
వెలదీ కృష్ణయ్య ఉయ్యాలో..
కాకయ్య కొట్టంలా ఉయ్యాలో..
పాలువిండావోతే ఉయ్యాలో..
పాలల్ల వడెనేమో ఉయ్యాలో..
పెరుగయ్యేనేమో ఉయ్యాలో..
పట్టుబట్టలుదెచ్చి ఉయ్యాలో..
పాలోడావోసిరి ఉయ్యాలో..
పాలల్ల లేదుగదరా ఉయ్యాలో..
ప్రణతీ కృష్ణయ్య ఉయ్యాలో..
శోభనాలాబాయికి ఉయ్యాలో..
తానమాడావోతె ఉయ్యాలో..
బాయిలా వడెనేమో ఉయ్యాలో..
చాపమింగేనేమో ఉయ్యాలో..
బాయికాడోళ్లను పిలిచి ఉయ్యాలో..
చాపలెల్లాదీసిరి ఉయ్యాలో..
చాపలలేదుగదరా ఉయ్యాలో..
వెలదీ కృష్ణయ్య ఉయ్యాలో..
పట్టుండ్రి రాజవ్వను ఉయ్యాలో..
పగ్గాలాతోటి ఉయ్యాలో..
గుంజుండ్రి రాజవ్వను ఉయ్యాలో..
గుర్రాలాతోని ఉయ్యాలో..
* * *
9. కట్టమీద నిమ్మ ఉయ్యాలో….
సేకరణ : కళ్యాణి (నిర్మల్)
పాడినవారు : టి. స్వర్ణ,
ఫోన్ నెం : 63021 12213
కట్టమీది నిమ్మ ఉయ్యాలో..
కాయల్ల నిమ్మ ఉయ్యాలో..
ధనిపూత పూసిందే ఉయ్యాలో..
భూకైవాసనలే ఉయ్యాలో..
ధనికాత గాసిందె ఉయ్యాలో..
గజ్జెవారి కాత ఉయ్యాలో..
దని పండు మక్కిందె ఉయ్యాలో..
పొన్నెండు రుచులే ఉయ్యాలో..
యెముడాల రాజన్న ఉయ్యాలో..
పండోయి పండు ఉయ్యాలో..
ఆ పండు గొనాలె ఉయ్యాలో..
నేను దీనాలె ఉయ్యాలో..
కొండగట్టు అంజన్న ఉయ్యాలో..
పండోయి పండు ఉయ్యాలో..
ఆడికెళ్లి ఆ బండి ఉయ్యాలో..
సిరిసైలం దాకా ఉయ్యాలో..
సిరిసైలం మల్లన్న ఉయ్యాలో..
పండోయి పండు ఉయ్యాలో..
ఆ పండు గొనాలె ఉయ్యాలో..
పండోయి పండు ఉయ్యాలో..
పుట్టలున్న నాగన్న ఉయ్యాలో..
పండోయి పండు ఉయ్యాలో..
పడిగ తాకట్టు వెట్టి ఉయ్యాలో..
పండు గొనాలె ఉయ్యాలో.. ॥ కట్టమీద ॥
* * *
10. గంగమ్మ గంగమ్మ వోలె..
సేకరణ : కళ్యాణి (నిర్మల్)
పాడినవారు : టి. స్వర్ణ,
ఫోన్ నెం : 63021 12213
గంగమ్మ గంగమ్మ కోల్..
గవ్వాలాడంగా కోల్..
బట్టమి లచ్చి గౌరమ్మ కోల్..
బైటానున్నాదె కోల్..
సేరుల సెంబేడు కోల్..
లేవే ఉతుకాలు కోల్..
బాయిల బానెడు కోల్..
లేవే ఉతుకాలు కోల్..
గంగాల గాటెడు కోల్..
లేవే ఉతుకాలు కోల్..
నేను గట్టె సీరేలు కోల్..
నీకిత్తినె కోల్..
నువ్వుగట్టె సీరెలు కోల్..
నాకున్నాయక్క కోల్..
నేను దొడిగె రైకలు కోల్..
నీకిత్తనె గంగా కోల్..
నువు దొడిగె రైకలు కోల్..
నాకున్నాయక్క కోల్..
నేను వెట్టే సొమ్ములు కోల్..
నీకిత్తనె గంగా కోల్..
నువు వెట్టినా సొమ్ములు
నాకున్నాయక్క కోల్..
నేనేలె పురుషున్ని కోల్..
నీకిత్తనె గంగా కోల్..
సలసాల గంగమ్మ కోల్..
సాలాలైపాయే కోల్..
బుగబుగలా గంగమ్మ కోల్..
బుగ్గలాపాయే కోల్..
సాటలు గుల్లాలు కోల్..
కోట్టూకారంగా కోల్..
మొద్దూలు మోదుల్లు కోల్..
కోట్టూకారంగా కోల్..
సాటిల సమితికి కోల్..
నేనే మొక్కానైతి కోల్..
మొద్దూలు మోదుల్లు కోల్..
కొట్టూకారంగా కోల్..
మోటుల సమితికి కోల్..
నేను మొక్కానైతి కోల్.. ॥ గంగమ్మ॥
* * *
11. ఊరికి ఉత్తరాన వెన్నెలో వెన్నెల..
(సూర్యచంద్ర గ్రహణాలపై)
సేకరణ : డా. బండారు సుజాత శేఖర్,
ఫోన్ నెం : 98664 26640
పాడినవారు : నకిరకంటి పద్మ
ఊరికి ఉత్తరాన.. వెన్నెలో వెన్నెలా..
ఊడాలా మర్రికింద.. వెన్నెలో వెన్నెలా..
కోవుల్లా పుట్టుంది.. వెన్నెలో వెన్నెలా..
కోవుల్లా పుట్టలోన.. వెన్నెలో వెన్నెలా..
కోడె నాగన్నుండు.. వెన్నెలో వెన్నెలా..
ఆ కోడె నాగన్న.. వెన్నెలో వెన్నెలా..
ముక్కిడిచి పెట్టిండు.. వెన్నెలో వెన్నెలా..
ముప్పైవేలా గుడ్లు.. వెన్నెలో వెన్నెలా..
ముంతేడు ఆ గుడ్లు.. వెన్నెలో వెన్నెలా..
