Xiaomi Civi : అద్భుతమైన ఫీచర్లతో ‘జియోమీ సివి’ స్మార్ట్‌ఫోన్.. లాంచ్ ఎప్పుడంటే?
అద్భుతమైన ఫీచర్లతో జియోమీ సివి స్మార్ట్‌ఫోన్ | ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ జియోమీ.. తన సరికొత్త ఫోన్ జియోమీ సివిని విడుదల చేయబోతోంది
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ జియోమీ.. తన సరికొత్త ఫోన్ జియోమీ సివిని విడుదల చేయబోతోంది. సెప్టెంబర్ 27న అంటే రేపు ఈ ఫోన్ చైనాలో విడుదల కానుంది. చైనాలో విడుదల అయిన తర్వాత భారత్‌తో పాటు ఇతర దేశాల్లో ఈ మోడల్ ఫోన్‌ను విడుదల చేయనున్నట్టు జియోమీ ప్రకటించింది.

అయితే.. ఈ ఫోన్ విడుదలకు ముందే.. ఫోన్ బెస్ట్ ఫీచర్లను జియోమీ ప్రకటించింది. అక్టా కోర్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 778జీ ఎస్వోసీ, ట్రిపుల్ రేర్ కెమెరా, కర్వ్డ్ డిస్ప్లే లాంటి అత్యాధునికమైన ఫీచర్లతో ఫోన్ విడుదల కానుంది.

4500 ఎంఏహెచ్ బ్యాటరీ, 32 ఎంపీ కెమెరా, డ్యుయల్ సాఫ్ట్ లైట్ ఎల్ఈడీ ఫ్లాష్, ఆటోఫోకస్ లెన్స్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్, లౌడ్ స్పీకర్ గ్రిల్లె, ప్రైమరీ మైక్రోఫోన్, సిమ్ కార్డ్ స్లాట్, ఇన్ఫ్రారెడ్(ఐఆర్) సెన్సార్ లాంటి ఫీచర్లు ఈ ఫోన్లో ఉండనున్నాయి. అయితే.. జియోమీ సివి ఫోన్‌తో పాటు ఈ సిరీస్‌లో భాగంగా మరికొన్ని మోడల్స్‌ను జియోమీ లాంచ్ చేయనున్నట్టు తెలుస్తోంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Google Pixel 6 and 6 Pro : అత్యాధునికమైన కెమెరా ఫీచర్లతో గూగుల్ పిక్సెల్ ఫోన్లు
Samsung Galaxy M52 5G : రిలీజ్‌కు ముందే సామ్సంగ్ గెలాక్సీ ఎం52 ఫీచర్లు లీక్.. ధర ఎంతంటే?
iPhone 13 : ఐఫోన్ 13 సేల్స్ ప్రారంభం.. బుకింగ్ ఎలా? ఔట్లెట్స్ ఎక్కడ ఉన్నాయి?
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

