గురువారం 01 అక్టోబర్ 2020
Siddipet - Feb 29, 2020 , 23:42:47

కొత్త ఇండ్లకు మురిపెంగా..

కొత్త ఇండ్లకు మురిపెంగా..

అధునాతన నిర్మాణాలు, చక్కటి వసతులతో ములుగు మండలం తునికిబొల్లారంలో నిర్మించిన ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ ఇండ్లల్లోకి నిర్వాసితులు ఉత్సాహంగా చేరుతున్నారు. కొండపోచమ్మ జలాశయం నిర్మాణంలో ముంపునకు గురవుతున్న తానేదార్‌పల్లి, తానేదార్‌పల్లి తండా, మామిడ్యాల గ్రామస్తులకు కలిపి ఇప్పటికే 510 ఇండ్లను అప్పగించింది. తానేదార్‌పల్లి తండా దాదాపు ఖాళీ అయ్యింది. తమ సామగ్రిని సర్దుకొని నూతన ఇండ్లకు చేరుతున్నారు. తాము పుట్టిన గ్రామంతో ఉన్న జ్ఞాపకాలకు వీడ్కోలు పలికి కొత్త జీవితాల్లోకి అడుగుపెడుతున్నారు.

ములుగు : ప్రభుత్వం సకల వసతులతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన పునరావాస కేంద్రాలకు నిర్వాసితులు తమ గ్రామాలకు వీడ్కోలు పలికి, కుటుంబ సమేతంగా తరులుతున్నారు. కొండపోచమ్మ రిజర్వాయర్‌ ముంపు గ్రామాల ప్రజలు శనివారం వారి వారి పాత ఇండ్లను కూలగొట్టే పనిలో నిమగ్నమయ్యారు. సామగ్రి సర్ది, సంబురంగా తునికిబొల్లారంలోని పునరావాస కేంద్రానికి బయలుదేరారు. తానేదారుపల్లి, తానేదారుపల్లి తండా, మామిడ్యాల గ్రామాల్లోని ప్రజలు వారి ఇండ్లలో ఉన్నటువంటి సామగ్రిని సర్దుకోవడంతో పాటు పనికి వచ్చే ఇంటి కలపను, కిటికీలు, ఇతరత్రా వస్తువులు తీసుకెళ్లడానికి సిద్ధం చేసుకుంటున్నారు. మరికొన్ని కుటుంబాలు వారి వారి ఇంట్లో ఉన్న సామాన్లు తీసుకొని వెళ్లారు. రెండు మూడు రోజుల్లో పూర్తిగా ఇండ్లను కూలగొట్టనున్నారు. ఇప్పటికే తానేదారుపల్లి తండాకు చెందిన వారు వారి ఇండ్లను కూలగొట్టారు. బైలాంపూర్‌ గ్రామానికి చెందిన వాళ్లు నేడు లేదా రేపు తున్కిబొల్లారంలోని ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలో సామూహిక గృహప్రవేశాలకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఈ గ్రామానికి చెందిన ముస్లిం కుటుంబాలు ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీకి చేరుకున్నారు. తమ గ్రామాలతో ఉన్న ఆత్మీయ బంధాలను, తమ జ్ఞాపకాలకు వీడ్కోలు పలికి కొత్త జీవితాల్లో అడుగుపెడుతున్నారు.


తాజావార్తలు


logo