Chandrayaan-3 | 14 రోజుల తర్వాత ల్యాండర్, రోవర్ ఏమైతయి?
Chandrayaan-3 | చంద్రుడిపై విజయవంతంగా ల్యాండర్‌ను సాఫ్ట్ ల్యాండ్ చేసి భారత్ జయకేతనం ఎగురవేసింది. ఉపరితలంపై దిగిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ జాబిల్లి గుట్టు విప్పేందుకు ఇప్పటికే పరిశోధనలను ప్రారంభించాయి. అయితే వాటి జీవితకాలం ఒక లూనార్ డే (14 రోజులు) మాత్రమేనని ఇప్పటికే ఇస్రో ప్రకటించింది.
Chandrayaan-3 | బెంగళూరు, ఆగస్టు 24: చంద్రుడిపై విజయవంతంగా ల్యాండర్‌ను సాఫ్ట్ ల్యాండ్ చేసి భారత్ జయకేతనం ఎగురవేసింది. ఉపరితలంపై దిగిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ జాబిల్లి గుట్టు విప్పేందుకు ఇప్పటికే పరిశోధనలను ప్రారంభించాయి. అయితే వాటి జీవితకాలం ఒక లూనార్ డే (14 రోజులు) మాత్రమేనని ఇప్పటికే ఇస్రో ప్రకటించింది. దీంతో ఆ తర్వాత ఇవి ఏమవుతాయని అందరిలో నెలకొన్న సందేహాలకు ఇస్రో చైర్మన్ సోమనాథ్ సమాధానాలిచ్చారు.
23నే ల్యాండింగ్ ఎందుకు…
చంద్రుడి ఉపరితలంపై ఒక రోజు అంటే భూమిపై సుమారుగా 29 రోజులతో సమానం. అంటే జాబిల్లి ఉపరితలంపై 14 రోజులు పగలు, 14 రోజులు రాత్రి ఉంటుంది. ఈ లెక్కన ఆగస్టు 23న చంద్రుడిపై పగలు మొదలైంది. ల్యాండర్‌ను సురక్షితంగా దించాలంటే సూర్యరశ్మి అవసరం. అందుకే 23వ తేదీని సాఫ్ట్ ల్యాండ్ చేసేందుకు ఇస్రో ఎంచుకున్నది. ఒకవేళ ఏదైనా కారణంగా ల్యాండింగ్‌లో సమస్య వస్తే పూర్తిగా సూర్యరశ్మి వచ్చిన తర్వాత… అంటే 24న ల్యాండ్ చేస్తామని ముందే ఇస్రో ప్రకటించింది. ల్యాండింగ్ వాయిదా వేయాల్సి వస్తే.. ఒక లూనార్ రోజు అనగా 29 రోజుల తర్వాత ల్యాండింగ్ చేయాల్సి వచ్చేది. ఈ లెక్కన పగలు ఏర్పడిన మొదటి రోజు ల్యాండ్ చేస్తేనే పూర్తిగా 14 రో జులు పరిశోధనలు చేసేందుకు వీలవుతుంది.
సూర్యరశ్మి ఇంధనం
విక్రమ్, ప్రజ్ఞాన్ పూర్తిగా సూర్యరశ్మి ఆధారంగా పని చేస్తాయి. జాబిల్లిపై రాత్రయితే సుమారు -180 డిగ్రీల సెల్సియస్‌కు ఉష్ణోగ్రతలు పడిపోతాయి. అందుకే చంద్రుడిపై పగలు ఉండే 14 రోజులే వీటి జీవితకాలం అని ఇస్రో ప్రకటించింది. ఆ తర్వాత రాత్రి అవగానే ప్రతికూల పరిస్థితులు ఏర్పడి ల్యాండర్, రోవర్‌లోని వ్యవస్థలు పని చేయవు.
ఆ తర్వాత కూడా పని చేస్తే బోనసే
ల్యాండర్, రోవర్‌లోని వ్యవస్థలు సూర్యరశ్మి ఆధారంగా పని చేస్తాయి కాబట్టి.. 14 రోజుల తర్వాత అవి పని చేయడం దాదాపుగా అసాధ్యం. అయితే 14 రోజుల రాత్రి తర్వాత కూడా ప్రతికూల పరిస్థితులను తట్టుకొని నిలబడితే ల్యాండర్, రోవర్ తిరిగి పని చేసే అవకాశం ఉంది. పగటి ఉష్ణోగ్రతల కారణంగా ల్యాండర్, రోవర్ సూర్యరశ్మితో ఇంధనాన్ని తయారు చేసుకొని మళ్లీ పని చేసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అదే జరిగితే అవి మరో లూనార్ డే వరకు సేవలు అందిస్తాయి. అలా జరిగితే బోనస్‌గానే భావించాలి. కానీ ల్యాండర్, రోవర్ రెండూ పని చేస్తేనే భూమికి సమాచారం చేరుతుంది. రోవర్ నేరుగా భూమిపైకి సమాచారాన్ని పంపించలేదు. ఈ కారణంగానే రోవర్ పని చేసినా, ల్యాండర్ వ్యవస్థ కుప్పకూలిపోతే మిషన్ వృథా అవుతుంది. అదే సమయంలో ల్యాండర్ ఒకటే పని చేసినా పెద్దగా ప్రయోజనం ఉండదు. జాబిల్లి ఉపరితలంపై చక్కర్లు కొడుతూ పరిశోధనలు చేసే రోవర్ పని చేయకపోయినా మిషన్ అక్కడితో ఆగిపోతుంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
ఎంజీయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ అరుణ ప్రియ సంపాదకత్వంలో డిగ్రీ ఆంగ్ల పాఠ్య పుస్తక రూపకల్పన
Jordan Church | జోర్డాన్ చర్చిలో ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు.. ఏడుగురు మృతి.. 10 మందికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