ముంతేడు ఆ గుడ్లు.. వెన్నెలో వెన్నెలా..
ముప్పైవేలా గుడ్లు.. వెన్నెలో వెన్నెలా..
తోకిడిచి పెట్టిండు.. వెన్నెలో వెన్నెలా..
తొంభైవేలా గుడ్లు.. వెన్నెలో వెన్నెలా..
చాటాడు ఆ గుడ్లు.. వెన్నెలో వెన్నెలా..
నడిమిగిచి పెట్టిండు.. వెన్నెలో వెన్నెలా..
నలభైవేలా గుడ్లు.. వెన్నెలో వెన్నెలా..
నలభైవేలా గుడ్లు.. వెన్నెలో వెన్నెలా..
నడిమిగిచి పెట్టిండు.. వెన్నెలో వెన్నెలా..
పెట్టిపెట్టి ఆ గుడ్లు.. వెన్నెలో వెన్నెలా..
మేతాకెళ్ళీనాడు.. వెన్నెలో వెన్నెలా..
పసులకాడి దుడ్లు.. వెన్నెలో వెన్నెలా..
పసులకాడి దుడ్లు.. వెన్నెలో వెన్నెలా..
ఎంత పాపకారులు.. వెన్నెలో వెన్నెలా..
పుట్టాను తొవ్వినారు.. వెన్నెలో వెన్నెలా..
ముంతాడు ఆ గుడ్లు.. వెన్నెలో వెన్నెలా..
ముక్కలు జేసినారు.. వెన్నెలో వెన్నెలా..
తొంభైవేల గుడ్లు.. వెన్నెలో వెన్నెలా..
తొక్కిపారేసినారు.. వెన్నెలో వెన్నెలా..
మేతాకెళ్ళిన నాగన్న.. వెన్నెలో వెన్నెలా..
తల ఎత్తి చూశిండు.. వెన్నెలో వెన్నెలా..
పరుగునా నాగన్న.. వెన్నెలో వెన్నెలా..
పైపైకి బోయిండు.. వెన్నెలో వెన్నెలా..
పసులకాడి దుడ్డెలు.. వెన్నెలో వెన్నెలా..
గజ్జునా వణికిండ్రు.. వెన్నెలో వెన్నెలా..
సూర్యుని చాటుకు.. వెన్నెలో వెన్నెలా..
పొయిరే ఆ దుడ్డెలు.. వెన్నెలో వెన్నెలా..
విడువిడువు సూర్యుడా.. వెన్నెలో వెన్నెలా..
నా గుడ్లను చంపిన్రు.. వెన్నెలో వెన్నెలా..
నే నిడువ నాగన్న.. వెన్నెలో వెన్నెలా..
విడువా నాగన్న.. వెన్నెలో వెన్నెలా..
తెలువాక జేసిండ్రు.. వెన్నెలో వెన్నెలా..
తప్పు క్షమించమ్మ.. వెన్నెలో వెన్నెలా..
ఏడాది కొకరోజు.. వెన్నెలో వెన్నెలా..
నన్ను కాటేయమ్మ.. వెన్నెలో వెన్నెలా..
సూర్యగ్రహణం బాని.. వెన్నెలో వెన్నెలా..
నన్ను కాటేయమ్మ.. వెన్నెలో వెన్నెలా..
చంద్రుని చాటుకు.. వెన్నెలో వెన్నెలా..
పొయిరే దుడ్డెలు.. వెన్నెలో వెన్నెలా..
విడువిడువు చందురుడా.. వెన్నెలో వెన్నెలా..
నా గుడ్లను చిదిమిండ్రు.. వెన్నెలో వెన్నెలా..
నేనిడువ నాగన్న.. వెన్నెలో వెన్నెలా..
విడువా నాగన్న.. వెన్నెలో వెన్నెలా..
తెలియాక జేసిండ్రు.. వెన్నెలో వెన్నెలా..
తప్పూ క్షమించు.. వెన్నెలో వెన్నెలా..
ఏడాది కొకసారి.. వెన్నెలో వెన్నెలా..
నన్ను కాటేయమ్మ.. వెన్నెలో వెన్నెలా..
చంద్రగ్రహణం బాని.. వెన్నెలో వెన్నెలా..
నన్ను కాటేయమ్మ.. వెన్నెలో వెన్నెలా..
అప్పుడు నాగన్న.. వెన్నెలో వెన్నెలా..
క్షమియించి తిరిగిండు.. వెన్నెలో వెన్నెలా..
పసులకాడి పిల్లలు.. వెన్నెలో వెన్నెలా..
పుట్టకాడి కొచ్చిండ్రు.. వెన్నెలో వెన్నెలా..
పసుపు కుంకుమ తోని.. వెన్నెలో వెన్నెలా..
పూజలే జేసిండ్రు.. వెన్నెలో వెన్నెలా..
తప్పులు కాయమంటూ.. వెన్నెలో వెన్నెలా..
మొక్కులే మొక్కిండ్రు.. వెన్నెలో వెన్నెలా..
తెలియక జేసితిమి.. వెన్నెలో వెన్నెలా..
క్షమించు నాగన్న.. వెన్నెలో వెన్నెలా..
* * *
12. చేమంతి వనములో..
సేకరణ : అనసూయమ్మ
పాడినవారు : డా. బండారు సుజాత శేఖర్,
ఫోన్ నెం : 98664 26640
చేమంతి వనములో భామలు..
చెలిమ తోడినారు భామలు..
చెలిమ కుంటలోన భామలు..
ఓలలాడినారు భామలు..
పదహారు వేల స్త్రీలు భామలు..
పడుచుకన్నెలమ్మ భామలు..
ఓలలాడినారు భామలు..
ఒళ్లు మరిచినారు భామలు..
చీరెలు విడిచిరి భామలు..
ఒడ్డున బెట్టిరి భామలు..
రవికెలు విడిచిరి భామలు..
ఒడ్డున బెట్టిరి భామలు..
పొన్నమావి మీద కృష్ణుడు.. ..
పొందుగ కూర్చుండు కృష్ణుడు..
చీరెలన్ని దీసి కృష్ణుడు..
చంకన బెట్టిండు కృష్ణుడు..
కోటివేల చీర కృష్ణుడు..
కొమ్మకు తగిలించే కృష్ణుడు..
