ఆదివారం 07 మార్చి 2021
Siddipet - Jan 10, 2021 , 00:08:03

సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ నంబర్‌వన్‌

సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ నంబర్‌వన్‌

ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి

కొమురవెల్లి, జనవరి 9 : సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ నంబర్‌వన్‌గా నిలిచిందని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. శనివారం మంలడంలోని మర్రిముచ్చాలలోని ఎస్సీ కాలనీలో రూ.17లక్షల నిధులతో 40 వేల లీటర్ల కెపాసిటీ గల మిషన్‌ భగీరథ వాటర్‌ ట్యాంకు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే ఎంపీపీ తలారి కిర్తన, జడ్పీటీసీ సిలువేరు సిద్దప్ప, సర్పంచ్‌ బొడిగం పద్మతో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ పాలనలో దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయన్నారు. కేంద్రం నుంచి తెలంగాణకు రూ. 2.75 కోట్లు రావాల్సి ఉండగా, కేవలం రూ.లక్ష 45 కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు. బండి సం జయ్‌, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి దమ్ముంటే తెలంగాణకు రావాల్సిన నిధులు తీసుకురావాలన్నారు. తాను చెప్పింది తప్పని నిరూపిస్తే క్షమాపణ చెబుతానని సవాల్‌ విసిరారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు గీస భిక్షపతి, పీసీసీఎస్‌ చైర్మన్‌ వంగ చంద్రారెడ్డి, గ్రామశాఖ అధ్యక్షుడు నర్సింగరావు, తలారి కిషన్‌, ముత్యం నర్సింహులుగౌడ్‌,  మల్లేశం, కృష్ణాగౌడ్‌, బొడిగం కృష్ణారెడ్డి, మహేశ్‌, వంశీ, తలారి యాదయ్య పాల్గొన్నారు.


VIDEOS

logo