WhatsApp | గూగుల్ డ్రైవ్‌కు పోటీగా ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్ తీసుకొస్తున్నట్లు సమాచారం. `ఛాట్ ట్రాన్స్ఫర్` పేరిట తీసుకొస్తున్న ఈ ఫీచర్ సాయంతో ఒక ఆండ్రాయిడ్ డివైజ్ నుంచి వచ్చిన డేటాను మరో లోకల్ నెట్‌వర్క్‌తో పని చేస్తున్న డివైజ్‌కు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ డెవలపింగ్ దశలో ఉందని వాట్సాఫ్ వర్గాల సమాచారం. త్వరలో యూజర్లకు అందుబాటులోకి తెస్తామని వాట్సాప్ బీటా ఇన్ఫో వర్గాల కథనం. క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా యూజర్లు తమ ఛాట్ హిస్టరీని ట్రాన్స్ఫర్ చేయడానికి ఈ ఫీచర్ ఉపకరిస్తుంది.
వాట్సాప్ కొత్తగా తీసుకొస్తున్న ఫీచర్.. యూజర్లు ఇక నుంచి గూగుల్ డ్రైవ్ వాడాల్సిన అవసరం లేకుండా చేస్తుందిన ఒక డివైజ్ నుంచి మరో డివైజ్‌కు ఛాట్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే వారు బ్యాకప్ కోసం క్లౌడ్ సర్వీసులకు వెళ్లాల్సిన అవసరం కూడా ఉండదని వాట్సాప్ బీటా ఇన్ఫో చెబుతున్నది.
ఇంతకుముందు వాట్సాప్ తన యూజర్ల కోసం ప్రాక్సీ సపోర్ట్ ఫీచర్ తీసుకొచ్చింది. ఇందుకోసం వాలంటీర్లు, సంస్థలు ఏర్పాటు చేసిన సర్వర్ల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తమ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా కమ్యూనికేట్ చేసేందుకు ఈ వాట్సాప్ ప్రాక్సీ సపోర్ట్ కనెక్ట్ చేస్తుంది. `ప్రాక్సీ సపోర్ట్‌తో ఎవరైనా వాట్సాప్‌తో కనెక్ట్ కావడం మేం తేలిక చేశాం. ఎప్పుడైనా వాట్సాప్ కనెక్షన్ బ్లాక్ అయితే, దాన్ని పునరుద్ధరించుకునేందుకు యూజర్లకు శక్తి కల్పించాం` అని వాట్సాప్ అధినేత విల్క్యాత్ కార్ట్ తెలిపారు.