మూడువేల చీర కృష్ణుడు..
మూట గట్టినాడు కృష్ణుడు..
చీరలేవి అక్క మనవి..
రవికలేవి అక్క మనవి..
సుడిగాలి వచ్చెనేమో చెలియా..
సుట్టుకు పోయెనేమో చెలియా..
వానగాలి వచ్చెనేమో సఖియా..
వరద చుట్టెనేమో చెలియా..
అటు ఇటు చూచిరి భామలు..
కృష్ణుని చూచిరి భామలు..
కానుగాకులన్ని భామలు..
కాశబోసినారూ భామలు..
మోదుగాకులన్ని భామలు..
మొలకు చుట్టినారూ భామలు..
పొన్న తీగెలన్ని భామలు..
కొంగులేసినారు భామలు..
చీరెలివ్వు కృష్ణా మావి..
రవికెలివ్వు కృష్ణా మావి..
చీరెలు నేనెరుగ భామ..
రవికెలు నేనెరుగా భామ..
ఒంటి చెయ్యి దండంబు చెలియా..
ఒప్పదు నా మనసు చెలియా..
జోడు చేతుల శరణు కృష్ణా..
చీరెలు మాకివ్వు కృష్ణా..
ఏమి చీరె నీది భామా..
నీది ఏమి రవికె నీది సఖియా..
ఎర్రరంగు చీరె నాది కృష్ణా..
గుమ్మపండు రవికె కృష్ణా..
పాలు పెరుగు త్రావి కృష్ణా..
బలిసినావు నీవు కృష్ణా..
జున్ను పాలు త్రావి కృష్ణా..
దుముకుతావు నీవు కృష్ణా..
మా వాడకురారా కృష్ణా..
మర్దన చేయిస్తాం కృష్ణా..
మా వీధికి రారా కృష్ణా..
నీ పని పడతాము కృష్ణా..
* * *
13. ఓ రామా రాఘవా.. జయ రామ రాఘవా..
పాడినవారు : గుమ్మకొండ కళమ్మ
(ఎల్లమ్మ రంగాపురం),
ఫోన్ నెం : 85230 72218
ఓ రామా రాఘవా.. జై రామా రాఘవా..
సీతా సీరాముడు.. ఓ రామా రాఘవా..
వొనవాసామెల్లంగా.. ఓ రామా రాఘవా..
వొనవాసాముల్లనే.. ఓ రామా రాఘవా..
సిరిపొన్నా సెట్టురా.. ఓ రామా రాఘవా..
సిరిపొన్నా సెట్టుకిందా.. ఓ రామా రాఘవా..
సిన్నంగా అలికిరీ.. ఓ రామా రాఘవా..
సిరిముగ్గులేసిరీ.. ఓ రామా రాఘవా..
సిరిముగ్గులవీనలే.. ఓ రామా రాఘవా..
సిరిసాపాలేసిరీ.. ఓ రామా రాఘవా..
సిరిసాపలవీనలే.. ఓ రామా రాఘవా..
సిరిగద్దే పీటలు.. ఓ రామా రాఘవా..
సిరిగద్దే పిటవీనవో.. ఓ రామా రాఘవా..
సీతాసీరాముడు.. ఓ రామా రాఘవా..
జూదామాడంగనే.. ఓ రామా రాఘవా..
ఆడూతాడూతనే.. ఓ రామా రాఘవా..
అక్కడ జుసె సీతమ్మా.. ఓ రామా రాఘవా..
ఆరావణసూరుడు.. ఓ రామా రాఘవా..
మాయలేడీని వంపెరా.. ఓ రామా రాఘవా..
అడివీలున్న పక్షికీ.. ఓ రామా రాఘవా..
అడుగెంతో సక్కనా.. ఓ రామా రాఘవా..
అడివీలున్న పక్షికీ.. ఓ రామా రాఘవా..
సూపెంతో సక్కనా.. ఓ రామా రాఘవా..
దాన్ని జంపీ దానితోలూ.. ఓ రామా రాఘవా..
ఒట్టీతోలూమీదా.. ఓ రామా రాఘవా..
నీవేలా బౌశెవే.. ఓ రామా రాఘవా..
సీరెలుగావాలెనో.. ఓ రామా రాఘవా..
వజ్రాలుతాపినా.. ఓ రామా రాఘవా..
సీరెలున్నంగనే.. ఓ రామా రాఘవా..
రైకెలు గావాలెనో.. ఓ రామా రాఘవా..
ముత్యాలు తాపినా.. ఓ రామా రాఘవా..
మురికీ తోలూ మీదా.. ఓ రామా రాఘవా..
నీవేలా బౌశెవే.. ఓ రామా రాఘవా..
పాయేనే రాముడు.. ఓ రామా రాఘవా..
ఆ మాయాలేడికిరా.. ఓ రామా రాఘవా..
మాయాలేడి ముందరా.. ఓ రామా రాఘవా..
రామూడు యెనుకరా.. ఓ రామా రాఘవా..
రామూడు ముందరా.. ఓ రామా రాఘవా..
మాయా లేడియెనుకరా.. ఓ రామా రాఘవా..
మాయన్నకు ఆపతీ.. ఓ రామా రాఘవా..
కలిగేది ఏలనూ.. ఓ రామా రాఘవా..
ఆకూసాటూనంగా.. ఓ రామా రాఘవా..
అందేనే బాణమూ.. ఓ రామా రాఘవా..
ఆపతులూ గలిగెనూ.. ఓ రామా రాఘవా..
పోవయ్యా లక్ష్మణా.. ఓ రామా రాఘవా..
ఆపతులూ గల్గితే.. ఓ రామా రాఘవా..
నీల్లమీన గొడ్డలీ.. ఓ రామా రాఘవా..
నిలవాలే ఒదినమ్మా.. ఓ రామా రాఘవా..
నిప్పుల మీన ఈగలూ.. ఓ రామా రాఘవా..
వాలాలే ఒదినమ్మా.. ఓ రామా రాఘవా..
* * *
14. బల్సుగాయల శెట్టు..
సేకరణ : గుమ్మకొండ కళమ్మ
పాడినవారు : బోటుక కవిత,
ఫోన్ నెం : 85230 72218
బల్సుగాయల శెట్టూ ఉయ్యాలో..
బాటాకందమ్మే ఉయ్యాలో..
