శనివారం 19 సెప్టెంబర్ 2020
Siddipet - Feb 02, 2020 , 23:07:26

ప్లాస్టిక్‌ నిషేధంపై యువత కృషి అభినందనీయం

ప్లాస్టిక్‌ నిషేధంపై యువత కృషి అభినందనీయం
  • దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి
  • గోసాన్‌పల్లిలో జూట్‌బ్యాగ్‌ల తయారీ కేంద్రం ప్రారంభం

దుబ్బాక,నమస్తే తెలంగాణ : నేటి సమజంలో చాలామంది యువత తమ స్వార్థ ప్రయోజనాల, విలాస జీవితాల కోసం పోటీపడుతున్నారు.. మరికొంత మంది కంప్యూటర్‌, సెల్‌ఫోన్‌లతో తమ విలువై సమయాన్ని వృథా చేసుకుంటున్నారు. ఇందుకు విరుద్ధంగా గోసాన్‌పల్లి యువత తమవంతుగా సమజానికి మేలు చేసేందుకు తీసుకున్న నిర్ణయం ఎంతో అభినందనీయమని శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్‌ , ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అన్నారు. జిల్లాలో మారుమూల ప్రాంతమైన గోసాన్‌పల్లిలో యువత జూట్‌బ్యాగ్‌ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం శుభపరిణామమన్నారు. సమాజసేవలో యువజన సంఘాలు ముందుకు రావడం అభినందించదగ్గ విషయమని ఎమ్మెల్యే సోలిపేట కొనియడారు. ఆదివారం దుబ్బాక మండలం గోసాన్‌పల్లిలో యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జూట్‌ బ్యాగ్‌(బట్ట సంచులు) తయారీ కేంద్రాన్ని ఎమ్మెల్యే రామలింగారెడ్డి ప్రారంభించారు. 


సామాజిక స్పృహతో ప్లాస్టిక్‌ నివారణ కోసం గోసాన్‌పల్లి యువత జూట్‌ బ్యాగ్‌లు తయారు చేయడం చాల సంతోషకరమన్నారు. ప్లాస్టిక్‌ వినియోగంతో మనవ మనుగడ కష్టతరమవుతున్న క్రమంలో..ప్రత్యామ్నాయ పరిస్థితులను కనుగొనటం చాలా సంతోషకరమన్నారు. గోసాన్‌పల్లి యువత దుబ్బాక మండలంలోనే కాకుండా జిల్లాలోనే  ఆదర్శంగా నిలుస్త్తారన్నారు.  ప్లాస్టిక్‌ నిషేధంపై ప్రసంగాలు చేయడం తప్ప ఆచరించడం లేదన్నారు.  మంచి కార్యక్రమాలకు తాము ఎల్లప్పడు ముందుంటానని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తన వంతుగా రూ.15 వేల విలువైన జూట్‌బ్యాగ్‌లు కొనుగోలు చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కడతల రవీందర్‌రెడ్డి, మండల సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు తౌడ శ్రీనివాస్‌, సర్పంచ్‌ లక్ష్మి, ఎంపీటీసీ పోలబోయిన లక్ష్మి, నాయకులు రొట్టె రమేశ్‌, నారాగౌడ్‌, తిరుపతి, నర్సయ్య తదితరులున్నారు. 


logo