World’s First Solar Generator | లిథియమ్ బ్యాటరీలకు ప్రత్యామ్నాయంగా సోలార్ జనరేటర్లు.. వేటి కోసం వాడుతారంటే?
World's First Solar Generator | ఏ వాహనంలో అయినా బ్యాటరీ కంపల్సరీ. చివరకు ఎలక్ట్రిక్ వాహనాలకు కూడా బ్యాటరీ ఉండాల్సిందే. ఆ బ్యాటరీని చార్జ్ చేస్తేనే కదా ఎలక్ట్రిక్ వాహనం ముందుకు వెళ్లేది.
World’s First Solar Generator | ఈరోజుల్లో జనరేటర్, బ్యాటరీలు లేకుంటే జీవితం ముందుకు సాగదు. బైక్ దగ్గర్నుంచి.. కారు, బస్సు.. ఏ వాహనంలో అయినా బ్యాటరీ కంపల్సరీ. చివరకు ఎలక్ట్రిక్ వాహనాలకు కూడా బ్యాటరీ ఉండాల్సిందే. ఆ బ్యాటరీని చార్జ్ చేస్తేనే కదా ఎలక్ట్రిక్ వాహనం ముందుకు వెళ్లేది. చాలామటకు బ్యాటరీలను లిథియం( lithium-ion batteries)తో తయారు చేస్తారు. ఈ మధ్య వాహనాల వాడకం పెరగడం.. ప్రతి చోట బ్యాటరీల అవసరం కూడా పెరగడంతో లిథియంతో తయారు చేసే బ్యాటరీలకు డిమాండ్ పెరిగింది. అయితే.. డిమాండ్‌కు తగ్గ సప్లయి మాత్రం ప్రస్తుతం అందడం లేదు. దానికి కారణం.. లిథియం కొరత.

అనుకున్నంతగా లిథియం సరఫరా లేకపోవడంతో.. లిథియంతో తయారు చేసే బ్యాటరీలకు కొరత ఏర్పడుతుంది. ఇంకొన్ని ఏళ్ల తర్వాత పూర్తిగా లిథియం దొరక్కపోతే.. దానితో తయారు చేసే బ్యాటరీలు కూడా ఉండవు. దాని వల్ల ప్రపంచమే స్తంభించిపోయే ప్రమాదం ఉంది. దానికి అల్టర్నేట్గా మేమున్నాం అంటూ బ్లుయెట్టి(Bluetti) అనే కంపెనీ ముందుకొచ్చింది.
World’s First Solar Generator | సోడియం అయాన్ సోలార్ జనరేటర్లను తీసుకొచ్చిన బ్లుయెట్టి
యూఎస్‌లోని లాస్ వెగాస్‌కు చెందిన పవర్ సొల్యూషన్స్ కంపెనీయే బ్లుయెట్టి. తాజాగా సోడియం అయాన్ సోలార్ జనరేటర్లను ఈ కంపెనీ తయారు చేసింది. త్వరలో ప్రారంభం కాబోయే టెక్ ఈవెంట్ సీఈఎస్ 2022లో ఈ బ్యాటరీలను లాంచ్ చేయనుంది.
దానికి NA300 అనే పేరు పెట్టింది. లిథియం అయాన్‌ను కాకుండా.. సోడియం అయాన్‌ను ఉపయోగించుకొని ఈ సోలార్ పవర్ జనరేటర్‌ను కంపెనీ తయారు చేసింది. అలాగే.. జనరేటర్ కెపాసిటీని పెంచడం కోసం B480 పేరుతో సోడియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్‌ను కూడా కంపెనీ సీఈఎస్ 2022లో లాంచ్ చేయనుంది.
సోలార్ ఆధారిత బ్యాటరీలను వాహనాలకు వాడొచ్చు. ఇంటికి ఇన్వెర్టర్లా వాడుకోవచ్చు. బ్యాటరీ అవసరం ఉన్న ప్రతి చోట వీటిని వాడుకోవచ్చు. సోడియం, లిథియం.. రెండింటి కెమికల్ ప్రాపర్టీస్ దాదాపు ఒకేవిధంగా ఉండటం వల్ల.. బ్యాటరీలో వీటిని వాడి ఒకేవిధమైన కెమికల్ రియాక్షన్స్‌ను తీసుకురావచ్చు. ఈ భూమ్మీద సోడియం నిల్వలు కూడా పుష్కలంగా ఉన్నాయి. అందుకే.. సోడియంతో సోలార్ జనరేటర్లను తయారు చేసి.. లిథియంకు ప్రత్యామ్నాయంగా ఈ జనరేటర్లను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు కంపెనీ ప్రయత్నాలు చేస్తోంది.
3000 వాట్స్ సోలార్ ఇన్పుట్ కెపాసిటీతో పాటు రెండు బీ480 బ్యాటరీ ప్యాక్స్(4800 డబ్ల్యూహెచ్)తో ఈ బ్యాటరీని 12600 డబ్ల్యూహెచ్ వరకు పెంచుకునే కెపాసిటీ ఇందులో ఉంటుంది. 6000 వాట్స్ డ్యుయల్ చార్జింగ్ కెపాసిటీతో 30 నిమిషాల్లో 80 శాతం వరకు చార్జ్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
MBA student dies | పరీక్షకు ముందు యూనివర్సిటీ భవనం పైనుంచి దూకి.. ఎంబీఏ విద్యార్థిని మృతి
ఉద్యోగుల సుదీర్థ సేవలు సంస్థకు చిరస్మరణీయం : ఎస్ ఓ టు జీఎం ఎం.గోవిందరావు
DK Aruna | భూములు అమ్మి రాష్ట్రాన్ని నడుపుతారా.. సీఎం రేవంత్ రెడ్డిపై డీకే అరుణ ఫైర్!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