బలంగల్లా శేడే ఉయ్యాలో..
పాడీనందమ్మే ఉయ్యాలో..
పాడిగప్పున నోరూ ఉయ్యాలో..
మూసీనందమ్మే ఉయ్యాలో..
అన్నల్లూ గల్ల శేడే ఉయ్యాలో..
అలగీనందమ్మే ఉయ్యాలో..
అలిగరుగుల మీదా ఉయ్యాలో..
ఒరిగీనందమ్మే ఉయ్యాలో..
ఒదినెల్లూ ఒచ్చీ ఉయ్యాలో..
లేపీనందమ్మే ఉయ్యాలో..
తెల్లని గుడ్డల్లో ఉయ్యాలో..
పౌడమంతా సద్దీ ఉయ్యాలో..
అన్నల్లు జెల్లెండ్లు ఉయ్యాలో..
ఒగతోవనవోంగా ఉయ్యాలో..
వాల్లు వొయ్యె తోవల్లో ఉయ్యాలో..
అల్లా నేరెల్లూ ఉయ్యాలో..
అల్లనేరడి కిందా ఉయ్యాలో..
సల్లన్ని సెలిమె ఉయ్యాలో..
సల్లన్ని సెలిమెల్లో ఉయ్యాలో..
సద్దులారాగించీ ఉయ్యాలో..
సద్దిదిన్నాగుడ్డా ఉయ్యాలో..
జగతీలో పులిమే ఉయ్యాలో..
జగతంత పచ్చన్నా ఉయ్యాలో..
గుడ్డా తెల్లన్నా ఉయ్యాలో..
అన్నా రఘురామా ఉయ్యాలో..
ఊరిముందర సెట్టూ ఉయ్యాలో..
ఊరిముందల సెట్టూ ఉయ్యాలో..
ఉసిరీకా సెట్టూ ఉయ్యాలో..
ఉసిరిక సెట్టూకూ ఉయ్యాలో..
పసిరీకా పండ్లు ఉయ్యాలో..
అన్నారఘురామ ఉయ్యాలో..
పూతెవ్వరిపూతా ఉయ్యాలో..
పూతమన సీతమ్మా పుస్తెల్లా బోలూ ఉయ్యాలో..
అన్నా రఘురామా ఉయ్యాలో..
పిందెవ్వరి పిందే ఉయ్యాలో..
పిందె మన సీతమ్మా ఉయ్యాలో..
పెండ్లీలాబోలూ ఉయ్యాలో..
అన్నా రఘురామా ఉయ్యాలో..
కాతెవ్వరికాతా ఉయ్యాలో..
కాత మన సీతమ్మా ఉయ్యాలో..
కంటెల్లా బోలు ఉయ్యాలో..
అన్నా రఘురామా ఉయ్యాలో..
పండెవ్వరి పండూ ఉయ్యాలో..
పండు మన సీతమ్మా ఉయ్యాలో..
పౌడాల బోలు ఉయ్యాలో..
* * *
15. తొమ్మిది రోజులు నమ్మిక తోడుతో..
సేకరణ : పుష్పవతి
పాడినవారు : విజయ మోజర్ల,
ఫోన్ నెం : 95157 82986
తొమ్మిది రోజులు ఉయ్యాలో..
నమ్మిక తోడుతో ఉయ్యాలో..
అల్లరి గుమ్మడి ఉయ్యాలో..
అరుగులు వేయించి ఉయ్యలో
గోరింట పూలతో ఉయ్యాలో..
గోడలు పెట్టించి ఉయ్యాలో..
తామర పూలతో ఉయ్యాలో..
ద్వారాలు పెట్టించి ఉయ్యాలో..
మొగిలి పూలతో ఉయ్యాలో..
మొగురాలు ఎక్కించి ఉయ్యాలో..
వాయిలి పూలతో ఉయ్యాలో..
వాసాలు చేయించి ఉయ్యాలో..
పొన్న పూలతోను ఉయ్యాలో..
ఇల్లును కప్పించి ఉయ్యాలో..
పసుపు ముద్దను చేసి ఉయ్యాలో
తోరణాలు కట్టించి ఉయ్యాలో..
దోసపూలతోను ఉయ్యాలో..
గౌరమ్మను నిలిపిరి ఉయ్యాలో..
చేమంతి పూలతోను ఉయ్యాలో..
చెలియను పూజింతురు ఉయ్యాలో..
సుందరాంగులెల్ల ఉయ్యాలో..
చుట్టూతా తిరిగిరి ఉయ్యాలో..
ఆటలు ఆడిరి ఉయ్యాలో..
పాటలు పాడిరి ఉయ్యాలో..
ఆటపాటలు చూసి ఉయ్యాలో..
ఆనందమొందిరి ఉయ్యాలో..
కాంతలందరికి ఉయ్యాలో..
ఆడినవారికి ఉయ్యాలో..
పాడినవారికి ఉయ్యాలో..
పాడిపంటలు కల్గు ఉయ్యాలో..
విన్నట్టివారికి ఉయ్యాలో..
విష్ణుపథము కల్గు ఉయ్యాలో..
* * *
16. నాగేటి సాల్లల్ల ఉయ్యాలో..
సేకరణ : పుష్పవతి
పాడినవారు : విజయ మోజర్ల,
ఫోన్ నెం : 95157 82986
నాగేటి సాల్లల్ల ఉయ్యాలో..
సీతమ్మా పుట్టింది ఉయ్యాలో..
జనకమారాజింట ఉయ్యాలో..
పెరిగింది సీతమ్మ ఉయ్యాలో
పెరిగినా సీతమ్మ ఉయ్యాలో..
పెళ్లిళ్లు గోరింది ఉయ్యాలో..
ఏడిండ్ల సందునా ఉయ్యాలో..
ఎలబద్రి చెట్టుంది ఉయ్యాలో..
ఆ ఎలబద్రి చెట్టుకూ ఉయ్యాలో..
ఏడే మొగ్గలూ ఉయ్యాలో..
ఏడు మొగ్గల పత్తి ఉయ్యాలో..
తక్కెడూ అయ్యింది ఉయ్యాలో..
ఆ తక్కెడూ పత్తికీ ఉయ్యాలో..
వొక్కటే ఏకుంది ఉయ్యాలో..
ముసలోళ్లు వడికిరీ ఉయ్యాలో
ముత్యాల పోగు ఉయ్యాలో..
పడుసోళ్లు వడికీరి ఉయ్యాలో..
పగడాల పోగు ఉయ్యాలో..
ఆ పోగు ఈ పోగు ఉయ్యాలో..
కలె పడుగు జుట్టిందీ ఉయ్యాలో..
చింతకింది శాలయ్య ఉయ్యాలో..
చీరె నెయ్యవయ్య ఉయ్యాలో..
నేసెనే శాలయ్య ఉయ్యాలో..
నెలకొక్క గజమునూ ఉయ్యాలో..
అంచుకు ఏసిండ్రు ఉయ్యాలో..
అర్ధనాల పోగు ఉయ్యాలో..
కొంగుకూ ఏసిండ్రు ఉయ్యాలో..
బంగారు ఆ పోగు ఉయ్యాలో..
ఆ సీర నైతేనే ఉయ్యాలో..
సీతమ్మా మెచ్చెనే ఉయ్యాలో..
సీతమ్మా మెచ్చిన సీర ఉయ్యాలో..
సీతమ్మా కట్టిందే ఉయ్యాలో.. ॥ సీతమ్మా ॥
* * *
17. అంబా ఎక్కడికే ఉయ్యాలో..
సేకరణ : తాటికొండ విష్ణుమూర్తి
పాడినవారు : రోజా రమణి,
ఫోన్ నెం : 91660 93526
అంబా ఎక్కడికే ఉయ్యాలో..
జగదాంబ ఎక్కడికే ఉయ్యాలో..
కలికిచిలుకల కొలికి ఉయ్యాలో..
పోయేది ఎక్కడికే ఉయ్యాలో..
ఘనమైన పయనాలు ఉయ్యాలో..
చేసేది ఎక్కడికే ఉయ్యాలో..
సన్న చక్కెరతిన్న ఉయ్యాలో..
సతి ఎక్కడికే ఉయ్యాలో..
పండు చక్కెరతిన్న ఉయ్యాలో..
వనతీగ ఎక్కడికే ఉయ్యాలో..
నేను పోతానయ్య ఉయ్యాలో..
శ్రీశైల దేవుని ఉయ్యాలో..
శ్రీశైల దేవుని ఉయ్యాలో..
సన్నిధిలోనికి ఉయ్యాలో..
పెట్టేటి సొమ్ములు ఉయ్యాలో..
మరిచిపోతావా ఉయ్యాలో..
కట్టేటి చీరలూ ఉయ్యాలో..
విడిచిపోతావా ఉయ్యాలో..
పెట్టేటి గాజులూ ఉయ్యాలో..
మరిచీ పోతావా ఉయ్యాలో..
పసుపుకుంకుమ భరణి ఉయ్యాలో..
మరిచీ పోతావా ఉయ్యాలో..
శివపూజకూ నేను ఉయ్యాలో..
అందనే పోతాను ఉయ్యాలో..
దేవతార్చన నేను ఉయ్యాలో..
చేసుకుంటాను ఉయ్యాలో..
పూజకూ పువ్వులూ ఉయ్యాలో..
కోయనేబోతాను ఉయ్యాలో..
హేమద్వారానికీ ఉయ్యాలో..
కావలీ ఉందునూ ఉయ్యాలో..
అడవి పక్షులవోలె ఉయ్యాలో..
ఎగసీపోతాము ఉయ్యాలో..
జోడుపక్షులవోలె ఉయ్యాలో..
జోడిగా పోతాము ఉయ్యాలో..
ఇద్దరం ఒకటై ఉయ్యాలో..
ఎగిరిపోతాము ఉయ్యాలో..
నేను పోతానయ్య ఉయ్యాలో..
శ్రీశైల దేవునీ ఉయ్యాలో..
శ్రీశైల దేవునీ ఉయ్యాలో..
సన్నిధీలోనికి ఉయ్యాలో..
పండ్లు పలహారములు ఉయ్యాలో..
కోయ నేబోతాను ఉయ్యాలో..
అదిగదిగో పూలరథము ఉయ్యాలో..
వస్తనే ఉన్నదీ ఉయ్యాలో..
వస్తనే ఉన్నదీ ఉయ్యాలో..
పోతనే ఉన్నదీ ఉయ్యాలో..
* * *
18. ముద్రదేశపు రాజు ఉయ్యాలో..
సేకరణ : తాటికొండ విష్ణుమూర్తి
పాడినవారు : రోజా రమణి,
ఫోన్ నెం : 91660 93526
ముద్రదేశపు రాజు ఉయ్యాలో..
మహారాజా అశ్వపతి ఉయ్యాలో..
తనసతి మాళవితో ఉయ్యాలో..
పాలించుచుండెను ఉయ్యాలో..
సిరిసంపదలున్న ఉయ్యాలో..
సంతానమే లేదు ఉయ్యాలో..
సంతానము కొరకు ఉయ్యాలో..
పరమ భక్తితోను ఉయ్యాలో..
పార్వతీదేవిని ఉయ్యాలో..
వారు కొలువంగా ఉయ్యాలో..
ఆమె ప్రత్యక్షమై ఉయ్యాలో..
మీకు సంతూకలుగు ఉయ్యాలో..
ఆమెకు పెట్టుము ఉయ్యాలో..
సావిత్రి యని పేరు ఉయ్యాలో..
ఆశీర్వదించియు ఉయ్యాలో..
అదృశ్య మయ్యెను ఉయ్యాలో..
సాధ్వి మాళవిదేవి ఉయ్యాలో..
గర్భమును దాల్చియు ఉయ్యాలో..
ప్రసవించే పుత్రికను ఉయ్యాలో..
ఆమెయే సావిత్రి ఉయ్యాలో..
పదహారు ఏండ్లు ఉయ్యాలో..
పడ్డాయి తల్లికి ఉయ్యాలో..
ఒకరోజు కలలోన ఉయ్యాలో..
కనిపించె ఆమెకు ఉయ్యాలో..
సత్యవంతుడనే ఉయ్యాలో..
అతి సుందరాంగుడు ఉయ్యాలో..
అతనిని ప్రేమించి ఉయ్యాలో..
అతని బొమ్మను వేసె ఉయ్యాలో..
తల్లిదండ్రికి తెలిపె ఉయ్యాలో..
అతన్ని పెండ్లాడుదునని ఉయ్యాలో..
అంతలో అరుదెంచె ఉయ్యాలో..
నారద మహర్షి ఉయ్యాలో..
సత్యవంతుని గూర్చి ఉయ్యాలో..
తమకు తెలుపుమాని ఉయ్యాలో..
పటమును చూపించె ఉయ్యాలో..
నారదునికి రాజు ఉయ్యాలో..
సాళ్వపతి యువరాజు ఉయ్యాలో..
వీరాధివీరుడు ఉయ్యాలో..
విధివశముచే నితడు ఉయ్యాలో..
రాజ్యమ్ము కోల్పోయె ఉయ్యాలో..
వారి తల్లిదండ్రులు ఉయ్యాలో..
అంధులై యున్నారు ఉయ్యాలో..
వారిని సేవిస్తు ఉయ్యాలో..
వనములో ఉన్నాడు ఉయ్యాలో..
పెండ్లయిన తరువాత ఉయ్యాలో..
సత్యవంతునకు ఉయ్యాలో..
ఏడాది ఆయువు ఉయ్యాలో..
మాత్రమే యున్నది ఉయ్యాలో..
ఈ రీతిగా తెలిపె ఉయ్యాలో..
నారదుడు అపుడు ఉయ్యాలో..
ఆ రాజ దంపతులు ఉయ్యాలో..
మిగుల చింతించిరి ఉయ్యాలో..
ఎంత చెప్పినగాని ఉయ్యాలో..
సావిత్రి వినదాయె ఉయ్యాలో..
సత్యవంతునికి ఉయ్యాలో..
సావిత్రి నిచ్చి ఉయ్యాలో..
పెండ్లియైన చేసె ఉయ్యాలో..
విధి తప్పదాని ఉయ్యాలో..
అడవిలో సావిత్రి ఉయ్యాలో..
అతి భక్తితోడ ఉయ్యాలో..
అత్తమామల సేవ ఉయ్యాలో..
ఉత్తమంబుగచేయ ఉయ్యాలో..
పతిభక్తినైనా ఉయ్యాలో..
మరువకా ఎన్నడు ఉయ్యాలో..
ఆదరించుచుండె ఉయ్యాలో..
అతిథి సత్పురుషులను ఉయ్యాలో..
తన మాంగల్యమును ఉయ్యాలో..
నిలుపుమని నిత్యము ఉయ్యాలో..
లక్ష్మి గౌరమ్మలను ఉయ్యాలో..
ప్రార్థించు చుండె ఉయ్యాలో..
అంతటా ఏడాది ఉయ్యాలో..
గడచి పోయినాది ఉయ్యాలో..
ఆరోజు తన భర్త ఉయ్యాలో..
ఆఖరి దినమాని ఉయ్యాలో..
అత్తమామల తోటి ఉయ్యాలో..
ఆజ్ఞను పొందియు ఉయ్యాలో..
అడవికి పోతున్న ఉయ్యాలో..
భర్తతో సావిత్రి ఉయ్యాలో..
వనవిహారమునకు ఉయ్యాలో..
తాను వచ్చెదననెను ఉయ్యాలో..
సత్యవంతుడు ఉయ్యాలో..
అడవి లోపలాను ఉయ్యాలో..
కట్టెలు కొట్టుచు ఉయ్యాలో..
తెచ్చె దాననుచును ఉయ్యాలో..
గొడ్డలి ధరించి ఉయ్యాలో..
వృక్షములు ఛేదింప ఉయ్యాలో..
ప్రొద్దు గ్రుంకుచుండె ఉయ్యాలో..
చీకటిపడుచుండె ఉయ్యాలో..
శిరోవేదన యంచు ఉయ్యాలో..
సతి ఒడిలో తలవాల్చె ఉయ్యాలో..
భయమొందుచుండెను ఉయ్యాలో..
సావిత్రికి అపుడు ఉయ్యాలో..
యముడు పాశంబుతో ఉయ్యాలో..
సావిత్రిదేవికి ఉయ్యాలో..
కనిపించెనపుడు ఉయ్యాలో..
సాధ్వి ఆ తల్లికి ఉయ్యాలో..
చేతులెత్తి మ్రొక్కె ఉయ్యాలో..
ఎవరయ్య మీరు ఉయ్యాలో..
పతివ్రతవు కాబట్టి ఉయ్యాలో..
నన్ను చూచితివంచు ఉయ్యాలో..
యమ ధర్మరాజునని ఉయ్యాలో..
అపుడు చెప్పుచుండె ఉయ్యాలో..
నేటితో నీ భర్త ఉయ్యాలో..
ఆయువు దీరెనని ఉయ్యాలో..
భర్త ప్రాణమును ఉయ్యాలో..
బంధించుకున్నాడు ఉయ్యాలో..
పోవుచుండె యముడు ఉయ్యాలో..
సావిత్రి చూడంగ ఉయ్యాలో..
యముని వెంటాబడి ఉయ్యాలో..
పోవుచుండే దేవి ఉయ్యాలో..
పతిలేని సతి బ్రతుకు ఉయ్యాలో..
తనకేల యనుచును ఉయ్యాలో..
నాయి ప్రాణంబులు ఉయ్యాలో..
తీసుకొని పోమనుచు ఉయ్యాలో..
నీకింకా ఆయువు ఉయ్యాలో..
చాల ఉన్నదనుచు ఉయ్యాలో..
వెను తిరిగిపోవమ్మ ఉయ్యాలో..
రాలేవు ముందుకు ఉయ్యాలో..
యముడు అదృశ్యమై ఉయ్యాలో..
పోవుచుండెనపుడు ఉయ్యాలో..
తన ఇష దైవమ్మును ఉయ్యాలో..
ప్రార్థించె సావిత్రి ఉయ్యాలో..
యముడు మహిషముపైన ఉయ్యాలో..
పోవుచుండుట గాంచి ఉయ్యాలో..
రాజ ఓ రాజ ఉయ్యాలో..
యమధర్మరాజ ఉయ్యాలో..
నేనింత దూరము ఉయ్యాలో..
నీవెంట వచ్చితి ఉయ్యాలో..
నా ప్రాణనాథుని ఉయ్యాలో..
వదలి పొమ్మనగా ఉయ్యాలో..
సావిత్రి మాటలకు ఉయ్యాలో..
యముడు సంతసమొంది ఉయ్యాలో..
కోరుకో ఒక వరము ఉయ్యాలో..
పతి ప్రాణములు దప్ప ఉయ్యాలో..
నా అత్తమామలు ఉయ్యాలో..
రాజ్యములను బాసి ఉయ్యాలో..
అంధులై అడవిలో ఉయ్యాలో..
తిరుగుచున్నారనిన ఉయ్యాలో..
వారికి దృష్టియు ఉయ్యాలో..
రాజ్యమ్ము గూడ ఉయ్యాలో..
ప్రాప్తించినదని ఉయ్యాలో..
ఇక వెళ్ళుమనెను ఉయ్యాలో..
అంతటా యముడు ఉయ్యాలో..
అదృశ్యమైపాయె ఉయ్యాలో..
మరల సావిత్రి ఉయ్యాలో..
ఆ దైవకృపవల్ల ఉయ్యాలో..
యముని వెంటాడుచు ఉయ్యాలో..
పోవుచుండెనపుడు ఉయ్యాలో..
క్రూరమృగములతోని ఉయ్యాలో..
ఘోర అరణ్యములోన ఉయ్యాలో..
యమధర్మరాజును ఉయ్యాలో..
అనుసరించుచు నుండె ఉయ్యాలో..
అదిగాంచిన యముడు ఉయ్యాలో..
ఆడుదాన వనుచు ఉయ్యాలో..
కోరుకొమ్మనుచును ఉయ్యాలో..
ఇంకొక్క వరమును ఉయ్యాలో..
నా తల్లిదండ్రులు ఉయ్యాలో..
సంతు లేనివారు ఉయ్యాలో..
ఈ వార్త విన్నను ఉయ్యాలో..
వారు తాళాలేరు ఉయ్యాలో..
నీ తల్లిదండ్రులకు ఉయ్యాలో..
సంతానమిస్తి ఉయ్యాలో..
పోయిరా అనుచును ఉయ్యాలో..
పోవుచుండె యముడు ఉయ్యాలో..
కఠినమైన యముని ఉయ్యాలో..
మనసు కరిగింతునని ఉయ్యాలో..
తన పతి ప్రాణములు ఉయ్యాలో..
కాపాడుకొందునని ఉయ్యాలో..
మళ్ళీ వెంటాడెను ఉయ్యాలో..
యముని మార్గంబున ఉయ్యాలో..
తిరిగి చూచె యముడు ఉయ్యాలో..
కనులెర్ర జేసెను ఉయ్యాలో..
నీ మీద జాలిచే ఉయ్యాలో..
రెండు వరమూ లిస్తి ఉయ్యాలో..
ఆగ్రహంబున అపుడు ఉయ్యాలో..
యముడు పలుకూచుండ ఉయ్యాలో..
రెండు వరములు మీరు ఉయ్యాలో..
ఇస్తిరీ గాని ఉయ్యాలో..
ముచ్చటగ మూడవ ఉయ్యాలో..
కోరిక తీర్చుమనె ఉయ్యాలో..
అయిన కోరుకొమ్ము ఉయ్యాలో..
మరియొక్క వరము ఉయ్యాలో..
అదియును నీ పతి ఉయ్యాలో..
ప్రాణములు దప్ప ఉయ్యాలో..
పతి లేక యున్ననూ ఉయ్యాలో..
పుత్రుని గాంచియు ఉయ్యాలో..
కాలమ్ము గడుపుదు ఉయ్యాలో..
దయచేయుమయ్య ఉయ్యాలో..
ఎనుక ముందాడక ఉయ్యాలో..
ఆ యముడు అపుడు ఉయ్యాలో..
సంతానమూ నీకు ఉయ్యాలో..
ఇస్తి పొమ్మనెను ఉయ్యాలో..
అంతలో సావిత్రి ఉయ్యాలో..
యముని కడ్డము తిరిగె ఉయ్యాలో..
రాజ ఓ రాజా ఉయ్యాలో..
ఓ ధర్మరాజా ఉయ్యాలో..
నువ్వన్న మాటలు ఉయ్యాలో..
ఎట్లు వర్తించు ఉయ్యాలో..
పతిలేక సతులకు ఉయ్యాలో..
సంతు ఎట్ల కలుగు ఉయ్యాలో..
ఇది ఎట్టి ధర్మంబు ఉయ్యాలో..
వివరించు మనిన ఉయ్యాలో..
ఆ మాట వినియు ఉయ్యాలో..
ఆశ్చర్యమొందియు ఉయ్యాలో..
అమ్మ నీ పతిభక్తి ఉయ్యాలో..
మెచ్చితీ నంచును ఉయ్యాలో..
నీ భర్త ప్రాణములు ఉయ్యాలో..
ఇస్తి పొమ్మనెను ఉయ్యాలో..
నీకు సంతతి కలుగు ఉయ్యాలో..
శుభములూ చేకూరు ఉయ్యాలో..
దీవించి యముడు ఉయ్యాలో..
తనదారి పోయెను ఉయ్యాలో..
వెనకకు మరలింది ఉయ్యాలో..
సావిత్రి దేవి ఉయ్యాలో..
శీఘ్రమే అప్పుడు ఉయ్యాలో..
భర్త సన్నిధి చేరె ఉయ్యాలో..
భర్తను లేచెను ఉయ్యాలో..
నిద్ర మేల్కొన్నట్లు ఉయ్యాలో..
అత్తమామల చేరె ఉయ్యాలో..
పతిని తోలుకొని ఉయ్యాలో..
వృత్తాంత మంతయు ఉయ్యాలో..
వారికి వివరించె ఉయ్యాలో..
తిరిగి రాజ్యము వారు ఉయ్యాలో..
పొందిరీ ముదమున ఉయ్యాలో..
సుఖశాంతుల తోటి ఉయ్యాలో..
వర్ధిల్లు చుండిరీ ఉయ్యాలో..
ఈ పాట ఎవ్వరూ ఉయ్యాలో..
పాడినా విన్నా ఉయ్యాలో..
ఆయురారోగ్యములు ఉయ్యాలో..
సుఖశాంతులు కలుగు ఉయ్యాలో..
* * *
19. ఎంత చక్కని తల్లివే గౌరమ్మ..
పాడినవారు : బి. లావణ్య,
ఫోన్ నెం : 79939 82314
ఎంత చక్కని తల్లివే గౌరమ్మ..
ఎంత చల్లని తల్లివే గౌరమ్మ..
ఒక్కొక్క పోకందునా గౌరమ్మ..
ఒక్కొక్క ఆకందునా గౌరమ్మ..
కస్తూరి చలమందునా గౌరమ్మ..
రాచబాలందునా గౌరమ్మ.. ॥ ఎంతచక్కని ॥
మముజూచి యాయన్నలు గౌరమ్మ..
ఏడుమేడాలెక్కిరి గౌరమ్మ..
ఏడుమేడలమీదా గౌరమ్మ..
ఏడాదికొకదీపమూ గౌరమ్మ..
ఏడుకోటాలెక్కిరి గౌరమ్మ..
ఎలుకకోటాలెక్కిరి గౌరమ్మ.. ॥ ఎంతచక్కని ॥
పల్లెకోటానెక్కె గౌరమ్మ..
పత్తిర్లు దూయంగనూ గౌరమ్మ..
దొంగలేమో దోచీరీ గౌరమ్మ..
బంగారుగుండవనమూ గౌరమ్మ.. ॥ ఎంతచక్కని ॥
తబుకులో తబికేడూ గౌరమ్మ..
ముత్యాలు తీసుకొనీ గౌరమ్మ..
గుమ్మాడి కుచ్చులతో గౌరమ్మ..
గుణముగా వచ్చీరీ గౌరమ్మ.. ॥ ఎంతచక్కని ॥
సొమ్ములూ పెట్టూకొని గౌరమ్మ..
ఇమ్ముగానూ వచ్చిరి గౌరమ్మ..
గుమ్మడిపువ్వులన్ని గౌరమ్మ..
గుత్తులకట్టుకొచ్చె గౌరమ్మ.. ॥ ఎంతచక్కని ॥
ఈడనే పెండ్లాడవే గౌరమ్మ..
ఈడనే పసుపాడవే గౌరమ్మ..
వాడవాడల జనమూ గౌరమ్మ..
వాలలాడింతురమ్మా గౌరమ్మ.. ॥ ఎంతచక్కని ॥
* * *
20. నిజం మల్లయ్య దారిలో….
సేకరణ : నీరంజమ్మ అంగూరి
పాడినవారు : గుమ్మకొండ కళమ్మ, ఫోన్ నెం : 85230 72218
నిజం మల్లయ్య దారిలో.. నిజం మల్లయ్య దారిలో..
ఈతశెట్టూ తాటిశెట్టు కలెవేనూకున్నదో.. నిజం మల్లయ్య దారిలో..
నిజం మల్లయ్య దారిలో.. నిజం మల్లయ్య దారిలో..
ఈతశెట్టూ కిందనేవొ ఈడిగోల్లా పిల్లరో.. నిజం మల్లయ్య దారిలో..
నిజం మల్లయ్య దారిలో.. నిజం మల్లయ్య దారిలో..
ఈడిగోల్ల పిల్లంటా కల్లమ్మూతున్నదో.. నిజం మల్లయ్య దారిలో..
నిజం మల్లయ్య దారిలో.. నిజం మల్లయ్య దారిలో..
కందనూలి వాసులంట కల్లంటూ వొచ్చిరో.. నిజం మల్లయ్య దారిలో..
నిజం మల్లయ్య దారిలో.. నిజం మల్లయ్య దారిలో..
కల్లులేవో గలిపింది ఈడిగోల్లా పిల్లరో.. నిజం మల్లయ్య దారిలో..
నిజం మల్లయ్య దారిలో.. నిజం మల్లయ్య దారిలో..
సావితోడు బూవితోడు నేనుగలుపాలేదురో.. నిజం మల్లయ్య దారిలో..
నిజం మల్లయ్య దారిలో.. నిజం మల్లయ్య దారిలో..
తంగెడు పూవుతోడు తల్లుల్లా తోడురో.. నిజం మల్లయ్య దారిలో..
నిజం మల్లయ్య దారిలో.. నిజం మల్లయ్య దారిలో..
తాటీ పూవులతోతోడు తండ్రుల్లా తోడురో.. నిజం మల్లయ్య దారిలో..
నిజం మల్లయ్య దారిలో.. నిజం మల్లయ్య దారిలో..
అరటిపూవులతోడు అన్నల్లాతోడురో.. నిజం మల్లయ్య దారిలో..
నిజం మల్లయ్య దారిలో.. నిజం మల్లయ్య దారిలో..
ఒద్దీ పూవులతోడు ఒదినల్లా తోడురో.. నిజం మల్లయ్య దారిలో..
నిజం మల్లయ్య దారిలో.. నిజం మల్లయ్య దారిలో..
ఆనప పూవుల తోడు అక్కల్లా తోడురో.. నిజం మల్లయ్య దారిలో..
నిజం మల్లయ్య దారిలో.. నిజం మల్లయ్య దారిలో..
బంతీపూవుల తోడు బావల్లా తోడురో.. నిజం మల్లయ్య దారిలో..
నిజం మల్లయ్య దారిలో.. నిజం మల్లయ్య దారిలో..
తుమ్మాపూవుల తోడు తమ్ముల్లా తోడురో.. నిజం మల్లయ్య దారిలో..
నిజం మల్లయ్య దారిలో.. నిజం మల్లయ్య దారిలో..
మర్రీపూవులతోడు మరుదల్లాతోడురో.. నిజం మల్లయ్య దారిలో..
నిజం మల్లయ్య దారిలో.. నిజం మల్లయ్య దారిలో..
శెనిగా పూవులతోడు శెల్లెండ్లా తోడురో.. నిజం మల్లయ్య దారిలో..
నిజం మల్లయ్య దారిలో.. నిజం మల్లయ్య దారిలో..
బీరపూవులతోడు బిడ్డల్లా తోడురో.. నిజం మల్లయ్య దారిలో..
నిజం మల్లయ్య దారిలో.. నిజం మల్లయ్య దారిలో..
కొర్రాపూవులతోడు కొడుకుల్లా తోడురో.. నిజం మల్లయ్య దారిలో..
****